దిగువమెట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


దిగువమెట్ట
గ్రామం
దిగువమెట్ట is located in Andhra Pradesh
దిగువమెట్ట
దిగువమెట్ట
నిర్దేశాంకాలు: 15°23′00″N 78°49′59″E / 15.3833°N 78.833°E / 15.3833; 78.833Coordinates: 15°23′00″N 78°49′59″E / 15.3833°N 78.833°E / 15.3833; 78.833 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, మార్కాపురం రెవిన్యూ డివిజన్
మండలంగిద్దలూరు మండలం Edit this on Wikidata
జనాభా
(2011)
 • మొత్తంString Module Error: Match not found
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

దిగువమెట్ట, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామం.[1]

దిగువమెట్టలో వెదురు ఈనెల బుట్టలు అల్లుచున్న స్త్రీ
దిగువమెట్ట రైల్వేస్టేషను

గ్రామ భౌగోళికం[మార్చు]

దిగువమెట్ట గ్రామం గిద్దలూరుకు 10 కిలోమీటర్ల దూరములో ఉంది.

నల్లమల అడవి[మార్చు]

ఇక్కడ నుండి నల్లమల్ల అడవి మొదలు అవుతుంది. దాదాపు 40 కిలోమీటర్ల వెడల్పున అడవి ఉంది. నల్లమల్ల అడవిలో వెదురు విస్తారంగా లభిస్తుంది. ఈ ప్రాంతంలో లంబాడిలు, కొయ్యవారు నివాసం ఉన్నారు. ఇక్కడినుండి లోపలికి వెళ్ళే కొలది అడవి ఎంతో అందంగా కనిపిస్తుంది. శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు "ఆకులో ఆకునై పూవులో పూవునై (పాట)" అన్న పాటను ఈ అడవి అందాలు చూసే వ్రాసారు. పలు సినిమాల చిత్రీకరణ ఇక్కడి అడవిలో జరిగింది.

ప్రకాశం జిల్లా ఏర్పాటుకు ముందు ఈ మండలం కర్నూలు జిల్లాలో ఉంది. గిద్దలూరు-నంద్యాల బస్సు, రైలు మార్గంలో గిద్దలూరుకు 10 కి.మీ.ల దూరంలో దిగువమెట్ట ఉంది. దిగువ మెట్ట వద్ద వుండి నల్లమల్ల అడవి మొదలు అయ్యి గాజుల దిన్నె వద్ద అడవి ముగుస్తుంది. అడవి వెడల్పు 40-45 కి.మీ. ఉంది. వర్షాకాలంలో అన్ని చెట్లు చిగిర్చి అడవి అంత పచ్చగా తివాచి పరచినట్లు కనులవిందుగా వుండును. ఎతైన కొండలు, లోయలతో బస్సు ప్రయాణం చేయునపుడు అందమయిన అనుభూతి కల్గుతుంది. క్రిష్ణ శాస్త్రి గారికి సంబంధించిన వ్యాసాలలో' ఆకులో ఆకునై' అనే పాటను ఆయన రైలులో విజయవాడ నుండి బళ్ళారి వెళ్ళునప్పుడు నల్లమల్ల అడవి అందాన్ని చూసి పరవసించి వ్రాసినట్లు ఆ వ్యాసంలో పేర్కొనడం జరిగింది. ఈ పాటను దాసరి నారాయణ రావు గారు తన సినిమా "మేఘ సందేశం"లో ఉపయోగించారు. పి.సుశీల గారు ఈ పాటను పాడారు. ఇందుకు గాను ఆమెకు అవార్డు కూడా లభించింది.

ఈ అడవిలో ఇంకొ అందమైన ప్రదేశం ఉన్నది దాని పేరు భైరెని . దిగువమెట్ట నుండి 15 కి మీ దూరంలో వుంది అంధమైన జలపాతము.

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

రైల్వే స్టేషను[మార్చు]

బొగ్గు రైలు ఇంజనుల సమయంలో ఈ దిగువమెట్ట స్టేషనులో ఇంజనులలో వాటరు నింపుటకు ఈ స్టేషను ఉపయోగపడేది.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ శంకర్‌నాయక్ సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం[మార్చు]

నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2017,జూన్-18వతేదీ ఆదివారం ఉదయం 8-01 కి స్వామివారి విగ్రహ ప్త్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం 11-45 నుండి మద్యాహ్నం 1-30 వరకు శ్రీ సీతారామకళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. సాయంత్రం 4-10 నుండి నూతన దంపతుల గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు, 16వతేదీ నుండి 18వ తేదీ వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2017,జూన్-19; 4వపేజీ.