విజయవాడ విమానాశ్రయము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
విజయవాడ విమానాశ్రయము
IATA: VGAICAO: VOBZ
VGA is located in India airports
VGA
Location of airport in India
టూకీగా...
విమానాశ్రయ రకము Public
యాజమాన్యము AAI
పనిచేయునది భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ
సేవలు అందించునది విజయవాడ
ప్రాంతము గన్నవరం, విజయవాడ
 India
Hub for
Elevation AMSL 82 ft / 25 m
Website http://www.aai.aero/allAirports/vijayawada.jsp
ధావన పథములు
దిశ పొడవు ఉపరితలము
ft m
08/26 7,900 2,408 ఆస్ఫాల్ట్ (తారు)

విజయవాడ విమానాశ్రయం (IATA: VGAICAO: VOBZ) విజయవాడ నగరం నుండి అయిదవ (5) నంబరు జాతీయ రహదారి అయిన కోల్‌కత మరియు చెన్నై మార్గములో 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా, గన్నవరం మరియు కేసరపల్లి గ్రామాల మధ్య ఉంది. ఈ విమానాశ్రయమును రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలములో బ్రిటీషు ప్రభుత్యము ఏర్పాటు చేసింది. ఇది భారతదేశము యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు దాని పొరుగు రాష్ట్రాలలో అంతర్గతంగా ప్రయాణీకులకు సేవలను అందిస్తున్న ఒక మధ్య స్థాయి దేశీయ విమానాశ్రయం.

దీని సుదీర్ఘ రన్‌వే (విమాన రహదారి) 82 అడుగుల ఎత్తుతో, అతి పొడవు 7,500 అడుగులు కలిగినది కావున, ఫలితంగా అనేక విమానాలు సులభముగా దిగుటమే కాకుండా, అతి పెద్దవి మరియు వెడల్పు కలిగిన భారీ విమానాలు దిగుటకు అనుకూలమయిన విమానాశ్రయం.[1]

ఈ ప్రాంతం నుండి ఎయిర్ ట్రాఫిక్‌లో పెరుగుదలల్లో కారణంగా, భారతదేశం యొక్క విమానాశ్రయాలు అథారిటీ వారు విమానాశ్రయానికి అభివృద్ధి మరియు మౌలిక వసతులలో మార్పులు చేపట్టారు.[2]

విమానాశ్రయం సేవలు[మార్చు]

ఇంధనం అందించేవారు

  • హిందుస్తాన్ పెట్రోలియం

వాయు మార్గాలు (ఎయిర్ లైన్స్) మరియు గమ్యస్థానాలు[మార్చు]

విజయవాడ విమానాశ్రయంలో ఎయిర్ కోస్తా విమానం

ఇక్కడి నుండి గతంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌ ఎయిర్ లైన్స్ సంస్థ వారు, ఒకటి హైదరాబాదు మరియొకటి బెంగుళూరుకు రెండు విమానాలతో మాత్రమే పనిచేస్తున్న ఈ విమానాశ్రయం, ఇప్పుడు ప్రతి రోజూ ఆరు విమానాలు పైకెగిరి ప్రయాణీకులను వివిధ ప్రాంతముల గమ్యస్థానాలకు చేరుస్తున్నది.[2][3]

ఎయిర్ ఇండియా సంస్థ కొత్తగా అక్టోబర్ 30వ తేదీ, 2011 సం.నుండి, ఢిల్లీ నుండి విజయవాడ వయా హైదరాబాదుకు 122 సీట్లు సామర్థ్యం కలిగిన A-319 ఎయిర్ బస్ సర్వీసు ప్రారంభించారు.[4]

