Jump to content

పలాస రైల్వే స్టేషను

Coordinates: 18°45′25″N 84°25′20″E / 18.7569°N 84.4221°E / 18.7569; 84.4221
వికీపీడియా నుండి
పలాస
पलास
Palasa
పలాస రైల్వే స్టేషను
General information
Locationపలాస స్టేషను రోడ్, కాశీబుగ్గ, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
Coordinates18°45′25″N 84°25′20″E / 18.7569°N 84.4221°E / 18.7569; 84.4221
Elevation31m
Systemభారతీయ రైల్వేలు స్టేషను
Owned byభారతీయ రైల్వేలు
Operated byతూర్పు తీర రైల్వే
Linesహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
ఖుర్దా రోడ్-విశాఖపట్నం రైలు మార్గము
Platforms3
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
Parkingఉంది
Bicycle facilitiesలేదు
Other information
Statusపనిచేస్తున్నది
Station codePSA
డివిజన్లు ఖుర్దా రోడ్ రైల్వే డివిజను
History
Opened1893-1896
Electrified1998-2000
Location
పటం

పలాస రైల్వే స్టేషను, భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పలాస-కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా పరిసరాల్లో ప్రాంతాలలో పనిచేస్తుంది.

చరిత్ర

[మార్చు]

విజయవాడ జంక్షన్ నుండి కటక్ వరకు ఉన్న 1,288 కిమీ (800 మైళ్ళు) మొత్తం తీరం వెంబడి సాగిన రైలు మార్గములు (రైల్వే ట్రాక్ల) ను 1893 సం. - 1896 సం. మధ్య కాలం సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించింది, ట్రాఫిక్‌కు కూడా తెరిచింది.[1][2] 1898-99 సం.లో బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే దక్షిణ భారతదేశం రైలు మార్గములు (లైన్ల) కు కలుపబడింది.[3] తదుపరి కాలంలో 79 కిమీ (49 మైళ్ళు) విజయనగరం-పార్వతీపురం రైలు మార్గము 1908-09 సం.లో ప్రారంభించబడింది, సాలూర్ వరకు పొడిగింపును 1913 సం.లో నిర్మించారు. పార్వతీపురం-రాయ్‌పూర్ రైలు మార్గము 1931 సం.లో పూర్తయింది.[3]

విద్యుద్దీకరణ

[మార్చు]

పలాస-తిలరు విభాగం 1998-99 సం.లో దీని విద్యుద్దీకరణ జరిగింది.[4]

సదుపాయాలు

[మార్చు]

పలాస రైల్వే స్టేషనులో రెండు (డబుల్ బెడ్) పడకల నాన్- ఎసి రిటైరింగ్ గది ఉంది. .[5] రైల్వే స్టేషను వద్ద ఇతర సౌకర్యాలలో పాటుగా కంప్యూటరీకరణ రిజర్వేషన్లు కార్యాలయాలు, టెలిఫోన్ బూత్, సామాన్లు భద్రపరచు గది, ప్రయాణీకుల వేచి ఉండు గది, శాకాహారం, మాంసాహార ఉపాహారం లభించు గదులు, పుస్తకం దుకాణములు ఉన్నాయి.[6]

ప్రయాణీకుల ప్రయాణాలు

[మార్చు]

పలాస రైల్వే స్టేషను రోజువారీ సుమారు 75,000 మంది ప్రయాణీకులకు సేవలందిస్తుంది[7]

రైల్వే పునర్వ్యవస్థీకరణ

[మార్చు]

బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే 1944 సం.లో జాతీయీకరణ చేశారు.[8] ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ యొక్క మొఘల్సరాయ్ తూర్పు భాగం, బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే లతో కలిసి, తూర్పు రైల్వే 1952 ఏప్రిల్ 14 న ఏర్పడింది.[9] 1955 సం.లో, దక్షిణ తూర్పు రైల్వేను ఈస్టర్న్ రైల్వే నుండి ఏర్పరచారు. ఇందులో ఎక్కువగా అంతకు ముందు బెంగాల్ నాగ్‌పూర్ రైల్వేచే నిర్వహించబడుతున్న రైలు మార్గములు ఉన్నాయి.[9][10]

కొత్తగా రైల్వే మండలాలు 2003 ఏప్రిల్ సం.లో ప్రారంభించారు, వాటిలో ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోనులను నార్త్ ఈస్టర్న్ రైల్వే నుండి మలిచారు.[9]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 13 July 2013.
  2. "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 11 అక్టోబరు 2012. Retrieved 13 July 2013.
  3. 3.0 3.1 "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2012-11-10.
  4. "History of Electrification". IRFCA. Retrieved 13 July 2013.
  5. "East Coast Railway Amenities at Stations (as in 2008)". Archived from the original on 6 జనవరి 2014. Retrieved 13 July 2013.
  6. "Palasa railway station". Make my trip. Retrieved 13 July 2013.
  7. "Palasa (PSA)". India Rail Enquiry. Retrieved 12 July 2013.
  8. "IR History: Part - III (1900 - 1947)". IRFCA. Retrieved 2012-11-21.
  9. 9.0 9.1 9.2 "Geography – Railway Zones". IRFCA. Retrieved 2012-11-21.
  10. "IR History: Part - IV (1947 - 1970)". IRFCA. Retrieved 2012-11-21.

బయటి లింకులు

[మార్చు]
External video
పలాస వద్ద ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
తూర్పు తీర రైల్వే
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము యొక్క ఖుర్దా రోడ్-విశాఖపట్నం రైలు మార్గము