అక్షాంశ రేఖాంశాలు: 17°46′54″N 83°22′38″E / 17.78167°N 83.37722°E / 17.78167; 83.37722

గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజిమెంటు

వికీపీడియా నుండి
(గీతం విశ్వవిద్యాలయం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

17°46′54″N 83°22′38″E / 17.78167°N 83.37722°E / 17.78167; 83.37722

గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజిమెంటు
పూర్వపు నామములు
GITAM కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్
గీతం విశ్వవిద్యాలయం.
నినాదంశ్రమించు సేవచేయు వర్థిల్లు
ఆంగ్లంలో నినాదం
Strive Serve Thrive
రకండీమ్డ్ విశ్వవిద్యాలయం
స్థాపితంవిశాఖపట్నం (1980), హైదరాబాదు (2009), బెంగళూరు (2012)
ఛాన్సలర్కోనేరు రామకృష్ణారావు
అధ్యక్షుడుఎం.వి.వి.ఎస్. మూర్తి
వైస్ ఛాన్సలర్ఎం.ఎస్. ప్రసాదరావు
స్థానంవిశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
కాంపస్హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
రంగులుబంగారు, గోధుమ   
అనుబంధాలుయూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్, నేషనల్ అస్సెస్‌మెంట్ అండ్ ఆక్రెడిటేషన్ కౌన్సిల్
దస్త్రం:The library, Gitam University.jpg
నాలెడ్జి రీసోర్స్ సెంటర్

గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజిమెంటు (GITAM) ఉన్నత విద్యను అందించే సంస్థ. ఇది "గీతం విశ్వవిద్యాలయం", "గీతం కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్" గా పిలువబడుతుంది. ఈ సంస్థకు భారతదేశంలో విశాఖపట్నం, హైదరాబాదు, బెంగుళూరు నగరాలలో ప్రాంగణాలున్నాయి. ఇది 1980లో విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఏర్పడింది. 2007లో యు.జి.సి చట్టం 1965 లోని సెక్షను 3 ప్రకారం డీమ్డ్ విశ్వవిద్యాలయ హోదాను పొందింది. సుప్రీమ్ కోర్టు తీర్పు ననుసరించి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను 2017 నవంబరు 10 న ఇచ్చిన ఆదేశాల ప్రకారం తన పేరును జిఐటిఎఎమ్, డీమ్డ్ టు బి యూనివర్సిటీ గా మార్చుకుంది.[1] ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశ్వవిద్యాలయ స్థాయిలో ఇంజనీరింగ్ కోర్సును అందించే మొదటి ప్రైవేటు విశ్వవిద్యాలయం. విశాఖపట్నం లోని దీని ప్రధాన ప్రాంగణం 100 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది.

విద్యాసంబంధిత విషయాలు

[మార్చు]

ఈ విశ్వవిద్యాలయం టెక్నాలజీ, ఫార్మసీ, విజ్ఞానశాస్త్రం, మేనేజిమెంటు, అంతర్జాతీయ బిజినెస్, ఆర్కిటెక్చర్, న్యాయశాస్త్రం వంటి అంశాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్, డాక్టరల్ స్థాయిలలో 109 ప్రోగ్రాములను అందిస్తుంది.[2]

ర్యాంకులు

[మార్చు]
విశ్వవిద్యాలయం, కళాశాల ర్యాంకులు
జనరల్ - భారతదేశం
NIRF (అంతటా) (2018)[3]101–150
NIRF (విశ్వవిద్యాలయాలు) (2018)[4]85

గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజిమెంటు (గీతం) 2018[4]లో జాతీయ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) వారి భారతదేశ విశ్వవిద్యాలయాల జాబితాలో 85వ ర్యాంకుపొందింది. అన్ని విద్యాలయాల జాబితాలో 101-150 ర్యాంకును సాధించింది.[3]

ప్రాంగణాలు

[మార్చు]

గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజిమెంటుకు భారతదేశలో విశాఖపట్నం, హైదరాబాదు, బెంగుళూరు నగరాలలో మూడు ప్రాంగణాలున్నాయి.[5]

విశాఖపట్నం ప్రాంగణం

[మార్చు]

గీతం సంస్థకు విశాఖపట్నంలో రుషికొండలో 170 ఎకరాల విస్తీర్ణంగల ప్రాంగణం ఉంది. ఈ ప్రాంగణంలో మూడు ప్రధాన ఆహార క్యాంటీన్లు, కొన్ని ఫాస్టు ఫుడ్ సెంటర్లు, బహుళ-ప్రయోజన బాహ్య మైదానం, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వ్యాయామశాల, టెన్నిస్ కోర్టులకు అంతర మైదానంలో ఉన్నాయి. ఈ ప్రాంగణంలో ఈ క్రింది పాఠశాలలున్నాయి:

 • గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
 • గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సు
 • గీతం ఇనిస్టిట్యూట్ అఫ్ మేనేజిమెంటు
 • గీతం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్
 • గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ
 • గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్
 • న్యాయ పాఠశాల.
 • గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్
 • గీతం స్కూల్ అఫ్ నర్సింగ్
 • సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (దూరవిద్యా విభాగం)
 • గీతం స్కూల్ ఆఫ్ గాంధియన్ స్టడీస్.

