బొబ్బిలి జంక్షన్ రైల్వే స్టేషను
బొబ్బిలి రైల్వే స్టేషను Bobbili Railway Station | |||||
|---|---|---|---|---|---|
బొబ్బిలి రైల్వే స్టేషను వద్ద ఒక రైలు బస్సు | |||||
| General information | |||||
| Location | బొబ్బిలి , ఆంధ్ర ప్రదేశ్ | ||||
| Coordinates | 18°20′38″N 83°12′17″E / 18.3438°N 83.2047°E | ||||
| Elevation | 137 m (449 ft) | ||||
| System | భారతీయ రైల్వేలు జంక్షన్ స్టేషను | ||||
| Operated by | తూర్పు తీర రైల్వే | ||||
| Line | ఝార్సుగుడా-విజయనగరం రైలు మార్గము | ||||
| Platforms | 2 | ||||
| Tracks | 4 | ||||
| Construction | |||||
| Structure type | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం | ||||
| Parking | ఉంది | ||||
| Other information | |||||
| Status | పనిచేస్తున్నది | ||||
| Station code | VBL | ||||
| జోన్లు | తూర్పు తీర రైల్వే | ||||
| డివిజన్లు | విశాఖపట్నం రైల్వే డివిజను | ||||
| History | |||||
| Opened | 1908 | ||||
| Electrified | కాదు | ||||
| Previous names | బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే | ||||
| |||||
బొబ్బిలి రైల్వే స్టేషను విశాఖపట్నం రైల్వే డివిజను, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నకు చెందినది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో ఉంది.
చరిత్ర
[మార్చు]విజయవాడ జంక్షన్ నుండి కటక్ వరకు ఉన్న 1,288 కిమీ (800 మైళ్ళు) మొత్తం తీరం వెంబడి సాగిన రైలు మార్గములు (రైల్వే ట్రాక్ల) ను 1893 సం. - 1896 సం. మధ్య కాలం సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించింది, ట్రాఫిక్‌కు కూడా తెరిచింది.[1][2] 1898-99 సం.లో బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే దక్షిణ భారతదేశం రైలు మార్గములు (లైన్ల) కు కలుపబడింది.[3] తదుపరి కాలంలో 79 కిమీ (49 మైళ్ళు) విజయనగరం-పార్వతీపురం రైలు మార్గము 1908-09 సం.లో ప్రారంభించబడింది, సాలూర్ వరకు పొడిగింపును 1913 సం.లో నిర్మించారు. పార్వతీపురం-రాయ్‌పూర్ రైలు మార్గము 1931 సం.లో పూర్తయింది.[3]
రైల్వే పునర్వ్యవస్థీకరణ
[మార్చు]బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే 1944 సం.లో జాతీయీకరణ చేశారు.[4] ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ యొక్క మొఘల్సరాయ్ తూర్పు భాగం, బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే లతో కలిసి, తూర్పు రైల్వే 1952 ఏప్రిల్ 14 న ఏర్పడింది.[5] 1955 సం.లో, దక్షిణ తూర్పు రైల్వేను ఈస్టర్న్ రైల్వే నుండి ఏర్పరచారు. ఇందులో ఎక్కువగా అంతకు ముందు బెంగాల్ నాగ్‌పూర్ రైల్వేచే నిర్వహించబడుతున్న రైలు మార్గములు ఉన్నాయి.[5][6]
కొత్తగా రైల్వే మండలాలు 2003 ఏప్రిల్ సం.లో ప్రారంభించారు, వాటిలో ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోనులను నార్త్ ఈస్టర్న్ రైల్వే నుండి మలిచారు.[5]
ఈ రైల్వేస్టేషనులో ఆగు రైళ్ళు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా
- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
మూలాలు
[మార్చు]- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 13 July 2013.
- ↑ "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 11 అక్టోబరు 2012. Retrieved 13 July 2013.
- ↑ 3.0 3.1 "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2012-11-10.
- ↑ "IR History: Part - III (1900 - 1947)". IRFCA. Retrieved 2012-11-21.
- ↑ 5.0 5.1 5.2 "Geography – Railway Zones". IRFCA. Retrieved 2012-11-21.
- ↑ "IR History: Part - IV (1947 - 1970)". IRFCA. Retrieved 2012-11-21.
బయటి లింకులు
[మార్చు]| అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
|---|---|---|---|---|
| తూర్పు తీర రైల్వే |
