చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్
చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ | |
---|---|
ప్రదేశం | |
చాంద్రాయణగుట్ట, హైదరాబాదు, తెలంగాణ | |
జంక్షన్ వద్ద రహదార్లు | శంషాబాదు - ఎల్బీనగర్ |
నిర్మాణం | |
రకం | ఫ్లైఓవర్ |
లైన్స్ | 4 |
నిర్మాణం చేసినవారు | వినియోగంలో ఉంది by హైదరాబాదు మహానగర పాలక సంస్థ |
ప్రారంభం | 2022 ఆగస్టు 27 |
గరిష్ట వెడల్పు | 1110 మీటర్ల పొడవు 16.61 మీటర్ల వెడల్పు |
చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో నిర్మించిన ఫ్లైఓవర్. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 45.90 కోట్ల రూపాయలతో 674 మీటర్ల పొడవైన ఫ్లై ఓవర్ ఈ ఫ్లైఓవర్ నిర్మించబడింది. శంషాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఎల్బీనగర్ మీదుగా నల్గొండ, వరంగల్ వైపు వెళ్ళేవారికి ఈ ఫ్లైఓవర్ ఉపయోగపడుతుంది.[1]
నిర్మాణం
[మార్చు]అంతకుముందున్న ఉన్న 4 లైన్ల చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ నుండి 585 మీటర్ల నుండి 1110 మీటర్లు పొడిగించబడింది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి) కింద 2018లో ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించబడి కోవిడ్-ప్రేరిత లాక్‌డౌన్, వరదల కారణంగా నిర్మాణం ఆలస్యమైంది.[2] ఫ్లైఓవర్ కింద పచ్చదనం కోసం మొక్కలను, ఫిల్లర్ల నడుమ చక్కటి గార్డెనింగ్‌ను ఏర్పాటుచేశారు.[3]
ప్రారంభం
[మార్చు]2022 ఆగస్టు 27న తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Telugu, TV9 (2022-08-22). "Hyderabad: ట్రాఫిక్ ఫ్రీ.. సిగ్నల్ ఫ్రీ సిటీ.. భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్.. మంగళవారం నుంచి అందుబాటులోకి చాంద్రాయణగుట్టలో ఫ్లైఓవర్". TV9 Telugu. Archived from the original on 2022-08-22. Retrieved 2022-08-22.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ India, The Hans (2022-05-31). "Hyderabad: Chandrayangutta flyover to be ready by June-end". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-08-22. Retrieved 2022-08-22.
- ↑ "చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ప్రారంభం వాయిదా.. కారణం ఇదేనా?". Sakshi. 2022-08-23. Archived from the original on 2022-08-23. Retrieved 2022-08-28.
- ↑ Namasthe Telangana (27 August 2022). "చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి మహమూద్ అలీ". Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.