Jump to content

భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ

వికీపీడియా నుండి
భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ
Airports Authority of India
రకంప్రభుత్వ రంగ సంస్థ
పరిశ్రమవైమానిక రంగం
స్థాపన1994
ప్రధాన కార్యాలయంరాజీవ్ గాంధీ భవన్,
సఫ్దర్ జంగ్ ఎయిర్‌పోర్ట్,
కొత్త ఢిల్లీ-110003
కీలక వ్యక్తులు
R.K.శ్రీవాస్తవ్, అధ్యక్షుడు

S.సురేష్, సభ్యుడు(ఆర్థిక)
R.భండారీ, సంచాలకుడు(ఆర్థిక)
K.K.ఝా, సభ్యుడు(మానవ వనరులు)
V.భుజంగ్, సంచాలకుడు(మానవ వనరులు)
S.రహేజా, సభ్యుడు(రూపకల్పన)
Mr. P.K. బందోపాధ్యాయ్, సంచాలకుడు(రూపకల్పన)
V.సోమసూందరం, సభ్యుడు(ANS)

G.K.చౌకియాల్, సభ్యుడు(కార్యకలాపాలు)
ఉత్పత్తులువిమానాశ్రయాలు, ATC, CNS
ఉద్యోగుల సంఖ్య
22,000
వెబ్‌సైట్www.aai.aero
రాజీవ్ గాంధీ భవన్

భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ లేదా ఎయిర్‌పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వంలోని పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో నడిచే ఒక సంస్థ. ఈ సంస్థ విధుల ప్రధానముగా భారత వైమానిక రంగంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి, నిర్వహణ. భారతదేశంతో పాటు దానికి ఆనుకుని ఉన్న సముద్రతీర ప్రాంతాలకు ఈ సంస్థ వాయు రద్దీ నియంత్రణ సేవలు (Air traffic management) అందిస్తుంది. ఈ సంస్థ దాదాపు 125 విమానాశ్రయాల నిర్వహణ చేపడుతున్నది. ఇందులో 11 ఆంతర్జాతీయ, 8 ప్రత్యేక, 81 దేశీయ, 25 సైనిక విమానాశ్రయాలు ఉన్నాయి. వీటితో పాటు 25 ఇతర విమానాశ్రయాలలో కూడా భద్రతా ప్రమాణాల బాధ్యత కూడా తీసుకున్నది.

నేపధ్యము

[మార్చు]

భారత ప్రభుత్వము 1972లో దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్వహణ, అభివృద్ధి కోసము అంతర్జాతీఅ విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ను ఏర్పాటు చేసింది. 1986లో జాతీయ మానాశ్రయాల ప్రాధికార సంస్థ ను కేవలం దేశీయ విమానాశ్రయాల నిర్వహణ, అభివృద్ధి కోసము ఏర్పాటు చేసింది.[1] 1995 ఏప్రిల్ లో ఈ రెండు సంస్థలను పార్లమెంటు చట్టం ద్వారా ఏకం చేసి భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ గా ఒకే సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ విధులు దేశ వైమానిక రంగంలో ప్రయాణీకుల అభివృద్ధి కొరకు సౌకర్యాల ఏర్పాటు, నిర్వహణ, మెరుగుపరచడము.

విధులు

[మార్చు]
  • అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల, తత్సంబంధిత కారయక్రమాల రూపకల్పన, అభివృద్ధి, నిర్వహణ
  • ICAO నిబంధనల ప్రకారము దేశ సరిహద్దుల ఆవల విస్తరించి ఉన్న వైమానిక మార్గాల నిర్వహణ, అభివృద్ధి .
  • విమానాశ్రయ ప్రయాణీకుల ప్రాంగణాల సృష్టి, అభివృద్ధి, నిర్వహణ.
  • అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల సరుకు రవాణా ప్రాంగణాల అభివృద్ధి, నిర్వహణ.
  • ప్రయాణీకులకు మెరుగైన వసతులు, సమాచార వ్యవస్థల ఏర్పాటు.
  • ప్రస్తుతమున్న మౌలిక వసతుల మెరుగుదల, నిర్వహణ. ఉదాహరణకు రన్‌వేలు, ట్యాక్సీలు, దుస్తులు, పరిశుభ్రత మొదలైనవి.
  • ముందస్తు ఉపకరణాల ఏర్పాటు.
  • సమాచార, నావిగేషన్ ఉపకరణాల ఏర్పాటు.ILS, DVOR, DME, Radar మొదలైనవి.

