ఆంధ్రప్రదేశ్ పురావస్తు, సంగ్రహాలయ శాఖ
ఆంధ్రప్రదేశ్ పురావస్తు, సంగ్రహాలయాల శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ. ఆంధ్రప్రాంతం మద్రాసు ప్రిసిడెన్సీలో ఉండేది.1904 పురావస్తు చట్టం ప్రకారం విధులు మద్రాసు ప్రిసెడెన్సీలో పరిశీలించబడ్డాయి.1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత పూర్వ హైదరాబాదుకు చెందిన పురావస్తు శాఖ ఇందులో విలీనం చేయబడింది.ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలను విస్తరించింది.ఆంధ్రప్రదేశ్ పురావస్తు, సంగ్రహాలయాల శాఖగా 1960 సంవత్సరంలో మార్చబడింది. ఆంధ్రప్రదేశ్ పురావస్తు. సంగ్రహాలయాల శాఖ విభాగం పరిధి పెంచబడింది.[1]దీని ప్రధాన కార్యాలయం విజయవాడలోని గోళ్లపూడిలో ఉంది.[2]
శాఖ ప్రధాన విధులు
[మార్చు]పురావస్తు, ప్రదర్శనల శాలల ప్రధాన విధులు పురావస్తు సంపదను కనుగొనడం,శాస్త్రీయ, క్రమబద్ధమైన పద్దతి ద్వారా పురావస్తు సంపదను, సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, విదేశీ పురావస్తు అన్వేషణలు, వారసత్వ ప్రదేశాలు, ప్రదర్శనల శాలల నిర్వహణ పరిశీలించటం, పర్యేవేక్షించటం ఈ శాఖ అజమాయిషీలో జరుగుతాయి.ఆంధ్రప్రదేశ్‌లోని ప్రదర్శనల శాలల ప్రధాన లక్ష్యం రాష్ట్ర పురాతన సంపదను కాపాడటం, మ్యూజియంలలో నేపథ్యంగా వాటిని ప్రదర్శించడం, రాష్ట్ర సాంస్కృతిక, చారిత్రక వారసత్వం గురించి ప్రజలలో అవగాహన కల్పించడం ఈ శాఖ ద్వారా జరుగుతుంది.[1]
ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత
[మార్చు]జూన్ 2014 జూన్ లో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విభజించిన తరువాత, అవశేష విభాగంలో 6 సబార్డినేట్ కార్యాలయాలు, 13 మ్యూజియంలు దీని నియంత్రణ ఉన్నాయి.[1] ఈ విభాగం ప్రధాన కార్యకలాపాలు, సర్వేలు, అన్వేషణలు, తవ్వకాలు, చారిత్రక కట్టడాలు, ప్రదేశాల సంరక్షణ, ట్రెజర్ ట్రోవ్స్ సముపార్జన, రక్షిత స్మారక కట్టడాల శిల్ప పరిరక్షణ, ఎపిగ్రాఫికల్ సర్వే, గ్రామాల వారీగా ఎపిగ్రాఫికల్ సర్వే శిల్పాలను మార్చడం, తవ్వకం నివేదికల తయారీ, ప్రతి జిల్లాకు ఎపి స్మారక కట్టడాల డైరెక్టరీ తయారు చేయటం, స్మారక చిహ్నాల డాక్యుమెంటేషన్ చేపట్టటం, విభాగం చేపట్టిన పరిశోధనా పనులపై డిపార్ట్‌మెంటల్ ప్రచురణలను తీసుకురావడం ప్రధాన ఉద్ధేశ్యం.[3]
ప్రధాన విభాగాలు
[మార్చు]పురావస్తు శాఖను ఏడు విభాగాలు ఉన్నాయి.
- (1) సర్వే, త్రవ్వకాలు నిర్వహించడం,
- (2) శిథిలాల పరిరక్షణ,
- (3) శాసనాల సర్వే,
- (4) పరిశోధన, ప్రచురణ,
- (5) గ్రంథాలయాల అభివృద్ధి,
- (6) జిల్లా మ్యూజియంలను స్థాపించి నిర్వహించడం,
- (7) పరిపాలన, లెక్కలు
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "About Archaeology – Department of Archaeology and Museums Andhra pradesh" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-04.
- ↑ http://aparchmuseums.nic.in/?page_id=25
- ↑ "Publications – Department of Archaeology and Museums Andhra pradesh" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-04.