చావుల మదుం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్మశాన వాటిక - చావుల మదుం[మార్చు]

  • విశాఖపట్నం కాన్వెంటు జంక్షను దగ్గర ఉంది దీనినే చావుల మదుం అంటారు. ఇది శ్మశాన వాటిక. ఇక్కడ శవాలను సమాధి చేసిన తరువాత, ప్రక్కనే ఉన్న చెరువులో స్నానం చేసీవారు. నేడు ఆ చెరువును పూర్తిగా కప్పివేసారు చెత్త చెదారం వేసి. ఇప్పుడు అక్కడ చెరువు ఉండేది అంటే నమ్మటం కష్టం. విశాఖపట్నం కుగ్రామంగా ఉన్నప్పటి నుంచీ, ఇదే శ్మశాన వాటిక. ఇవాళ ఉన్న రామకృష్ణ సినిమాహాలు, కర్రలదొడ్డి, కొబ్బరితోట ప్రాంతాలలో, బరువైన పాడెను ఒకసారి దించి, ఆయాసం తీర్చుకుని మరలా బయలు దేరే పద్ధతి ఉంది. అందరూ అదే పద్ధతిని పాటిస్తారు. చావుల మదుం దగ్గర ఉన్న హిందూ శ్మశాన వాటిక ప్రక్కనే, క్రైస్తవుల శ్మశానవాటిక ఉంది. విద్యుత్తు దహన వాటిక కూడా ఉంది ఇక్కడ. ఈ ప్రక్కనే సెయింట్ జోసెఫ్ మహిళా డిగ్రీ కళాశాల ఉంది. ఈ చావుల మదుం (కాన్వెంటు జంక్షను) విశాఖ పట్నానికి ఒక ముఖ్యమైన కూడలి. ఈ కూడలి నుంచే, పాత నగరానికి వెళ్ళటానికి ఒక దారి. గాజువాకకు వెళ్ళటానికి ఒక దారి. మర్రిపాలెం, ఎన్.ఏ.డి జంక్షనుకి వెళ్ళటానికి ఒక దారి. రైల్వే స్టేషనుకి, దొండపర్తి, ద్వారకానగర్, ఆర్.టీ.సీ. కాంప్లెక్సుకి వెళ్లటానికి ఒక దారి.ఈ నాలుగు దార్లు కలిసిన కూడలి ఇది.