Jump to content

మాగంటి గోపీనాథ్

వికీపీడియా నుండి
మాగంటి గోపీనాథ్
మాగంటి గోపీనాథ్


తెలంగాణ శాసనసభ్యుడు
పదవీ కాలం
2014 - 2018, 2018- ప్రస్తుతం
ముందు పి.విష్ణువర్ధన్ రెడ్డి
నియోజకవర్గం జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 02 జూన్ 1963
హైదర్‌గూడ, హైదరాబాద్, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు కృష్ణమూర్తి, మహానంద కుమారి
జీవిత భాగస్వామి సునీత
సంతానం మాగంటి వాత్యల్యనాధ్ (కుమారుడు), అక్షర నాగ, దిశిర (కుమార్తెలు)

మాగంటి గోపీనాథ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3]

జననం, విద్య

[మార్చు]

గోపినాథ్ 1963, జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని హైదర్‌గూడలో జన్మించాడు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ (బిఏ) పూర్తిచేశాడు.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

గోపినాథ్ కు సునీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ విశేషాలు

[మార్చు]

మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్‌గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు.


గోపినాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆ తరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డి పై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5] ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.[6]మాగంటి గోపినాథ్ 26 జనవరి 2022న టిఆర్ఎస్ పార్టీ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[7][8]

హోదాలు

[మార్చు]
  1. 1987 - 1989: హుడా (హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) డైరెక్టర్‌
  2. 1988 - 1993: జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడు

మూలాలు

[మార్చు]
  1. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-09-13.
  2. "Maganti Gopinath | MLA | TRS | Jubilee Hills | Hyderabad | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-25. Retrieved 2021-09-13.
  3. Eenadu (4 December 2023). "హ్యాట్రిక్‌ వీరులు.. హైదరాబాద్‌లో 10 మంది." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  4. admin (2019-01-07). "Jubilee Hills MLA Maganti Gopinath". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-09-13.
  5. "Maganti Gopinath(TRS):Constituency- JUBILEE HILLS(HYDERABAD) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-09-13.
  6. Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 జూలై 2021. Retrieved 15 July 2021.
  7. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.
  8. Andhrajyothy (27 January 2022). "హైదరా'బాద్‌షా' మాగంటి". Archived from the original on 28 జనవరి 2022. Retrieved 28 January 2022.