బావికొండ
Jump to navigation
Jump to search
?బావికొండ బౌద్ధవిహారము ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
సమీప నగరం | విశాఖపట్నం |
జిల్లా (లు) | విశాఖపట్నం జిల్లా |
బావికొండ బౌద్ధ సముదాయం (17 49 ఉ - 83 23 తూ) విశాఖపట్నం నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 130 మీటర్ల ఎత్తుగల ఒక కొండపై ఉంది. కొండపై వర్షపు నీరు సేకరించి నిల్వచేసుకోవటానికి అనేక బావులుండటంతో బావికొండ అని పేరు వచ్చింది. బావికొండ బౌద్ధారామం క్రీ.పూ మూడవ శతాబ్దానికి చెందినది.
ఇక్కడ జరిగిన తవ్వకాలలో ఒక పెద్ద బౌద్ధ సముదాయం బయల్పడింది. ఒక మట్టి కలశంలో ఒక ఎముక ముక్క కూడా దొరికింది. ఇది బుద్ధుని భౌతిక అవశేషమని భావిస్తున్నారు. ఇంకా అనేక శాసనాలు, మట్టి పాత్రలు, ఫలకాలు, ఇటుకలు, నాణేలను కూడా రాష్ట్ర పురాతత్వశాఖ వారు సేకరించారు.[1]
బావికొండకు సమీపంలో మరో రెండు బౌద్ధ సముదాయాలున్నాయి. అవి తొట్లకొండ, పావురాలకొండ.
చిత్రమాలిక[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-02-09. Retrieved 2012-11-26.

Wikimedia Commons has media related to Bavikonda.