అక్షాంశ రేఖాంశాలు: 13°27′03″N 79°06′53″E / 13.4509°N 79.1146°E / 13.4509; 79.1146

పాకాల జంక్షన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాకాల జంక్షన్ రైల్వే స్టేషను
ప్రయాణీకుల రైల్వే స్టేషను
పాకాల జంక్షన్ రైల్వే స్టేషను నామఫలకం
సాధారణ సమాచారం
Locationపాకాల , తిరుపతి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Elevation371 మీ. (1,217 అ.)
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుగూడూరు-కాట్పాడి శాఖ రైలు మార్గము, ధర్మవరం-పాకాల శాఖ రైలు మార్గము
నిర్మాణం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుPAK
Fare zoneదక్షిణ మధ్య రైల్వే జోన్
విద్యుత్ లైనుఅవును
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

మూస:గూడూరు-చెన్నై రైలు మార్గము 13°27′03″N 79°06′53″E / 13.4509°N 79.1146°E / 13.4509; 79.1146 పాకాల జంక్షన్ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్:PAK) భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని తిరుపతి జిల్లాలోని పాకాల నందలి, ఒక రైల్వే స్టేషను. ఇది దేశంలో 3787 వ రద్దీగా ఉండే స్టేషను.[1]

పరిపాలన పరిధి

[మార్చు]

ఈ స్టేషను దక్షిణ మధ్య రైల్వేకు చెందిన గుంతకల్లు రైల్వే డివిజను పరిధిలోకి వస్తుంది.

చరిత్ర

[మార్చు]

విజయవాడ-చెన్నై లింక్ నిర్మాణం భారతదేశం యొక్క తూర్పు తీరం ప్రాంతంలో 1899 సం.లో సరాసరి (ఎకాఎకీ) నడుపుటకు ప్రారంభించబడింది.[2] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు.[3]

రైల్వే పునర్వ్యవస్థీకరణ

[మార్చు]

1950 సం.ప్రారంభంలో, స్వతంత్ర రైల్వే వ్యవస్థలు అప్పట్లో కలిగిన ఉన్న వాటిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అధికారిక చట్టాన్ని ఆమోదించడం జరిగింది. 1951 సం. ఏప్రిల్ 14 న మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే, దక్షిణ ఇండియన్ రైల్వే కంపెనీ, మైసూర్ స్టేట్ రైల్వే లను దక్షిణ రైల్వే జోన్ నిర్మించటానికి గాను, విలీనం చెయ్యబడ్డాయి. 1966 సం. అక్టోబరు 2 న గతంలో ఉన్న (1) నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే లో కలసి ఉన్నటువంటి సికింద్రాబాద్, షోలాపూర్, హుబ్లి, విజయవాడ డివిజన్ల ప్రాంతాలు,, (2) దక్షిణ రైల్వే లో విలీనం చేయబడ్డ మద్రాసు రైల్వే, దక్షిణ మరాఠా రైల్వే లోని కొన్ని భాగాలను వేరుచేసి దక్షిణ మధ్య రైల్వే జోన్ (సౌత్ సెంట్రల్ రైల్వే) ఏర్పాటు చేయడం జరిగింది. 1977 సం.లో దక్షిణ రైల్వే లోని గుంతకల్లు రైల్వే డివిజను దక్షిణ మధ్య రైల్వేకు, సోలాపూర్ రైల్వే డివిజను మధ్య రైల్వేకు బదిలీ చేయబడ్డాయి. 2010 సం.లో కొత్తగా రూపొందించిన ఏడు మండలాల వాటిలో ఉన్నటువంటి పశ్చిమ కనుమల రైల్వే జోన్ అనేదాన్ని దక్షిణ రైల్వే నుండి వేరుచేసి ఆగ్నేయ రైల్వే/ (సౌత్ వెస్ట్రన్ రైల్వే) గా ఏర్పాటు చేశారు.[4]

సౌకర్యాలు

[మార్చు]

ఈ స్టేషను 3 ప్లాట్‌ఫారాలను కలిగి ఉంది.

మార్గము , స్థానం

[మార్చు]

ఈ స్టేషను ధర్మవరానికి అనుసంధానించే శాఖ మార్గము (బ్రాంచ్ లైన్‌) తో ఉన్న గూడూరు-కాట్పాడి శాఖా మార్గము (బ్రాంచ్ లైన్‌) లో ఉన్నది

మూలాలు

[మార్చు]
  1. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-06-04.
  2. "IR History:Early days II". 1870–1899. IRFCA. Retrieved 13 February 2013.
  3. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  4. "Geography – Railway Zones". IRFCA. Retrieved 2013-01-23.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూస:దక్షిణ మధ్య రైల్వే #invoke:Navbox