విజయవాడ నుండి చికాగో, న్యూయార్క్ మరియు టొరంటో ప్రదేశములకు సులభంగా కనెక్టివిటీ ఉంటుంది మరియు వెళ్ళే ప్రయాణీకులు హైదరాబాదు ( ఒక గంట వేచి - ఏ విమానం మార్పు లేకుండా ) లో ఆగి, అక్కడి నుండి న్యూ ఢిల్లీలో విమానం మారవలసి ఉంది. కానీ, విమానములు 4 ఎ 321, 2 బి 737 200, 1 ఎఫ్- 27 ఒక సమయంలో నిలిపిననూ, ఒకే సరాసరి టికెట్ విజయవాడ నుండి గమ్యస్థానము వరకు జారీ చేయబడుతుంది.[5][6]

ప్రైవేట్ విమానయాన సంస్థలు అయిన స్పైస్‌జెట్ మరియు జెట్ ఎయిర్‌వేస్ వారు హైదరాబాదు నుండి విజయవాడకు సరాసరి మరియు మధ్యన, (ప్రత్యక్ష) విమాన ప్రయాణం సేవలు ప్రారంభించారు. స్పైస్‌జెట్ సంస్థ 28వ తారీఖు, సెప్టెంబరు, 2011 నుండి విజయవాడ మరియు హైదరాబాదు మధ్య ఒక 78 సీట్లు గల క్యూ 400 (Q-400) రకం విమానం రోజువారీగా ఉదయం ( 08.30 ఎ.ఎం. ) సమయములో పనిచేస్తున్నది. అలాగే జెట్ ఎయిర్‌వేస్ వారు ఒక 62 సీట్లు ఎటిఆర్ 72-500 (ATR 72-500) రకం విమానం వారానికి ఆరు రోజులు నేరుగా హైదరాబాదుకు చేరుకునేందుకు సౌలభ్యం ఉంది, [7] మరియు అదనంగా బెంగుళూరుకు ఒక విమాన ప్రయాణం సేవలు ప్రారంభించారు.[1] ఎయిర్ కోస్తా, ఒక ప్రాంతీయ దేశీయ వైమానిక సంస్థ విజయవాడ తన కార్యాచరణ కేంద్రంగా మరియు చెన్నై నిర్వహణ కేంద్రంగా 14వ తారీఖు, అక్టోబరు, 2013 సం. నుండి విమాన ప్రయాణ సేవలు ప్రారంభించింది .

విమానయాన సంస్థలు గమ్యస్థానాలు
ఎయిర్ కోస్తా బెంగుళూరు , జైపూర్
ఎయిర్ ఇండియా ఢిల్లీ , హైదరాబాదు
స్పైస్‌జెట్ బెంగుళూరు , హైదరాబాదు

ప్రమాదాలు మరియు ఘటనలు[మార్చు]

  • 1980 ఆగస్టు 28 సం.లో, వికెర్స్ విస్కౌంట్ యొక్క హన్స్ ఎయిర్ VT- DJC విమానం లాండింగ్ సమయములో మూడు సార్లు బౌన్స్ తర్వాత నోస్‌వీల్ బాగు చేసేందుకు కూడా పనికి రానంతగా ఆర్థికంగా దెబ్బతిని కుప్పకూలింది.[8]

మూలాలు[మార్చు]

సూచనలు[మార్చు]

  1. 1.0 1.1 RAMESH SUSARLA. "Extended airport runway trial begins in Vijayawada". The Hindu. Retrieved August 30, 2011. 
  2. 2.0 2.1 "More flights from Vijayawada". The Times of India. Retrieved Oct 22, 2011. 
  3. "Another pvt airliner to operate from Gannavaram". The Times of India. Retrieved Mar 14, 2011. 
  4. "Air India launches Delhi-Vijayawada flight". Moneycontrol. Retrieved Oct 27, 2011. 
  5. "ILS equipment calibrated at Gannavaram Airport". The hindu. Retrieved January 28, 2012. 
  6. "Air India's new link between Delhi and Vijayawada". Airindia.com. Retrieved Oct 28, 2011. 
  7. "Jet Airways launches direct flight to Hyderabad six days a week". The Hindu. Retrieved Mar 28, 2011. 
  8. "Accident description". Aviation Safety Network. Retrieved 8 October 2009. 

బయటి లింకులు[మార్చు]