Jump to content

లోకప్రియ గోపీనాథ్ బొర్డొలొయ్ అంతర్జాతీయ విమానాశ్రయము (గువహాటి)

అక్షాంశ రేఖాంశాలు: 26°06′22″N 091°35′09″E / 26.10611°N 91.58583°E / 26.10611; 91.58583
వికీపీడియా నుండి
లోకప్రియ గోపీనాథ్ బొర్డొలొయ్ అంతర్జాతీయ విమానాశ్రయము
సంగ్రహం
విమానాశ్రయ రకంPublic/Military
యజమానిAirports Authority of India
కార్యనిర్వాహకత్వంGuwahati International Airport Limited[1]
సేవలుGuwahati
ప్రదేశంBorjhar, Guwahati, Assam, India
ప్రారంభం1958; 66 సంవత్సరాల క్రితం (1958)
కేంద్రీకృత నగరం
ఎత్తు AMSL49 m / 162 ft
అక్షాంశరేఖాంశాలు26°06′22″N 091°35′09″E / 26.10611°N 91.58583°E / 26.10611; 91.58583
వెబ్‌సైటుLokpriya Gopinath Bordoloi International Airport
పటం
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
మీటర్లు అడుగులు
02/20 3,110 10,200 Asphalt
గణాంకాలు (April 2021 – March 2022)
Passengers31,48,940 (Increase 43.9%)
Source: AAI[2][3][4]
లోక్ప్రియా గోపినాథ్ బోర్డోలాయ్ అంతర్జాతీయ విమానాశ్రయము

లోకప్రియ గోపీనాథ్ బొర్డొలొయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (గువహాటి) , దీనిని గువహాటి అంతర్జాతీయ విమానాశ్రయంగా కూడా పిలుస్తారు, గువహాటి నగరానికి సేవలందిస్తున్న ఈ విమానాశ్రయాన్ని ఇంతకూ మునుపు ఈ విమానాశ్రయం ఉన్న ప్రాంతం బోర్ఝార్ మూలంగా బోర్ఝార్ విమానాశ్రయంగా పిలిచేవారు. భారత దేశానికి ఈశాన్యంలో ఉన్న అస్సాం రాష్ట్ర రాజధాని అయిన గువహాటిలో ఉండటం మూలాన ఇది ఈశాన్య రాష్ట్రాలకు ప్రధాన విమానాశ్రయంగా ఉంది. బోర్ఝార్ ప్రాంతంలో ఉండే ఈ విమానాశ్రయం డిస్పూర్ నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. అస్సాం రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన గోపినాథ్ బోర్డోలాయ్ స్మారకంగా ఈ విమానాశ్రయం పేరు పెట్టారు. ఈ విమానాశ్రయాన్ని భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ, భారత వైమానిక దళం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.


చరిత్ర

[మార్చు]
విమానాశ్రయంలోని దేశీయ భద్రతా తనిఖీ ప్రాంతం

ఈ విమానాశ్రయం 1958లో స్థాపించబడింది, ఆ తరువాతి కాలంలో మరింత తీర్చిదిద్దబడింది. 2017లో 37 లక్షలకు పైగా ప్రయాణికులు ఈ విమానాశ్రయ సేవలు ఉపయోగించుకున్నారని అంచనా. విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న టెర్మినల్ భవనం గరిష్టంగా గంటకు 850 మంది రాక/బయలుదేరే ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉంది.


2002లో మొట్టమొదటి సారిగా ఈ విమానాశ్రయం నుండి బ్యాంకాక్ నగరానికి ఎయిర్‌బస్ A310 విమానాన్ని అంతర్జాతీయ సేవలు అందించడానికి ప్రారంభించటం జరిగింది. దీంతో ఈ విమానాశ్రయం ఈశాన్య రాష్ట్రాలలో మొదటి అంతర్జాతీయ విమానాశ్రయంగా అవతరించింది, కానీ ప్రయాణికులు తక్కువగా ఉండటంతో ఈ విమానాన్ని కొన్ని రోజులకే నిలిపివేశారు. [5] [6]

జనవరి 2019లో, గువహాటి విమానాశ్రయం UDAN పథకం కింద రెండు అంతర్జాతీయ గమ్యస్థానాల కోసం బిడ్‌లను గెలుచుకుంది, దీంతో ఇక్కడినుండి బ్యాంకాక్, ఢాకా, మ్యూయాంగ్ నగరాలకు విమానాల సేవలు అందుబాటులోకి వచ్చాయి.


2021 నవంబర్ లో, గువహాటి విమానాశ్రయం UDAN పథకం కింద ఢాకా, బ్యాంకాక్, కౌలాలంపూర్, సింగపూర్, యాంగాన్ అంతర్జాతీయ గమ్యస్థానాలకు బిడ్లను గెలుచుకుంది . [7] 2019 ఫిబ్రవరిలో ఈ విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్ సంస్థకు ఒక్కో ప్రయాణికుడిపై 160 రూపాయల ఆదాయం లెక్కన 50 సంవత్సరాల పాటు లీజుకు ఇవాటం జరిగింది.


కొత్త టెర్మినల్ [8]

[మార్చు]

భవిష్యత్తు అవసరాల రీత్యా అలాగే పెరుగుతున్న ప్రయాణికుల సౌకర్యాలకోసం , భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)) విమానాశ్రయానికి ఉత్తర భాగంలో ₹ 1,232 కోట్లతో కొత్త రెండవ ప్యాసింజర్ టెర్మినల్‌ను నిర్మించడం ప్రారంభించింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Guwahati International Airport". cbonds.com. Retrieved 7 March 2023.
  2. "Annexure III - Passenger Data" (PDF). www.aai.aero. Retrieved 6 July 2022.
  3. "Annexure II - Aircraft Movement Data" (PDF). www.aai.aero. Retrieved 6 July 2022.
  4. "Annexure IV - Freight Movement Data" (PDF). www.aai.aero. Retrieved 6 July 2022.
  5. Singh, Bikash. "Chief Minister Sarbananda Sonowal flags off Guwahati-Bangkok flight". The Economic Times. Retrieved 2022-11-27.
  6. PTI (4 April 2002). "Guwahati joins international air route". The Times of India. Retrieved 21 August 2020.
  7. "Six new flights to Southeast Asian nations from Guwahati soon". The Times of India (in ఇంగ్లీష్). 9 November 2021. Retrieved 15 December 2021.
  8. "Lokpriya Gopinath Bordoloi International Airport, Guwahati, India" (in ఇంగ్లీష్). Airport Technology. 7 May 2021. Retrieved 27 November 2022.

బాహ్య లింకులు

[మార్చు]