తెన్నేటి పార్క్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెన్నేటి పార్క్
Tenneti park view 001.jpg
తెన్నేటి పార్క్
రకంపట్టణ పార్క్
స్థానంబీచ్ రోడ్
Nearest cityవిశాఖపట్నం, భారతదేశం
అక్షాంశరేఖాంశాలు17°44′53″N 83°21′00″E / 17.747944°N 83.349915°E / 17.747944; 83.349915Coordinates: 17°44′53″N 83°21′00″E / 17.747944°N 83.349915°E / 17.747944; 83.349915
నవీకరణ1991 జనవరి 10; 30 సంవత్సరాల క్రితం (1991-01-10)

తెన్నేటి పార్క్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని జోడుగుళ్ళపాలెం, బీచ్ రోడ్‌లో ఉన్న అర్బన్ పార్క్.[1][2]

చరిత్ర[మార్చు]

రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు తెన్నేటి విశ్వనాధం పేరుమీద ఈ పార్క్ పేరు పెట్టారు. పార్క్ ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఇది నగరంలోని తొలి పిల్లల పార్క్, పురాతన ఉద్యానవనాలలో ఒకటి. నగరంలో పర్యాటకాన్ని పెంచడానికి జివిఎంసి ( గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ )ఈ పార్కులో ఎల్‌ఇడి స్క్రీన్‌లను ఏర్పాటు చేసింది.[3] [4]

ఇతర వివరాలు[మార్చు]

పర్యాటక ప్రయోజనాల కోసం తెనేటి పార్క్ ను ఇటీవల పునరుద్ధరించారు. ఇక్కడినుండి పార్క్ వెనుక ఉన్న కైలాసగిరి కొండలకు కూడా వెళ్ళవచ్చు. పార్క్ లో ఉన్న రైలు ప్రయాణం ద్వారా సమీప కొండ సహజ దృశ్యాలు చూడవచ్చు. వారంలోని అన్ని రోజులలో పార్క్ ఉదయం 6:00 నుండి రాత్రి 9:00 వరకు తెరిచి ఉంటుంది. పార్కులోకి ప్రవేశించడానికి ప్రవేశ రుసుము అవసరం లేదు.

హుధుద్ తుఫాను కారణంగా ధ్వంసమైన ఈ పార్క్ ను పునరుద్ధరించడానికి ఉత్తర అమెరికాకు చెందిన గీతం పూర్వ విద్యార్థులు కలిసి సుమారు 60 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు.[5]

బంగాళాఖాతం తీర సమీపంలో ఈ పార్క్ ఉండడంవల్ల ఇక్కడ వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. వేసవికాలంలో నలభై ఐదు డిగ్రీల కంటే ఎక్కువ, శీతాకాలంలో పద్దెనిమిది నుండి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. వర్షాకాలంలో బీచ్‌లో సగటున తొమ్మిది వందల నలభై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతంతో భారీ వర్షాలు కురుస్తాయి.

మూలాలు[మార్చు]

  1. "Students take swacch bharath to Tenneti park".
  2. "GITAM alumni to give facelift to Tenneti park in Visakhapatnam".
  3. "Cinema by the beach".
  4. "City making 'smart' strides".
  5. "Tenneti Beach Park Vizag". vizagtourism.org.in. Retrieved 2021-07-15.