సబ్బవరం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సబ్బవరం
—  మండలం  —
విశాఖపట్నం జిల్లా పటములో సబ్బవరం మండలం యొక్క స్థానము
విశాఖపట్నం జిల్లా పటములో సబ్బవరం మండలం యొక్క స్థానము
సబ్బవరం is located in ఆంధ్ర ప్రదేశ్
సబ్బవరం
ఆంధ్రప్రదేశ్ పటములో సబ్బవరం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°47′24″N 83°07′23″E / 17.790°N 83.123°E / 17.790; 83.123
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విశాఖపట్నం
మండల కేంద్రము సబ్బవరం
గ్రామాలు 33
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 67,334
 - పురుషులు 34,072
 - స్త్రీలు 33,262
అక్షరాస్యత (2011)
 - మొత్తం 55.46%
 - పురుషులు 68.91%
 - స్త్రీలు 41.49%
పిన్ కోడ్ {{{pincode}}}
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విశాఖపట్నం
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

సబ్బవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు అదేపేరుగల మండలమునకు కేంద్రము.[1]

ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీ యాత్ర చరిత్రలొ సబ్బవర గ్రామ ప్రస్తావన ఉంది. దాని ప్రకారము: 13 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి ఆలమందకు 6 కోసుల దూరములో వుండే సబ్బవర మనే వూరు 2 గంటలకు చేరినాను. దారి బహు దొంగల భయము. కొండలు, అడివి దారి కిరుపక్కలా ఉన్నాయి. కొంతదూరము రాతిగొట్టు తతిమ్మాదారి కొంతదూరము యిసకపొర, కొంతదూరము రేగడాభూమిగా నున్నది. ఆలమంద అనే వూరికి సమీపమందు అరణ్యము మధ్యే కొండమీద పర్మనాభమనే స్థలము ఉంది. పురాతన ప్రతిష్ఠగాని అనాదిపురాణ సిద్ధముకాదు. అక్కడ మానుషసంచారము విస్తారములేదు. సబ్బవరమనే వూళ్ళో వెన్నకోటివారు ఒక గ్రామము విజయరామరాజువద్ద సంపాదించి ఒకపాలు అగ్రహారానకు వృత్తులు చేసి మరివొక పాలు అన్నసత్రానకు వొదిగేటట్టు నిశ్చయము చెసి ఒక అన్న సత్రము కట్టి మరివొకపాలు తమ వంశస్థుల అనుభవానకు వుంచి నాడు గనుక అతని వంశస్థుడైన రవణప్ప ఆ సత్రము లోకోపకారముగా బహుచక్కగా నడిపింపుచున్నాడు. యీ దినము మేము కొంచము తడిశినందున యీ రాత్రికూడా నిలిచినాను. యీవూళ్ళో వచ్చిన సమస్తజాతిపాంధులకు కావలసిన భోజనసామానులు యీ సత్రములో బలవంతముచేసి కావలిస్తే పక్వాన్నముగాకూడా పెట్టుతారు. అంగళ్ళు విచారించనక్కరలేదు. 40 బ్రాహ్మణయిండ్లున్నవి. మంచి వసతైన గ్రామము.

యీవూరికి రెండుకోసులదూరములో సింహ్వాచలం మనే మహా స్థల మున్నది. ఆ గుడిఖర్చుకు సాలుకు 10 వేల రూపాయిలు తగులు చున్నవి. యీ ధర్మము విజయనగరపురాజు పరిపాలనఛేయుచున్నాడు. యీస్థల మహాత్మ్యము ప్రహ్లాదుణ్ని తండ్రిదండనవల్ల నివర్తింప చేసి కాపాడిన అవసరము. యీ మూర్తి పేరు వరాహ నరసింహమూర్తి. అనేక జలధారలు స్రవింఛే పర్వతము మీద వరాహాకృతిగా ఆ మూర్తి ఒకమందిరములో వసించి ఉన్నాడు. 200 వైష్ణవుల యిండ్లు యీ స్థలమందున్నవి. రాజోపచారములతో యీ మూర్తిని ఆరాధింపుచున్నారు. అక్షతదియతప్ప మరియేదినము ఆ మూర్తి దర్శనములేదు. తతిమ్మా దినాలు చందనముచేత ఆ మూర్తిని కప్పివుంటారు.

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 67,334 - పురుషులు 34,072 - స్త్రీలు 33,262

మూలాలు[మార్చు]Visakhapatnam.jpg

విశాఖపట్నం జిల్లా మండలాలు

ముంచింగి‌పుట్టు | పెదబయలు | హుకుంపేట | దుంబిరిగూడ | అరకులోయ | అనంతగిరి | దేవరాపల్లి | చీదికడ | మాడుగుల | పాడేరు | గంగరాజు మాడుగుల | చింతపల్లి | గూడెం కొత్తవీధి | కొయ్యూరు | గోలుకొండ | నాతవరం | నర్సీపట్నం | రోలుగుంట | రావికమతం | బుచ్చయ్యపేట | చోడవరం | కె.కోటపాడు | సబ్బవరం | పెందుర్తి | ఆనందపురం | పద్మనాభం | భీమునిపట్నం | విశాఖపట్నం మండలం | విశాఖపట్నం (పట్టణ) | గాజువాక | పెదగంట్యాడ | పరవాడ | అనకాపల్లి | మునగపాక | కశింకోట | మాకవరపాలెం | కొత్తఊరట్ల | పాయకరావుపేట | నక్కపల్లి | శృంగరాయవరం | ఎలమంచిలి | రాంబిల్లి | అచ్చితాపురం

"https://te.wikipedia.org/w/index.php?title=సబ్బవరం&oldid=2231757" నుండి వెలికితీశారు