బైరామల్‌గూడ ఫ్లైఓవర్ లెవల్ 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బైరామల్‌గూడ ఫ్లైఓవర్ లెవల్ 1,హైదరాబాద్ నగరంలోని ప్రధాన రహదారుల్లో ఒకటి. ఎల్బీనగర్‌ నుంచి ఒవైసీ జంక్షన్‌ మీదుగా నూతనంగా బైరామల్‌గూడ ఫ్లైఓవర్ లెవల్ 1 ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది.[1]

నిర్మాణ వివరాలు[మార్చు]

బైరా‌మ‌ల్‌గూడ కుడివైపు ఫ్లైఓవ‌ర్​ను 11 మీటర్ల వెడల్పుతో 780 మీటర్ల పొడవున 14 పిల్లర్స్‌తో 4 లైన్లతో స్టాటిజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ) సౌజన్యంతో 26.45 కోట్ల వ్యయంతో ప్రీ కాస్ట్‌ విధానంలో హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిర్మించింది. ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభంతో బైరామల్‌గూడ జంక్షన్‌, సాగర్‌ రోడ్‌ జంక్షన్‌ల పరిధిలో ట్రాఫిక్‌ తగ్గింది. బైరామ‌ల్​గూడ కుడివైపు ఫ్లైఓవ‌ర్ నిర్మాణానికి దేశంలోనే మొద‌టి సారి ప్ర‌త్యేక టెక్నాలజీని వినియోగించి నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్‌ను వల్ల ఎల్బీనగర్‌ నుంచి ఒవైసీ జంక్షన్‌కు, శ్రీశైలం వైపు వెళ్లే వాహనదారులకు ఇది ఉపయోగకరంగా ఉంది. ఈ ఫ్లై ఓవర్‌ నిర్మాణం కోసం ఎల్బీనగర్‌ నుంచి బైరామల్‌ గూడ దారిలో 11 భవనాలను తొలగించారు.

ప్రారంభం[మార్చు]

బైరామల్‌గూడ జంక్షన్‌లో నిర్మించిన కుడివైపు ఫ్లైఓవర్‌ను 2021 ఆగస్టు 10న రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించాడు. [2][3] ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హైదరాబాద్‌ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేషం , స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇతర వివరాలు[మార్చు]

2022, మార్చి 14న బైరామల్‌గూడ ఫ్లైఓవర్ లెవల్ 2 (ఎడవ వైపు) కూడా ప్రారంభించబడింది.

మూలాలు[మార్చు]

  1. V6 Velugu (10 August 2020). "బైరామల్‌గూడ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్" (in ఇంగ్లీష్). Archived from the original on 28 December 2021. Retrieved 28 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Prajasakti (10 August 2021). "బైరామల్‌గూడ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన కెటిఆర్‌ | Prajasakti". Archived from the original on 28 December 2021. Retrieved 28 December 2021.
  3. Andhrajyothy (10 August 2021). "చాలా ఆనందంగా ఉంది.. మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌". Archived from the original on 28 December 2021. Retrieved 28 December 2021.