సబితా ఇంద్రారెడ్డి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సబితా ఇంద్రారెడ్డి
సబితా ఇంద్రారెడ్డి

ఆంధ్రప్రదేశ్ హోంశాఖా మాజీ మంత్రి
నియోజకవర్గము మహేశ్వరం (2009 నుంచి)
చేవెళ్ళ (2000 నుంచి 2009)

జననం (1963-05-05) 5 మే 1963 (వయస్సు: 55  సంవత్సరాలు)
కోటబాస్పల్లి
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
సంతానము ముగ్గురు కుమారులు
కార్తీక్ రెడ్డి

వికారాబాదు జిల్లా రాజకీయ నేతలలో ప్రముఖురాలైన పి. సబితా ఇంద్రారెడ్డి (P.Sabita Indra Reddy) వికారాబాదు జిల్లా కోటబాస్పల్లి గ్రామంలో 1963, మే 5న జన్మించింది.[1] భర్త, మాజీ మంత్రి పి.ఇంద్రారెడ్డి మరణంలో జరిగిన ఉపఎన్నికలలో 2000లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారిగా చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి శాసనసభలో ప్రవేశించిన సబిత ఆ అనంతరం చేవెళ్ళ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకుంది. 2004లో కూడా చేవెళ్ళ నుంచి నెగ్గిన సబిత నియోజకవర్గాల పునర్విభజనలో చేవెళ్ళ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో 2009 శాసనసభ ఎన్నికలలో మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందింది. 2004-09 కాలంలో గనుల శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సబితా ఇంద్రారెడ్డి, 2009 వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖా మంత్రి పదవిని పొంది హోంశాఖా మంత్రిపదవిని అధిష్టించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.[2] దాల్మియా సిమెంటు కేసులో సబిత పేరును సీబీఐ చార్జిషీటులో ఏ4గా పేర్కొనడంతో రాజీనామా చేయగా 2013 మే 25న గవర్నర్ రాజీనామా ఆమోదించారు.


మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-05-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 27-05-2009