దాడి వీరభద్రరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాడి వీరభద్రరావు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1985 - 2004
ముందు రాజా కన్నబాబు
తరువాత కొణతాల రామకృష్ణ
నియోజకవర్గం అనకాపల్లి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1950
విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు దాడి జగ్గారావు
సంతానం రత్నాకర్
వృత్తి రాజకీయ నాయకుడు

దాడి వీరభద్రరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1985 నుండి 1999 వరకు వరుసగా నాలుగుసార్లు అనకాపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

రాజకీయ జీవితం[మార్చు]

దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుండి టిడిపి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యే గెలిచాడు. దాడి వీరభద్రరావు 2004,2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి 2013లో ఎమ్మోల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి 2014 ఎన్నికల తర్వాత వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆయన 2019 మార్చిలో తెలుగుదేశం పార్టీని విడి వైసీపీలో చేరాడు.[1][2]

ఎమ్మెల్యేగా పోటీ[మార్చు]

సంవత్సరం పేరు గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
2004 అనకాపల్లి కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ 63277 దాడి వీరభద్రరావు తె.దే.పా 46244
1999 అనకాపల్లి దాడి వీరభద్రరావు తె.దే.పా 52750 కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ 49039
1994 అనకాపల్లి దాడి వీరభద్రరావు తె.దే.పా 45577 దంతులూరి దిలీప్ కుమార్ స్వతంత్ర 43966
1989 అనకాపల్లి దాడి వీరభద్రరావు తె.దే.పా 46287 దంతులూరి దిలీప్ కుమార్ కాంగ్రెస్ పార్టీ 44029
1985 అనకాపల్లి దాడి వీరభద్రరావు తె.దే.పా 51083 నిమ్మదలా సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ 21542

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (9 March 2019). "వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు". Retrieved 3 June 2022.
  2. Andhra Jyothy (9 March 2019). "జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు". Archived from the original on 3 జూన్ 2022. Retrieved 3 June 2022.