Jump to content

రోటరీ క్లబ్

వికీపీడియా నుండి
బ్రెజిల్‌లోని ఫీరా డి సంతానాలో రోటరీ స్మారక చిహ్నం.

రోటరీ క్లబ్గా ప్రసిద్ధిచెందిన రోటరీ ఇంటర్నేషనల్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన సామాజిక సేవా సంస్థ. పోలియో మహమ్మారిని ధరిత్రి నుంచి పూర్తిగా తొలగించుటకు ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ సెక్యూలర్ పద్ధతిలో అన్ని జాతులు, మతాలు, కులాలు, తెగలు మొదలైన విభేదాలు లేకుండా సంఘసేవ చేస్తున్నది. దీనికి చెందిన 32,000 పైగా క్లబ్బులు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1.2 మిలియన్ సభ్యుల్ని కలిగివున్నది.[1] ఈ సంస్థ సభ్యుల్ని రొటారియన్స్ అని పిలుస్తారు. ఈ సంస్థ ముఖ్యమైన ఉద్దేశాలు వ్యాపార, సాంకేతిక నిపుణుల్ని సంఘసేవలో భాగం చేసి ప్రపంచంలో శాంతి సామరస్యాలను పెంపొందించడం. సభ్యులు వారానికొకసారి చిన్న పార్టీలో కలిసి సాంఘిక సేవా కార్యక్రమాల రూపకల్పన చేస్తారు.

రోటరీ క్లబ్ యొక్క ప్రధానమైన మోటో "స్వార్ధం కన్న సేవే మిన్న" (Service above Self), ద్వితీయ మోటో "సేవలో ప్రథములే లాభం పొందేవారిలో ప్రథములు" (They profit most who serve best).[2]

ప్రధాన కార్యక్రమాలు

[మార్చు]

దేశంలో పోలియో నిర్మూలనపై విజయం సాధించడంలో తనవంతుగా నాయకత్వం వహించినందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని రోటరీ అత్యున్నత పురస్కారం అవార్డ్ ఆఫ్ హానరీ 2014 ఫిబ్రవరి 11న లభించింది.

అంతర్జాతీయ రోటరీ క్లబ్ అధ్యక్షుడు రాన్ బర్టన్ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతికి ఈ అవార్డును అందజేశారు [3]. మానవతా దృక్పథంతో ప్రజలకు మంచి చేయడానికి కృషి చేసిన దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలకు ఈ అవార్డును అందజేస్తారు.

మూలాలు

[మార్చు]
  1. "Presentation of the Rotary on their website". Archived from the original on 2008-09-01. Retrieved 2008-12-11.
  2. Modified by the 2004 "RI Council on Legislation", from the original "He profits most who serves the best" — see Rotary International manual, Part 5 (Rotary Marks), online at Rotary Marks Archived 2008-08-28 at the Wayback Machine accessed 2 June 2006
  3. http://www.jagranjosh.com/current-affairs/telugu-pranab-mukherjee-conferred-award-of-honour-of-rotary-international-1392194473-3[permanent dead link]

బయటి లింకులు

[మార్చు]