ములగాడ
ములగాడ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°41′57″N 83°13′26″E / 17.699095°N 83.224024°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Founded by | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
Government | |
• Type | మేయర్ |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
జనాభా | |
• Total | 1,75,575 |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530011 |
శాసనసభ నియోజకవర్గం | పశ్చిమ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం |
లోక్‌సభ నియోజకవర్గం | విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం |
ములగాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా, మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాంతం.[1] ఈ ములగాడ ప్రాంతం విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ పరిపాలనలో ఉంది. ఇక్కడ రెవెన్యూ డివిజన్ ప్రధాన కార్యాలయం కూడా ఉంది. విశాఖపట్నం నగరానికి దక్షిణ అంచున ఈ ములగాడ ప్రాంతం ఉంది.[2][3]
వార్డులు
[మార్చు]ములగాడ మండలంలోని వార్డులు
- మల్కాపురం
- గొల్లలపాలెం
- ములగాడ
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి 2 కి.మీ.ల దూరంలో మల్కాపురం, 3 కి.మీ.ల దూరంలో గాజువాక, 6 కి.మీ.ల దూరంలో పెదగంట్యాడ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ నౌకానిర్మాణ కేంద్రం, విశాఖపట్నం నావల్ డాక్‌యార్డ్, కోరమండలం ఇంటర్నేషనల్ వంటి చాలా భారీ పరిశ్రమలు ఇక్కడ నిర్మించబడ్డాయి. ఈ ప్రాంతం విశాఖ పట్టణ ఆర్థిక వృద్ధిలో ఒక భాగంగా ఉంది.
స్థానం, భౌగోళికం
[మార్చు]విశాఖపట్నం విమానాశ్రయం నుండి 11 కిలోమీటర్లు, విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఈ ములగాడ ప్రాంతం ఉంది.
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ములగాడ మీదుగా వెంకోజిపాలెం, ఓహ్పో, అరిలోవ, హెచ్‌బి కాలనీ, మిధిలాపురి కాలనీమొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో గోపాలపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]
సంస్థలు
[మార్చు]ఈ ములగాడ ప్రాంతంలో కోరమాండల్ ఇంటర్నేషనల్, హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, తూర్పు నావికాదళం వంటి భారీ సంస్థలు ఉన్నాయి.
హెచ్‌పిసిఎల్
[మార్చు]కోరమాండల్ ఇంటర్నేషనల్
[మార్చు]1960ల ప్రారంభంలో అమెరికాలోని ఐఎంసి, చేవ్రన్ కంపెనీలచే స్థాపించబడిన భారతీయ సంస్థ ఈ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. మొదట్లో కోరమాండల్ ఎరువులు అని పిలువబడే ఈ సంస్థ ఎరువులు, పురుగుమందులు, ప్రత్యేక పోషకాల వ్యాపారంలో ఉండేది. ఈ సంస్థ గ్రోమోర్ సెంటర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో గ్రామీణ రిటైల్ వ్యాపారాన్ని కూడా ప్రారంభించింది.
హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్
[మార్చు]భారతదేశం తూర్పు తీరంలోని విశాఖపట్నంలో ఉన్న షిప్‌యార్డే ఈ హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్). సింధియా షిప్‌యార్డ్‌గా స్థాపించబడిన దీనిని ది సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లిమిటెడ్‌లో భాగంగా పారిశ్రామికవేత్త వాల్‌చంద్ హిరాచంద్ నిర్మించాడు. వాల్‌చంద్ 1940 నవంబరులో భూమిని స్వాధీనం చేసుకున్నాడు.
తూర్పు నావికాదళం
[మార్చు]భారత నావికాదళానికి చెందిన మూడు ప్రధాన నిర్మాణాలలో ఒకటైన తూర్పు నావికాదళం[3] ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది. ఇది భారతదేశంలోనే మొదటి, అతిపెద్ద నావికాదళ కమాండ్.
మూలాలు
[మార్చు]- ↑ "Mulagada Locality". www.onefivenine.com. Retrieved 2021-05-14.
- ↑ "Mulagada - Village in Visakhapatnam(u) Mandal". indiagrowing.com. Archived from the original on 2016-08-27. Retrieved 2017-12-17.
- ↑ 3.0 3.1 "Mandals in Visakhapatnam District, Andhra Pradesh". census2011.co.in. Retrieved 2017-12-17.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 14 May 2021.