ప్రపంచ పర్యాటక దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ పర్యాటక స్థలాలు- ఐక్యరాజ్య సమితి
పారిస్ 06 ఈఫిల్ టర్మ్

ప్రపంచ పర్యాటక దినోత్సవమును ప్రతి సంవత్సరం సెప్టెంబరు 27న జరుపుకుంటారు. 1980 నుండి ఐ.రా.స ప్రపంచ పర్యాటక సంస్థ ఈ వేడుకలను సెప్టెంబరు 27 న నిర్వహిస్తుంది. ఈ తేదీని 1970 లో ఒక రోజున ఎంపికచేశారు. UNWTO విధానాలననుసరించి ఈ రోజును స్వీకరించడం జరిగింది. ఈ విధానాన్ని అవలంబించడాన్ని ప్రపంచ పర్యాటకంలో ఒక మైలురాయిగా భావిస్తారు. ఈ రోజు యొక్క ఉద్దేశం అంతర్జాతీయ సమాజంలో పర్యాటక పాత్ర మీద అవగాహన పెంచడం, అది ప్రపంచవ్యాప్తంగా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విలువలను ఎలా ప్రభావితం చేసిందో చూపటం. 1997 అక్టోబరులో ఇస్తాంబుల్, టర్కీలో జరిగిన UNWTO సర్వ ప్రతినిధి సభ పన్నెండవ సమావేశంలో, ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలలో సంస్థ భాగస్వామిగా వ్యవహరించడానికి ఒక ఆతిథేయ దేశాన్ని కేటాయించాలని నిర్ణయించబడింది.

చరిత్ర

[మార్చు]

పర్యాటకం  ప్రాముఖ్యత, మన సమాజంపై దాని ప్రభావం గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27 న ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం ముఖ్య  కారణం పర్యాటకం  ప్రాముఖ్యత, సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక విలువల పై ప్రపంచవ్యాప్తంగా సమాజంలో అవగాహన పెంచడం, సృష్టించడం. ప్రపంచ వారసత్వాన్ని నిర్ధారించడంలో అవసరమైన పరికరాలు అందించడంలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తుంది[1]. ప్రపంచ పర్యాటక దినోత్సవం చేయడంలో  ముఖ్యమైన అంశము ప్రపంచవ్యాప్త పురోగతి, సామాజిక మెరుగుదలకు ఒక సాధనంగా పర్యాటకం ను పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాలో పేర్కొన్న ప్రపంచ సవాళ్ల గురించి అవగాహన కల్పించడానికి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి పర్యాటక పరిశ్రమ చేయగలిగే ప్రయత్నాలను తెలుపడానికి  ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. పర్యాటకాన్ని ప్రోత్సహించే అంతర్జాతీయ సంస్థ అయిన ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యుఎన్డబ్ల్యుటిఓ) 1980 నుండి సెప్టెంబర్ 27 న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రారంభించి, యుఎన్ డబ్ల్యుటిఓ తన చట్టాలను ఆమోదించిన ఈరోజు అయినందున ఈ  తేదీని ఎంచుకున్నారు. 1997 అక్టోబరులో టర్కీలో జరిగిన యు.ఎన్.డబ్ల్యు.టి.ఒ జనరల్ అసెంబ్లీ, ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవడంలో సంస్థ భాగస్వామిగా వ్యవహరించడానికి ప్రతి సంవత్సరం ఒక ఆతిథ్య దేశాన్ని నియమించాలని నిర్ణయించింది[2].

