బైరామల్‌గూడ ఫ్లైఓవర్ లెవల్ 2
బైరామల్‌గూడ ఫ్లైఓవర్ లెవల్ 2 | |
---|---|
మార్గ సమాచారం | |
Existed | 2022 మార్చి 16–present |
ప్రదేశము | |
States | తెలంగాణ |
బైరామల్‌గూడ ఫ్లైఓవర్ లెవల్ 2, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బైరామల్‌గూడలో ఉన్న ఫ్లైఓవర్. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 29 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ నిర్మించబడింది.[1][2] గతంలో ఈ ప్రాంతంలో 2021 ఆగస్టు 10న బైరామల్‌గూడ ఫ్లైఓవర్ లెవల్ 1 (కుడివైపు) ఫ్లైఓవర్ ప్రారంభించబడింది.
ప్రారంభం
[మార్చు]2022 మార్చి 16న తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.[3][4]
నిర్మాణ వివరాలు
[మార్చు]శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, మిధాని మీదుగా వచ్చే ట్రాఫిక్ ట్రాఫిక్ నియంత్రణకు, నివారణకు 29 కోట్ల రూపాయలతో 780 మీటర్ల పొడవు, 400 మీటర్ల డక్ పోర్షన్, 380 ఆర్.ఈ వాల్, 12.50 మీటర్ల వెడల్పుతో మూడు లైన్లతో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Telugu, TV9 (2022-03-16). ": వాహనదారులకు గుడ్‌న్యూస్.. నేడు అందుబాటులోకి రానున్న ఎల్బీనగర్ అండర్‌పాస్, ఫ్లై ఓవర్". TV9 Telugu. Archived from the original on 2022-03-16. Retrieved 2022-03-16.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (16 March 2022). "సాగర్ చౌరస్తా TO ఉప్పల్ రయ్..రయ్.. మెరుగు పడిన ప్రజా రవాణా". EENADU. Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
- ↑ telugu, NT News (2022-03-16). "ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకే ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-03-16. Retrieved 2022-03-16.
- ↑ "KTR: ఆ నిధులు తెస్తే కిషన్‌రెడ్డిని సన్మానిస్తాం: కేటీఆర్". EENADU. Archived from the original on 2022-03-16. Retrieved 2022-03-16.