అప్పికొండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అప్పికొండ (పాక్షిక) (గ్రామీణ)
—  రెవిన్యూ గ్రామం  —
అప్పికొండ బీచ్ దృశ్యం
అప్పికొండ బీచ్ దృశ్యం
అప్పికొండ బీచ్ దృశ్యం

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విశాఖపట్నం
మండలం పెదగంట్యాడ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

అప్పికొండ (పాక్షిక) (గ్రామీణ) , విశాఖపట్నం జిల్లా, పెదగంట్యాడ మండలానికి చెందిన గ్రామం.[1] ఈ గ్రామంలో ప్రసిద్ధిచెందిన పదకొండవ శతాబ్ధపు సోమేశ్వరాలయం ఉంది. ఈ గ్రామమునకు సమీపమునే ఉన్న సింహాచలం అప్పన్న ప్రభావము వలన ఈనామము ఏర్పడినదని చెప్పవచ్చును.

సమీప గ్రామాలు

[మార్చు]

మద్దివానిపాలెం, ఇస్లాంపేట

గణాంకాలు

[మార్చు]

చారిత్రక విశేషాలు

[మార్చు]

ఇక్కడ పశ్చిమ చాళుక్యుల మూడవ సోమేశ్వరుని కాలం నాటి సోమేశ్వరాలయం ఉంది. ఇక్కడ రెండు శాసనములు లభించినవి. ఒకటి 12వ శతాబ్దము నాటిది, రెండవది సా.శ..14వ శతాబ్దమునకు చెందిన ఎలమంచిలి ప్రభువైన మూడవ ఉపేంద్రుని కాలము నాటిది. ఈ దేవాలయము సముద్రపు నడిబొడ్డున ఉంది. సోమేశ్వరాలయమునకు సమీపమున మూడు శిథిలాయములు ఉన్నాయి. సోమేశ్వరాలయము ముందు 5 అడుగుల ఎత్తు గల నంది విగ్రహము అలంకార శోభితమై ఉంది.ఒకప్పుడు ఈ అప్పికొండ దేవాలయమునకు విశేష ఆదరణ ప్రాచుర్యుములు ఉండేవి అని ఈ ప్రాంతమున లభించిన కప్పివేసిన యిసుక మేటలను, లభించిన ఇతరత్రా శిలావశేషముల ద్వారా తెలియుచున్నది.

ఇందులో మొదటి శాసనము ప్రకారము: శక సంవత్సరము 1053 (సా.శ.. 1131) చాళుక్య విక్రమ సంవత్సరము 55, సాధారణ సంవత్సరము, ఫాల్గుణ, బహుళ ఏకాదశీ పుణ్యకాలమున పశ్చిమ చాళుక్య ప్రధాని మాచమయ్య, సేనాధిపతి మార్తాండయ్య నాయకుడూ దంతి వారము లోపల వెలసియున్న సోమేశ్వర దేవరకు 'అప్పికొండ' గ్రామమును దేవ భోగము నిమిత్తమై పునరుద్దించారు. మాచమయ్య నాయకుడు మహాప్రధాని దండనాయకుడైన అన్నరాజు యొక్క ప్రధాని అనియు, అతడు విశాఖపట్నణ సమస్తాధికారి అనియు శాసనము చెప్పుచున్నది. పశ్చిమ చాళుక్య ఆరవ విక్రమాదిత్యుని 47వ రాజ్య వర్షము నాటి రాచనపల్లి (అనంతపురం జిల్లా) శాసనమున ప్రస్తావించబడిన మాచరస సేనానియే అప్పికొండ శాసన దాతలలో ఒకరైన మాచమయ్య కావచ్చును.

ఇందులో రెండవ శాసనము ప్రకారము: ఈ శాసనము కాల సూచనము లేకుండా ఉంది.ఇది లోకాశ్రయ, విష్ణువర్ధన బిరుదాంకితుడైన ఉపేంద్రచక్రవర్తి తన తండ్రి కొప్పదేవ చక్రవర్తి పుణ్యమునకై అప్పికొండ సోమేశ్వర దేవరకు ఏదియో ఒక దానము చేసినట్లు చెప్పుచున్నది. పంచదార్ల వద్ద లభించిన ఒక శాసనము ఎలమంచి చాళుక్యుల పూర్వ వంశాను క్రమణను చెప్పుచూ మూడవ ఉపేంద్రుడు కొప్పదేవ గంగాంబికల కుమారునిగా పేర్కొనినది. ఈ కొప్పదేవ చక్రవర్తి సా.శ.. 1300-1356 సంవత్సరాల మధ్య, అతని తరువాత ఉపేంద్రుడు సా.శ..1372 వరకు పాలించి ఉండవచ్చును.

మూలాలు

[మార్చు]

[2]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-06.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-06.
  • 1983 భారతి మాస పత్రిక- వ్యాసము : రెండు అప్పికొండ శిలాశాసనములు. వ్యాసకర్త: శ్రీ.నాగాభట్ల మార్కండేయ శర్మ.