ఎర్రగడ్డ, హైదరాబాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎర్రగడ్డ
సమీప ప్రాంతాలు
ఎర్రగడ్డ ప్రధాన రహదారి
ఎర్రగడ్డ ప్రధాన రహదారి
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
ప్రభుత్వం
 • సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
సమయప్రాంతంIST (UTC+5:30)
పిన్ కోడ్500018
వాహన రిజిస్ట్రేషన్టి.ఎస్
లోకసభ నియోజకవర్గంసికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
వెబ్‌సైటుtelangana.gov.in

ఎర్రగడ్డ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇక్కడ మొట్టమొదటి మోడల్‌ రైతుబజార్‌ ఏర్పాటుచేయబడింది.[1] ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు, ఎలక్ట్రికల్ పరికరాలు ఉంటాయి.

వైద్యం[మార్చు]

ఇక్కడ సెయింట్ థెరీసా ఆసుపత్రి, మానసిక అసుపత్రి, క్షయవ్యాధి మరియు చాతీ ఆసుపత్రి వంటి ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.

గృహోపకరణాలు[మార్చు]

మధ్య తరగతి, పేదవారికి అతి తక్కువ ధరలకే ఫర్నీచర్‌ ఇక్కడ దొరుకుతుంది. ఎర్రగడ్డ జాతీయ రహదారి పుట్‌పాత్‌లపై 50 సంవత్సరాలుగా వ్యాపారాలు నిర్వహించబడుతున్నాయి. చెప్పులు పెట్టుకునే స్టాండ్‌ దగ్గర నుంచి స్కూల్‌లో ఉపయోగించే జాయింట్‌ బెంచీల వరకు ఇక్కడ లభ్యమవుతాయి. దాదాపు 25 కుటుంబాలు ఈ వ్యాపారంతోనే పొట్టుపోసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.[2]

రవాణా[మార్చు]

ఎర్రగడ్డ నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు వివిధ వాహనాల రవాణా సదుపాయం ఉంది. దీనికి 500 మీటర్ల దూరంలోవున్న భరత్ నగర్ లో మెట్రోరైలు స్టేషన్ కూడా ఉంది.

మానసిక అసుపత్రి ద్వారం

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి (31 October 2015). "నేడు ఎర్రగడ్డ రైతు బజార్‌లో కందిపప్పు కౌంటర్‌ ప్రారంభం". Retrieved 6 June 2018.
  2. ఆంధ్రజ్యోతి, తెలంగాణా- కధనాలు (27 September 2017). "పేదవాడి ఫర్నీచర్‌కు కేరాఫ్‌ ఎర్రగడ్డ". Retrieved 6 June 2018.