రైతు బజార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రైతు బజార్ అనగా ఆంధ్ర ప్రదేశ్ లోని రైతుల యొక్క బజారు. ఇది చిన్న కమతాలున్న చిన్న రైతుల కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చే అమలవుతుంది. 1999 జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో మొదటి మార్కెట్ ప్రారంభమైంది.

మోడల్[మార్చు]

ఈ మార్కెట్ లో రైతులు తాము పండించిన కూరగాయలను వినియోగదారులకు నేరుగా విక్రయిస్తారు. ఈ మార్కెట్ లో రైతులకు, వినియోగదారులకు మధ్య మధ్యవర్తుల జోక్యం ఉండదు. రైతులు మరియు వినియోగదారులు ఇద్దరూ మధ్యవర్తుల దోపిడీకి గురికాకుండా ఈ పద్ధతి బాగుంటుందని ఒకే అభిప్రాయానికి వచ్చారు. అందువలన వ్యవసాయ ఉత్పత్తులు తాజాగా మరియు ఆర్థికంగా అందుబాటులో లభించగలవు. రైతులు కూరగాయలను తమ పొలంలో స్వయంగా పండించి విక్రయించటం ద్వారా దళారుల ప్రభావం లేకపోవటం వలన ఇతర కూరగాయల మార్కెట్లలో ధరల కంటే రైతు బజారు మార్కెట్‌లో ధరలు తక్కువగా ఉండేందుకు సహాయపడింది.