Jump to content

గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్

వికీపీడియా నుండి
గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పటం
భౌగోళికం
స్థానంచెంగల్ రావు పేట, విశాఖపట్నం, భారతదేశం
వ్యవస్థ
[యూనివర్సిటీ అనుబంధంఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము
Services
అత్యవసర విభాగంఉంది
పడకలు200
హెలిపాడ్No
చరిత్ర
ప్రారంభమైనది1894

గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ (గోషా హాస్పిటల్), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలో తొలి మహిళా, పిల్లల హాస్పిటల్. శతాబ్దానికి పైగా సేవలందించిన ఈ హాస్పిటల్ విశాఖపట్నంలోని చెంగల్ రావు పేట ప్రాంతంలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

1894లో రాజా గోదాయ్ నారాయణ గజపతి రావు ఈ హాస్పిటల్ నిర్మించడంకోసం భూమిని కొనుగోలు చేశాడు. ఈ హాస్పిటల్ ప్రారంభ రోజుల్లో హిల్డా మేరీ లాజరస్ చేత నడుపబడేది. హాస్పిటల్ ని స్థాపించడానికి బ్రిటన్ రాణి విక్టోరియా నుండి అనుమతి వచ్చినందుకు హాస్పిటల్ పేరును విక్టోరియా హాస్పిటల్ గా మార్చారు. 1949లో ఈ హాస్పిటల్ మద్రాస్ ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది.[2]

సేవలు

[మార్చు]

ప్రస్తుతం ఈ హాస్పిటల్ లో 200 పడకలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 100 పడకలతో దీనిని విస్తరిస్తోంది.[3]

మూలాలు

[మార్చు]
  1. "introduction of the hospital". thehansindia. 31 Aug 2018. Retrieved 18 May 2021.
  2. "history". deccanchronicle. 16 Oct 2015. Retrieved 18 May 2021.
  3. "services". indianexpress. 18 Apr 2017. Retrieved 18 May 2021.