Jump to content

భీమవరం టౌన్ రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 16°32′50″N 81°31′10″E / 16.5472°N 81.5195°E / 16.5472; 81.5195
వికీపీడియా నుండి
భీమవరం టౌన్ రైల్వే స్టేషను
ప్రయాణీకుల రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationభీమవరం
పశ్చిమ గోదావరి జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్
 India
Coordinates16°32′50″N 81°31′10″E / 16.5472°N 81.5195°E / 16.5472; 81.5195
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ మధ్య రైల్వే జోన్
లైన్లువిశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2
పట్టాలుసింగిల్
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
స్టేషను కోడుBVRT
విద్యుత్ లైనుఅవును
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services


భీమవరం టౌన్ రైల్వే స్టేషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరంలో ఉంది. ఈ స్టేషను దక్షిణ మధ్య రైల్వే మండలం విజయవాడ రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది.[1] ప్రస్తుత బ్రాడ్ గేజ్, లైన్ రెట్టింపు, విద్యుదీకరణ నిర్మాణం జరుగుతుంది. ఇది భారతదేశంలో 690 వ అత్యంత రద్దీ అయిన రైల్వే స్టేషను.[2] భీమవరంలో ఉన్న రెండు స్టేషన్లలో ఇది ఒకటి.

చరిత్ర

[మార్చు]

1961 ముందు ఇక్కడ మీటర్ గేజ్ లైన్ ఉండేది. 08.10.1961 న జగజ్జీవన్ రాం, రైల్వే మంత్రి గుడివాడ-భీమవరం బ్రాడ్ గేజ్ రైల్వే శాఖను ప్రారంభించారు. అప్పట్లో దీనికి 2.25 కోట్ల రూపాయలు ఖర్చయింది.[3]

  • నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (17255/17256) సంవత్సరం 1-10-1979 లో పరిచయం చేయబడింది. ఇది భీమవరం టౌన్ రైల్వే స్టేషను ద్వారా ప్రయాణిస్తున్న మొదటి ఎక్స్‌ప్రెస్‌ రైలు. కాకినాడ - సికింద్రాబాద్ (12775/12776) మధ్యన నడిచే కాకినాడ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మొదటి ఎసి రైలు.
  • నాన్ ఎసి సూపర్ ఫాస్ట్ రైలు విశాఖపట్నం - ముంబై ఎల్‌టిటి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12749/12750) బుధవారం, శనివారం నడుస్తుంది. ప్రస్తుతం దీనిని సాధారణ విశాఖపట్నం - ముంబై ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్ (18519/18520) రోజువారీగా మార్చారు.

వర్గీకరణ

[మార్చు]

భీమవరం టౌన్ రైల్వే స్టేషను ఒక 'ఎ' కేటగిరి స్టేషను.[4] ఇది విజయవాడ రైల్వే డివిజన్లో ఒక మోడల్ స్టేషను, టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.[5][6][7]

"టచ్ & ఫీల్" (ఆధునిక స్టేషన్లు)

[మార్చు]

విజయవాడ రైల్వే డివిజను లోని పది ఆధునిక స్టేషన్లు అయిన నెల్లూరు, ఒంగోలు, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, కాకినాడ టౌన్, అనకాపల్లి, భీమవరం టౌన్ లలో ఇది ఒక మోడల్ స్టేషను, టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.[8][9][10]

నిర్మాణం , సౌకర్యాలు

[మార్చు]

ఈ స్టేషను 17,105 మీ 2 (184,120 చదరపు అడుగుల) కంటే ఎక్కువగా విస్తరించింది.[11] ఈ స్టేషన్లో 02 ఫ్లాట్‌ఫారాలు ఉన్నాయి, అన్ని ట్రాక్లు బ్రాడ్ గేజ్ నిర్మితమైనవి. దాదాపు అన్ని ఫ్లాట్‌ఫారాలు ఒకే పరిమాణంలో ఉంటాయి. దక్షిణ మధ్య రైల్వే ఇటీవలే భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ (ATVM) లను ఇన్స్టాల్ చేసింది.[12] అలాగే రైల్‌వైర్ ద్వారా ఆధారితమైన ఉచిత వై-ఫై కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేసారు.

