Jump to content

తెలుగు శాఖ, ఆంధ్ర విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్

'తెలుగు శాఖ'ఆంధ్ర విశ్వవిద్యాలయం లోకి ఒక విభాగం.1926లో కట్టమంచి రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం ఆవిర్భవించింది.బొబ్బిలి సంస్థానాధిపతి శ్రీ రావు వేంకటశ్వేతా చలపతి రంగారావు గారు సంస్కృతాంధ్ర భాషల అధ్యయనానికి లక్షరూపాయల భూరి విరాళం ఇవ్వాలని నిశ్చయించారు.ఆ విధంగా 1931 సంవత్సరంలో తెలుగు శాఖ ప్రారంభమయింది.

మొదట 1931లో పింగళి లక్ష్మీకాంతం గారు లెక్చరరు గాను, మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు భాషా పండితులు గాను నియమితులై తెలుగు శాఖ ప్రాభవానికి పెద్దపీట వేశారు. మొదట బి.ఏ. (ఆనర్స్) ప్రారంభమయింది.

ఆ తరువాత లక్ష్మీకాంతం గారు తెలుగు శాఖ అధ్యక్షులయ్యారు.1933లో గంటి జోగి సోమయాజి గారు లెక్చరరు గాను, వజ్ఝల చిన సీతారామ శాస్త్రి గారు భాషా పండితులుగా నియమితులయ్యారు.

స్వర్ణోత్సవ సంచిక-1981

[మార్చు]
  1. ప్రాచ్య పాశ్చాత్య దర్శనములు - ఆచార్య గంటి జోగి సోమయాజి
  2. పురాణములెందులకు? - శ్రీ రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి
  3. ఆంధ్ర వాజ్మయమునందలి అభ్యుదయ కవులు - ఆచార్య దివాకర్ల వేంకటావధాని
  4. విమర్శన విధానములు - ఆచార్య యస్.వి.జోగారావు
  5. ఆంధ్ర ప్రసస్తి - ఆద్య ప్రకృతి - డా. కొర్లపాటి శ్రీరామముర్తి
  6. పాత్రోచిత భాష - డా. చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి
  7. తెలుగు తెనుగుమాటల పుట్టు పుర్వోత్తరాలు - డా. లకంసాని చక్రధరరావు
  8. మనుచరిత్రము - మనచరిత్రము - డా. వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి
  9. రామాయణము - తులనాత్మక పరిశీలన - డా. జోస్యుల సూర్యప్రకాశరావు
  10. స్వయం భూకవి ఉపమలలో ఉపజ్ఞ - డా. కోలవెన్ను మలయవాసిని
  11. శ్రీశ్రీ - డా. అత్తలూరి నరసింహారావు
  12. యెంకి పాటలు జానపద గేయాలు కావా? - శ్రీ పల్లికొండ ఆపదరావు