హైదరాబాదు ప్రాంగణం

[మార్చు]

గీతం సంస్థ హైదరాబాదు ప్రాంగణం 2009 లో స్థాపించబడినది. ఇందులో ఈ క్రింది పాఠశాలలున్నాయి[6]:

దస్త్రం:GITAM-University-Hyderabad-Campus.jpg
గీతం, హైదరాబాదు ప్రాంగణం

పాఠశాలలు

[మార్చు]
 • గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ
 • హైదరాబాద్ బిజినెస్ స్కూల్
 • స్కూల్ ఆఫ్ సైన్స్
 • గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ

4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు

[మార్చు]
 • బి.టెక్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
 • బి.టెక్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
 • బి.టెక్. కంప్యూటర్ సైన్స్
 • బి.టెక్. సివిల్ ఇంజనీరింగ్
 • బి.టెక్. మెకానికల్ ఇంజనీరింగ్
 • బి.టెక్. ఏరోనాటికల్ ఇంజనీరింగ్
 • బి.టెక్. ఫార్మసీ

ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు

[మార్చు]
 • బి.టెక్ + ఎం.టెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ )
 • బి.టెక్ + ఎం.టెక్ (మెకానికల్ ఇంజనీరింగ్ )

బెంగళూరు ప్రాంగణం

[మార్చు]

గీతం బెంగళూరు ప్రాంగణ పరిథిలో ఈ క్రింది పాఠశాలలున్నాయి.:

 • గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ
 • బెంగళూరు స్కూల్ ఆఫ్ మేనేజిమెంటు స్టడీస్

విద్యార్థి కార్యకలాపాలు

[మార్చు]

గీతం సంస్థలలో విద్యార్థులకు అనేక విద్యాపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఇచట సాంస్కృతిక సంస్థలలో కళాకృతి, జి.స్టుడియో, జి.మాగ్, ఎ-సెల్, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ వంటివి ఉన్నాయి.[7]

ఆరోగ్య సంరక్షణ

[మార్చు]

గీతం ప్రాంగణంలో 12x5 ఆరోగ్య సంరక్షణ కేంద్రం ఉంది. ఇచట అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్ సేవలు అందిచబడతాయి. విద్యార్థులు, అధ్యాపకులకు నిరంతరాయ విద్యుత్ సరఫరాను అందిస్తారు. 24x7 భద్రతా వ్యవస్థ ఉంది. బాలుర వసతి గృహంలో 3500 మందికి, బాలికల వసతి గృహంలో 2000 మందికి వసతి సౌకర్యం ఉంది.

విజేతల దినోత్సవం

[మార్చు]

గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్‌లు సంయుక్తంగా విజేతల దినోత్సవాన్ని 2018 మార్చి 27న నిర్వహించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నూకల నరేందర్‌రెడ్డి పాల్గొని విద్యార్థులకు నియామక ఉత్తర్వులను అందజేశాడు. 2017-2018 విద్యా సంవత్సరంలో దాదాపు 100 దేశీయ, బహుళ జాతీ కంపెనీలు హైదరాబాద్ గీతమ్‌లో ప్రాంగణ నియామకాలు నిర్వహించి 82 శాతం మంది బీటెక్, ఎంటెక్, ఎంబీఏ విద్యార్థులను ఎంపిక చేసినట్లు గీతం వర్గాలు ప్రకటించాయి. ఐబీఎం 70 మంది గీతం హైదరాబాద్ విద్యార్థులను ప్రాంగణ నియామకాల్లో ఎంపిక చేయగా, అమెజాన్ 79 మందిని, జెన్‌పాక్ట్ 50 మందిని, ఎన్‌టీటీ డేటా 47 మందిని, వాల్యూ మొమెంటం ఇద్దరిని, వర్చూసా 23 మంది విద్యార్థులనూ ఎంపిక చేసినట్లు గీతం అధికారులు తెలిపారు.[8]

పూర్వ విద్యార్థులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "Use of the word 'University' by Institutions Deemed to be Universities - Directions issued by Hon'ble Supreme Court" (PDF). Archived from the original on 2018-04-30. Retrieved 2018-05-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 2. "Welcome to GITAM University". gitam.edu. Archived from the original on 21 జూన్ 2011. Retrieved 15 June 2011.
 3. 3.0 3.1 "National Institutional Ranking Framework 2018 (Overall)". National Institutional Ranking Framework. Ministry of Human Resource Development. 2018.
 4. 4.0 4.1 "National Institutional Ranking Framework 2018 (Universities)". National Institutional Ranking Framework. Ministry of Human Resource Development. 2018.
 5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-05-26. Retrieved 2018-05-30.
 6. "Courses offered". Archived from the original on 2010-03-12. Retrieved 2018-05-30.
 7. "GITAM Student Activities". Archived from the original on 2016-10-01. Retrieved 2018-05-30.
 8. "గీతం విశ్వవిద్యాలయంలో విజేతల దినోత్సవం".

బయటి లంకెలు

[మార్చు]