అభివృద్ధి

[మార్చు]

పర్యాటక రంగ పరిశ్రమ నేడు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక రంగాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. గడచిన  కొన్ని సంవత్సరాలుగా, పర్యాటక రంగ పరిశ్రమ  విస్తరణ,అభివృద్ధి అయినది.  గత కొన్ని దశాబ్దాలలో అంతర్జాతీయ పర్యాటకుల రాక గణనీయంగా పెరిగింది. 1950 లో 25 మిలియన్ల నుండి 2019 లో 1.3 బిలియన్లకు పెరిగింది. 1950లో 2 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆదాయం 2015 నాటికి 1,260 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. పర్యాటక రంగం ప్రపంచ జిడిపిలో 10% విలువ చేస్తుందని అంచనా వేయబడి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది ఉద్యోగాలలో ఒకటి అందిస్తుంది. 2030 వరకు పర్యాటక రంగంలో 3 శాతం వార్షిక వృద్ధి ఉంటుందని యూఎన్ డబ్ల్యూటీవో అంచనా వేస్తోంది. భారతదేశంలో, ఈ పరిశ్రమ 2018 లో 240 బిలియన్ డాలర్లు లేదా భారత జిడిపిలో 9.2% ఉంటుందని అంచనా వేయబడినది. ఈ పరిశ్రమ భారతదేశంలో 42.6 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తుంది అని అంచనా. పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2017 లో 10.04 మిలియన్ల విదేశీ పర్యాటకులు గా భారతదేశానికి రావడం జరిగింది[2] .

పర్యాటక ప్రభావం

[మార్చు]

ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులు( ప్రపంచం లోని ప్రజలు) నూతన  గమ్యస్థానాలను చూడటానికి,  విభిన్న సంస్కృతులను  చూసి ఆనందించి, అనుభవించడానికి,  శాశ్వత జ్ఞాపకాల కొరకు  ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా  సరిహద్దులు దాటి ఆయా ప్రదేశాలను చూస్తారు. ఈ పర్యాటకులతో ప్రపంచ దేశాలలో ఉద్యోగాల కల్పన, పర్యాటకం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, లోకల్ గైడ్స్ వంటి వివిధ రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. పర్యాటకులతో దేశాలలో  ఆదాయం పెరిగే అవకాశం స్థానిక వ్యాపారాలకు, ప్రభుత్వ పన్ను ఆదాయానికి ఒక వనరు గా పర్యాటక రంగం ఉంటుంది. పర్యాటక రంగం వల్ల దేశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి గా భావించే రోడ్లు, విమానాశ్రయాలు, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులకు దారితీస్తుంది, దీనితో  పర్యాటకులకు, స్థానిక ప్రజలకు ఉపాది ప్రయోజనం చేకూరుస్తుంది. పర్యాటక రంగ అభివృద్ధి వల్ల పరస్పర సాంస్కృతిక మార్పిడి, విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలపై అవగాహన, ప్రశంసలను ప్రోత్సహిస్తు, తద్వారా  పర్యాటక కార్యక్రమాలు స్థానిక సమాజాలను శక్తివంతం కావడానికి, సాంస్కృతిక పరిరక్షణకు తోడ్పడతాయి. పర్యాటక రంగం నుంచి వచ్చే ఆదాయం పెరగడం వల్ల మెరుగైన జీవన ప్రమాణాలు ఆరోగ్యం, విద్య, ఇతర అవసరాలకు మెరుగైన ప్రాప్యత లభిస్తుంది[3].

వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024 విడుదల చేయగా, దక్షిణాసియాలో భారతదేశం పర్యాటక రంగం లో 39వ స్థానంలో ఉన్నది[4].

మూలాలు

[మార్చు]
  1. "World Tourism Day 2024 - Awareness Days Events Calendar 2024" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2024-07-18.
  2. 2.0 2.1 "When is World Tourism Day". https://www.business-standard.com/. 18 July 2024. Archived from the original on 18 జూలై 2024. Retrieved 18 July 2024. {{cite web}}: External link in |website= (help)CS1 maint: bot: original URL status unknown (link)
  3. AIRSSIST; Blog, airssist (2024-02-11). "What is World Tourism Day and Why is it Celebrated?". airssist (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-07-18.
  4. "India ranks 39th on the World Economic Forum's Travel & Tourism Development". The Times of India. ISSN 0971-8257. Retrieved 2024-07-18.