ఇనుగుర్తి మండలం
ఇనుగుర్తి మండలం తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లా, మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్ పరిథిలోని మండలం.[1] తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 జులై 27న నూతన మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి,[2] ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్ 3) ప్రకారం 2022 సెప్టెంబరు 26న నూతనంగా ఇనుగుర్తి మండలాన్ని ఏర్పాటు చేస్తూ జిఓ నెం.101ను ఉత్తర్వులు జారీ చేసింది.[3][4] మండల కేంద్రం ఇనుగుర్తి.[5]
ఇది కేసముద్రం మండలం నుండి 13 కి. మీ. దూరంలో, సమీప పట్టణమైన వరంగల్ నుండి 55 కి. మీ. దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు తరువాత ఈ గ్రామం పాత మహబూబాబాదు జిల్లా లోని ఇదే కేసముద్రం మండలంలో ఉండేది.[6]
చరిత్ర
[మార్చు]ఇనుగుర్తి లో రాతి స్తంభాలపై చెక్కిన శిల్పాలు, నంది విగ్రహం, నాగేంద్రుడి విగ్రహం, ఎత్తైన యాదవరాజుల విగ్రహాలు, శాసనాలు కనిపిస్తాయి. కాకతీయులు గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి, ఉమా, రామలింగేశ్వరస్వామి, ఆలయం, శివాలయం, బ్రహ్మంగారి గుడి, అంజనేయస్వామి ఆలయాలను కాకతీయులు నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఇనుగుర్తి దేవాలయాలతో పాటు చుట్టూ గుంటి, బంగారుకత్వ, ఆరెవాణి, బేడి అనే చెరువులను నిర్మించారు.
గుంటి చెరువులో కాకతీయులు నాటిన చెట్లు, రాతి స్తంభాలతో చెరువు మధ్యలో ఉయ్యాల ఉంటుంది. ఇనుగుర్తి గ్రామం నుంచే తొలి తెనుగు దినపత్రికను 1922వ సంవత్సరంలో వద్దిరాజు సోదరులు రాఘవరంగారావు, సీతారాంచందర్‌రావు ప్రారంభించారు.[5]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- ఇనుగుర్తి
- కోమటిపల్లి
- చిన్ననాగారం
- అయ్యగారిపల్లి
- చిన్నముప్పారం
- లక్ష్మిపురం
తండాలు
[మార్చు]- చీన్యాతండ
- లాలుతండ
- మీఠ్యాతండ
- పాతతండ
- తారాసింగ్‌తండ
- రామ్ తండా
- పెద్ద తండా
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]ఇనుగుర్తి గ్రామానికి చెందిన వెంకటనారాయణ ఇండియన్ వాలీబాల్ టీమ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇదే గ్రామానికి చెందిన వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "ఇనుగుర్తి.. సీరోలు మండలాల ఏర్పాటు". web.archive.org. 2022-10-01. Archived from the original on 2022-10-01. Retrieved 2024-01-31.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Namasthe Telangana (27 July 2022). "ఇనుగుర్తి మండల ఏర్పాటుపై నోటిఫికేషన్". Archived from the original on 1 October 2022. Retrieved 1 October 2022.
- ↑ Namasthe Telangana (27 September 2022). "రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
- ↑ Andhra Jyothy (27 September 2022). "కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
- ↑ 5.0 5.1 Namasthe Telangana (26 July 2022). "మురిసిన ఇనుగుర్తి". Archived from the original on 1 October 2022. Retrieved 1 October 2022.
- ↑ Eenadu (27 September 2022). "ఇనుగుర్తి.. సీరోలు మండలాల ఏర్పాటు". Archived from the original on 1 October 2022. Retrieved 1 October 2022.