హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్
Club information | |
---|---|
Location | టోలీచౌకీ, హైదరాబాదు, తెలంగాణ |
Established | 1992 |
Type | ప్రజా గోల్ఫ్ క్లబ్ |
Owned by | హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ |
Operated by | హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ |
Total holes | 18 |
Tournaments hosted | గోల్కొండ మాస్టర్స్[1] |
మూస:Infobox golf facility/course |
హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, హైదరాబాదులోని గోల్కొండ కోటకు సమీపంలో ఉన్న 18 రంధ్రాల గోల్ఫ్ కోర్సు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కలిసి ఈ ప్రాజెక్ట్ రూపొందించారు. హైదరాబాదులోని మొదటి, ఏకైక పబ్లిక్ గోల్ఫ్ కోర్సు ఇది.
చరిత్ర
[మార్చు]1992లో ఈ హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ ఏర్పడింది. హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం, దాని పరిసరాలలోని ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని నిర్మించారు.
ప్రాంతం
[మార్చు]చారిత్రాత్మక గోల్కొండ కోటకు సమీపంలో, కుతుబ్ షాహి సమాధులకు ఎదురుగా ఈ హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ ఉంది.
సౌకర్యాలు
[మార్చు]6057 గజాల విస్తీర్ణంలో 18 రంధ్రాలతో, పార్ 71 గోల్ఫ్ కోర్సు ఇది. నీటి వనరులు, విస్తారమైన ఆకుకూరలతో పాటు గోల్ఫ్ అకాడమీ, డ్రైవింగ్ రేంజ్, క్లబ్ హౌస్ వంటి శిక్షణా సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి.[2]
పురస్కారాలు
[మార్చు]- 2022లో తెలంగాణ పర్యాటకరంగం ఏకంగా నాలుగు జాతీయ స్థాయి అవార్డులు సాధించి, నాలుగు అవార్డులు గెలుచుకొన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ దేశంలోనే ఉత్తమ గోల్ఫ్ కోర్స్ అవార్డును గెలుచుకుంది. 2022 సెప్టెంబరు 27న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఇండియా టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ చేతులు మీదుగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అవార్డులు అందుకున్నాడు. కార్యక్రమంలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటకశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.[3][4]
వివాదాలు
[మార్చు]2010లో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ చారిత్రాత్మక నయా ఖిల్లా ప్రాంగణంలో ఒక అక్రమ గోల్ఫ్ కోర్సును ఏర్పాటుచేయడంతో అక్కడి నివాసితులు నిరసన వ్యక్తం చేశారు.[5][6] భారత పురాతత్వ సర్వే సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన ఈ గోల్ఫ్ కోర్సు, పర్యాటకులు కోటలోకి ప్రవేశించడానికి అడ్డుగా ఉంది. 2019 నాటికి, కోర్సు వాడుకలో ఉంది.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ PGTI Golconda Masters in Hyderabad
- ↑ Hyderabad city gets new golf course
- ↑ telugu, NT News (2022-09-28). "ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా తెలంగాణ". Namasthe Telangana. Archived from the original on 2022-09-28. Retrieved 2022-10-10.
- ↑ "తెలంగాణ పర్యాటక శాఖకు జాతీయ స్థాయి ఉత్తమ అవార్డులు". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-09-28. Archived from the original on 2022-10-10. Retrieved 2022-10-10.
- ↑ Jul 28, TNN | Updated; 2010; Ist, 5:53. "105 acres of Golconda Fort goes to golf club | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-07-18.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ HyderabadMarch 6, A. Srinivasa Rao; March 6, 2012UPDATED; Ist, 2012 15:08. "Illegal golf course threatens Golconda fort in Hyderabad". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-07-18.
{{cite web}}
:|first3=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "The Qila-Turned-Golf Course in Hyderabad is Why We Must be Sceptical of 'Adopt a Heritage'". The Wire. Retrieved 2021-07-18.
- ↑ "Archaeological Survey of India has no clue on Golconda Fort limits". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2019-03-13. Retrieved 2021-07-18.