రైళ్ళ జాబితా

[మార్చు]

ఈ కింది సూచించిన రైళ్ళ జాబితా భీమవరంటౌన్ స్టేషను ద్వారా ప్రయాణించే ప్రత్యేకమైన భారతీయ రైల్వేలు సేవలు ఆందించేవి:

రైలు నం. రైలు పేరు ప్రారంభం గమ్యస్థానం
17015/16 విశాఖ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ సికింద్రాబాద్
18519/20 విశాఖ - ముంబై ఏల్‌టిటి ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం ఏల్‌టి టెర్మినస్
17403/04 తిరుపతి-నరసాపురం ఎక్స్‌ప్రెస్ తిరుపతి నరసాపురం
17209/10 శేషాద్రి ఎక్స్‌ప్రెస్ బెంగళూరు కాకినాడ
17255/56 నరసాపురం ఎక్స్‌ప్రెస్ నరసాపురం హైదరాబాద్
12775/76 కోకనాడ ఎసి ఎక్స్‌ప్రెస్ కాకినాడ టౌన్ సికింద్రాబాద్
17479/80 పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్ పూరీ తిరుపతి
17643/44 సర్కార్ ఎక్స్‌ప్రెస్ చెన్నై ఎగ్మోర్ కాకినాడ
17231/32 నరసాపురం-నాగర్‌సోల్ (గుంటూరు ద్వారా) నరసాపురం నాగర్‌సోల్
17213/14 నరసాపురం-నాగర్‌సోల్ (వరంగల్ ద్వారా) నరసాపురం నాగర్‌సోల్
17481/82 బిలాస్ పూర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ బిలాస్ పూర్ తిరుపతి

పనితీరు , ఆదాయాలు

[మార్చు]

క్రింద పట్టికలో గతించిన సంవత్సరాల వారీగా స్టేషను యొక్క ప్రయాణీకుల ద్వారా ఆదాయాలు ఈ జాబితాలో ఉన్నాయి.[13]

ప్రయాణీకుల ద్వారా ఆదాయాలు
సంవత్సరం ఆదాయాలు (లక్షల్లో)
2011-12 942.75
2012–13 1071.58
2013–14 1327.49
2014–15 1622.88

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే

మూలాలు

[మార్చు]
  1. "Statement showing Category-wise No.of stations" (PDF). Archived from the original (PDF) on 28 జనవరి 2016. Retrieved 7 జూన్ 2018.
  2. "BUSIEST TRAIN STATIONS INDIA". Archived from the original on 2018-06-12. Retrieved 2018-06-07.
  3. "1958-1959 రైల్వే బడ్జెట్" (PDF).
  4. "Vijayawada division – A Profile" (PDF). South Central Railway. Archived from the original (PDF) on 2016-01-28. Retrieved 18 September 2016.
  5. "Vijayawada division – A Profile" (PDF). South Central Railway. Retrieved 18 January 2016.
  6. "Jump in SCR Vijayawada division revenue". The Hindu. Vijayawada. 28 April 2015. Retrieved 29 May 2015.
  7. "Statement showing category-wise No.of stations" (PDF). South Central Railway. Retrieved 23 April 2017.
  8. "Vijayawada division – A Profile" (PDF). South Central Railway. Retrieved 18 January 2016.
  9. "Jump in SCR Vijayawada division revenue". The Hindu. Vijayawada. 28 April 2015. Retrieved 29 May 2015.
  10. "Statement showing category-wise No.of stations" (PDF). South Central Railway. Retrieved 23 April 2017.
  11. "Station:Bhimavaram". Archived from the original on 2017-12-30. Retrieved 2018-06-07.
  12. "SCR introduces mobile paper ticketing facility in 38 stations".
  13. "BHIMAVARAM TOWN". Archived from the original on 2017-12-30. Retrieved 2018-06-07.