ప్రయాణీకులకు సౌకర్యాలు

[మార్చు]
  • ప్రయాణీకుల ప్రాంగణాల నిర్మాణము, ఆధునీకరణ మరియ్ నిర్వహణ. అలాగే సరకు రవాణా ప్రాంగణాల నిర్వఃఅణ, రన్వేల నిర్వహణ, సమాంతర టాక్సీల నిర్వహణ మొదలైనవి.
  • సమాచార, గమన, నిఘా వ్యవస్థల ముందస్తు ఏర్పాటు.DVOR / DME, ILS, ATC రాడార్లు లాంటివి. వాయు రద్దీ నిర్వహణ సేవలు, ప్రయాణీకుల సదుపాయాలు, తత్సంభందిత సేవలు.

విమాన మార్గ సేవలు

[మార్చు]
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం, కోల్‌కత
భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ వాయు సేవల నియంత్రణ కార్యాలయము, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, కొత్త డిల్లీ

ప్రస్తుతము అందిస్తున్న సేవలతో పాటు ఉపగ్రహ సమాచారం ఆధారంగా సమాచారవ్యవస్థ, నావిగేషన్, మనుగడ (CNS), వాయు రద్దీ నియంత్రణ సేవలను అందించే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇతర దేశాలలో ఇదేవిధమైన సేవలను అందిస్తున్న సంస్థలతో పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నది.

సమాచార, సాంకేతిక శాస్త్రం ఆచరణ

[మార్చు]

భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ వెబ్‌సైటులో దేశీయ, అంతర్జాతీయ విమాన సేవల వివరాలతో పాటు ఇంకా చాలా ఉపయుక్తమైన సమాచారం అందించుచున్నది.

మానవ వనరుల శిక్షణ

[మార్చు]

భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ చెప్పుకోదగిన సంఖ్యలో మానవవనరుల శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. డిల్లీ, అలహాబాదు, కోల్‌కతా లలో ప్రధాన శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలలో వైమానిక రంగంలో కొత్తగా ప్రవేశించే సిబ్బందికే కాకుండా ప్రస్తుతము పనిచేస్తున్న సిబ్బందికి కూడా అవగాహనా తరగతులు నిర్వహిస్తున్నారు.

ఆదాయము

[మార్చు]

భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఆదాయంలో అధికభాగము దేశీయ వైమానిక విపణిలో పార్కింగ్, ల్యాండింగ్ సేవల ద్వారా లభిస్తున్నది.

విమానాశ్రయాల ప్రైవేటీకరణ

[మార్చు]

విమానయాన రంగంలో ప్రైవేటీకరణకు అనుమతిచ్చిన భారత ప్రభుత్వ పౌర విమానయానశాఖ నిర్ణయానికి వ్యతిరేకంగా భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ గళమెత్తింది. ఇందులో భాగంగా డిల్లీ, ముంబాయి విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.[2]

అంతర్జాతీయ ప్రాజెక్టులు

[మార్చు]

భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ మనదేశంలోనే కాకుండా అనేక్ అంతర్జాతీయ ప్రాజెక్టులలో కూడా పాలుపంచుకున్నది. లిబియా, అల్జీరియా, యెమెన్, మాల్దీవులు, నౌరు, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో అనేక విమానాశ్రయాల అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకున్నది. ఇవే కాకుండా వైమానిక సేవలలో అభివృద్ధి, నిర్వహణ నిపుణులను ఆయా దేశాల ప్రాజెక్టులలో నియమించింది.[3]

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://pib.nic.in/newsite/efeatures.aspx?relid=69345
  2. "Private Airports in India". Archived from the original on 2009-12-12. Retrieved 2014-11-27.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-11-28. Retrieved 2014-11-27.