ఆంధ్ర విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
(ఆంధ్రా యూనివర్సిటీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆంధ్ర విశ్వవిద్యాలయం
రకంసార్వత్రిక
స్థాపితంఏప్రిల్ 26,1926
వైస్ ఛాన్సలర్జి. నాగేశ్వరరావు
రెక్టర్డి.గాయత్రి
డీన్కె.రామమోహన రావు
స్థానంవిశాఖపట్టణం, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము
కాంపస్పట్టణ ప్రాంతం
అనుబంధాలుయుజిసి
జాలగూడుhttp://www.andhrauniversity.edu.in
ఆంధ్ర విశ్వవిద్యాలయం భవనాలు

ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఆంధ్ర విశ్వకళా పరిషత్,ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University)), భారతదేశంలోని ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇది విశాఖపట్టణంలో ఉంది. ఈ విశ్వవిద్యాలయం మద్రాస్ యూనివర్సిటీకి అప్పుడు అనుబంధంగా ఉన్న సర్కారు, రాయలసీమ లలో ఉన్న కళాశాలతో 1926లో ఏర్పడింది. ఏర్పడింది. 1926 నుండి 1931 వరకు, మరలా రెండవ విడత 1936 నుండి 1949 వరకు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా కట్టమంచి రామలింగారెడ్డి వ్యవహరించాడు. ఆ మధ్య కాలములో సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యక్షునిగా ఉన్నాడు. పేరుగాంచిన ఈ ఉత్తమ ఉపాధ్యాయుని నోటి మాటల్లో ఈ విశ్వవిద్యాలయం "కొత్తవారికి సరైన విశ్వవిద్యాలయం". ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రముఖ విద్యావేత్త న్యూమెన్ ఆదర్శ విశ్వవిద్యాలయం ఊహకు అనుగుణంగా తీర్చిదిద్దబడింది.

1954 లో రాయలసీమ జిల్లాలతో తిరుపతి కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పడింది. 1967లో గుంటూరు లో, ఈ విశ్వవిద్యాలయం ఒక పోస్టుగ్రాడ్యుయేటు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది 1976 లో నాగార్జున విశ్వవిద్యాలయంగా అవతరించింది.

ఆంధ్ర విశ్వ విద్యాలయము ఉత్తర, దక్షిణ ప్రాంగణము (క్యాంపస్)లుగా ఉంది. దక్షిణ ప్రాంగణం (ఇదే మొదటి నుంచీ ఉన్న ఆవరణ) లో పాలనా విభాగముతో పాటు కళలు, మానవీయ శాస్త్రాలు, శాస్త్రీయ విజ్ఞానాల శాఖలు ఉన్నాయి. 1962 లో కొత్తగా ఏర్పరచిన ఉత్తర ప్రాంగణములో ఇంజనీరింగ్ కళాశాల ఉంది.

విశ్వవిద్యాలయ పోస్టు గ్రాడ్యుయేటు విద్య అవసరాల కొరకు ఉమ్మడి శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాలలో ఎచ్చెర్ల, కాకినాడ, తాడేపల్లిగూడెం, విజయనగరంలో పోస్టు గ్రాడ్యుయేటు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2006లో రాజమండ్రిలో ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయమును ఏర్పాటు చేసి దాని పరిధి లోనికి ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని కళాశాలలను తెచ్చారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలలోని కళాశాలలకు ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధి పరిమితమైంది. విశ్వవిద్యాలయ నాణ్యతకు గుర్తింపు నాక్ (NAAC) సంస్థ ఇచ్చిన "ఎ" గ్రేడు.

విశ్వవిద్యాలయ చిహ్నం[మార్చు]

ఆంధ్ర విశ్వవిద్యాలయం
  • ఆంధ్ర విశ్వవిద్యాలయ చిహ్నాన్ని కట్టమంచి రామలింగారెడ్డి (సిఆర్‌రెడ్డి) ఉప కులపతిగా ఉన్న సమయంలో కౌతా రామమోహనశాస్త్రి రూపకల్పన చేశాడు. చిహ్నంలో ఉన్న తామరపుష్పం సిరి సంపదల దేవత లక్ష్మీదేవి, చదువుల దేవత సరస్వతీదేవి ల ఆసనానికి గుర్తు. స్వస్తిక్ ముద్ర ఆర్యుల ఆశీర్వచనానికి గుర్తు. బయటి వృత్తంలో ఉన్న 64 తామర రేకులు 64 కళలకు గుర్తులు. చిహ్నంలో ఉన్న తేజస్వినావధీతమస్తు అనే వాక్యానికి "నీ దివ్యమైన కాంతితో మా జ్ఞానాన్ని పెంపొందించు" అని అర్ధం. చిహ్నంలో ఉన్న రెండు పాములు విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, కాపాడుకోవడానికి గుర్తులు. ప్రాచీన నాగ వంశీకులలో ఆంధ్రుల మూలాలు ఉన్నాయంటారు. ఆ విధంగా ఈ రెండు పాములు ఆంధ్రుల ప్రాచీన మూలాలను గుర్తుకు తెస్తాయి.[1]

ప్రత్యేకతలు[మార్చు]

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో యోగ విలేజ్
  • ఆంధ్ర విశ్వవిద్యాలయం భారతదేశం లోనే మొదటిసారిగా 1934 నుండే కామర్సులో ఆనర్సు డిగ్రీ మొదలుపెట్టింది, 1957లో దేశంలోనే మొట్టమొదటి సారిగా ఎంబిఎ కోర్సును ప్రవేశపెట్టింది.[2]
  • ఫార్మసీ విభాగం ఏర్పాటులో భారతదేశంలో రెండవ స్థానం (మొదట బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం).
  • మానవ వనరులను, సాఫ్టువేరు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దటానికి, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ మధ్యనే (2008 నుండి) "స్కూల్ ఆఫ్ ఐటి" అనే సంస్థను నెలకొల్పింది.[3]

కళాశాలలు[మార్చు]

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ గేట్
ఆంధ్ర విశ్వవిద్యాలయం అకాడమిక్ స్టాఫ్ కాలేజ్

కళా ప్రపూర్ణ[మార్చు]

కళా ప్రపూర్ణ ఒక బిరుదు లేదా పురస్కారం. ఇది, విద్యా సాహిత్య సాంస్కృతిక విషయాలలో విశేషమైన కృషి చేసిన వారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రదానం చేసే గౌరవ డాక్టరేట్.

ప్రచురణలు[మార్చు]

తెలుగు పుస్తకాలు[మార్చు]

ఆంగ్ల పుస్తకాలు[మార్చు]

  • The Simhachalam Temple (1969)
  • A Descriptive Catalogue of the Telugu Manuscripts (1999)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధికారిక వెబ్సైటులో విశ్వవిద్యాలయ చిహ్నం Archived 2007-05-27 at the Wayback Machine గురించి వివరిస్తున్న పేజీనుండి మే 21, 2007న సేకరించబడింది.
  2. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధికారిక వెబ్‌సైటులో కళలు , కామర్సు కళాశాల పేజి నుండి మే 21, 2007న సేకరించబడింది.
  3. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధికారిక వెబ్‌సైటులో స్కూల్ ఆఫ్ ఐటి Archived 2008-05-10 at the Wayback Machine గురించి. ఏప్రిల్ 23, 2008 న సేకరించబడింది.

బయటి లింకులు[మార్చు]