Jump to content

గుంటూరు మిరపకాయ

వికీపీడియా నుండి
గుంటూరు మిరపకాయ
జాతికాప్సికం చైనిస్
వృక్ష రకం'హాబనెరో'
కారం (హీట్) ఎక్కువ కారం
స్కోవిల్లె స్కేల్30,000-350,000 SHU
ఎండుమిర్చి కారం

గుంటూరు మిరపకాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గుంటూరు జిల్లా లో పండుస్తున్న మిరపకాయలు. ఈ మిరపకాయలు ప్రపంచవ్యాప్తంగా ఆసియా, కెనడా, ఐరోపా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. గుంటూరు జిల్లా అనెక మిరపకాయలకు, మిరపకాయ పొడికి ప్రసిద్ధి చెందింది. ఈ ఉత్పత్తులు శ్రీలంక, బంగ్లాదేశ్, మధ్యతూర్పు, దక్షిణ కొరియా, యు.కె, యుఎస్ & లాటిన్ అమెరికాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ మిరపకాయలు వివిధ రంగులు, వివిధ రకాల రుచులను దానిలో ఉన్నా కాప్సికం పరిమానాన్ని బట్టి కలిగి పుంటాయి. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రకాల వంటలలో ఈ గుంటూరు మిరప కాయలను ఉపయోగిస్తారు.

గుంటూరు మిరప వ్యవసాయదారులు

[మార్చు]
  • వండర్ హాట్ చిల్లీ అనునది అతికారంగా ఉన్న మిరపకాయ.
  • 334 చిల్లీ అనునది ఎగుమతి చేయవలసిన రకం.[1]
  • తేజా చిల్లీ[2] అనునది చక్కని గుంటూరు మిరపకాయ. [3]
  • గుంటూరు సన్న మిరపకాయ - S4 రకం అనునది ప్రఖ్యాతి చెందిన మిరప రకం. దీనికి ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన డిమాండ్ ఉన్నది. దీనిని గుంటూరు, వరంగల్, ఖమ్మం జిల్లాలలో పండిస్తారు. ఈ మిరపకాయ తొక్క దళసరిగానూ, ఎరుపుగానూ, కారంగానూ ఉంటుంది. ఈ పంట పండించే కాలం డిసెంబరు నుండి మే నెల వరకు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ పంట సుమారు 280,000 టన్నులు ఉత్పత్తి అవుతుంది. దీని అస్తా రంగు విలువ 32.11, కాప్సైచిన్ విలువ 0.226% ఉంటుంది.
  • 273 చిల్లీ అనునది సాధారణ ముడుతలు గల చిల్లీ.

ఇతర గుంటూరు మిరపకాయలలో పత్కి, ఇండో-5, అంకుర్, రోష్ని, బెడ్కి, మధుబాల కూడా ఉన్నాయి. పత్కి, తేజ రకాలను రుచి కొరకు, వంటల రంగుల కొరకు వాడుతారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ Fresh crop seen boosting Guntur chili mandi volumes
  2. ↑ Fresh arrivals fail to pull down chili prices
  3. ↑ "Finer grade of Teja variety fetches Rs. 9,700 per quintal". Archived from the original on 2012-11-05. Retrieved 2016-01-24.