లంక సుందరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Lanka Sundaram

వ్యక్తిగత వివరాలు

జననం (1905-01-01)1905 జనవరి 1
చోడవరం
మరణం 1967 జనవరి 8(1967-01-08) (వయసు 62)
జాతీయత  India
పూర్వ విద్యార్థి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం
వృత్తి న్యాయవాది
లంక సుందరం

లంక సుందరం (1905 - 1967) భారత పార్లమెంటు సభ్యులు, అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో నిపుణులు. వీరు జనవరి 1, 1905 సంవత్సరం దివిసీమలొని చోడవరంలో జన్మించారు. తండ్రి సీతయ్య బ్రతుకు తెరువు కోసం బందరు చేరారు. వీరు నోబుల్ కళాశాలలో ఉన్నత పాఠశాల విద్య నభ్యసించారు. బరోడా మహారాజా శాయాజీరావు గైక్వాడ్ వక్తృత్వ పోటీలో వీరి ఇంగ్లీషు పాండిత్యానికి అబ్బురపడి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంగ్లండు పంపారు. అక్కడి ఆక్స్ ఫర్డు విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించారు. వీరు 1929లో ఐ.సి.ఎస్. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యోగాన్ని ఇవ్వడానికి తిరస్కరించడంతో వీరు నిర్మాణాత్మక కార్యక్రమాలకు పూనుకున్నారు.

1952లో విశాఖపట్నం నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. పార్లమెంటులో వీరు స్వతంత్రులుగా వివిధ చర్చలలో దైర్యంగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడేవారు. వీరు భాషా ప్రయుక్త రాష్ట్రాల సమావేశానికి అధ్యక్షులుగా నిర్వహించారు.

వీరు ఫుట్ బాల్ క్రీడాకారులు, బహు గ్రంథ రచయిత. స్వయంగా 'వీల్' అనే పత్రికను నడిపారు. కామర్స్ అండ్ ఇండస్ట్రీ పత్రికా సంపాదకులుగా వ్యవహరించారు. వందల సంఖ్యలో వ్యాసాలు వ్రాసారు. విజయవాడ తంతి తపాళా ఉద్యోగుల సంఘానికి అధ్యక్షులుగా కొంతకాలం పనిచేశారు. విశాఖపట్నం లోని సింథియా షిప్ యార్డ్ కార్మిక సంఘం నాయకుడుగా ఉన్నారు.

వీరు ఇంగ్లీషులో అనేక గ్రంథాలు రచించారు. వీరు గ్రంథాలు చాలా విశ్వవిద్యాలయాలలో పాఠ్య గ్రంథాలుగా రిఫరెన్స్ సోర్స్ గా ఉపయోగపడ్డాయి. వీనిలో 'ఇండియా అండ్ ది వరల్డ్ పాలిటిక్స్', 'ఇండియన్ ఓవర్సీస్' గ్రంధాలు ముఖ్యమైనవి. తెలుగులో ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు అనే పుస్తకాన్ని విపులమైన వ్యాఖ్యానంతో రాశారు.

వీరు 1967 సంవత్సరంలో జనవరి 8వ తేదీన పరమపదించారు.

ఆంగ్ల ప్రచురణలు

[మార్చు]
  • India in World Politics.[1]
  • Mughal Land Revenue System.[2]
  • The international aspects of Indian emigration.[3]

మూలాలు

[మార్చు]
  1. http://www.jstor.org/pss/2113356
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-01-25. Retrieved 2008-07-22.
  3. http://www.amazon.com/international-aspects-Indian-emigration/dp/B0000CR2EQ
  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
  • ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు, డాక్టర్ ఆర్. అనంత పద్మనాభరావు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2000.