తెన్నేటి విశ్వనాధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెన్నేటి విశ్వనాధం
తెన్నేటి విశ్వనాధం గారి వర్ణ చిత్రం
జననంతెన్నేటి విశ్వనాధం
1895
విశాఖపట్నం జిల్లా లక్కవరం
మరణం1979, నవంబర్ 10
వృత్తివిశాఖపట్నం కాంగ్రెస్ కమిటికి అధ్యక్షుడు
ప్రసిద్ధిరాజకీయ నాయకుడు,
స్వాతంత్ర్యపోరాట యోధుడు,
మాజీ న్యాయ, దేవాదాయ, రెవెన్యూ శాఖామంత్రి
రాజకీయ పార్టీకాంగ్రేస్ పార్టీ
విశాఖలో తెన్నేటి ఉద్యానవనం వద్ద శ్రీ తెన్నేటి విశ్వనాధం గారి ప్రతిమ

తెన్నేటి విశ్వనాధం (1895-1979) విశాఖపట్నానికి చెందిన రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్యపోరాట యోధుడు, మాజీ న్యాయ, దేవాదాయ, రెవెన్యూ శాఖామంత్రి. విశాఖ ఉక్కు కర్మాగారం నెలకొల్పటములో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తి.[1]

1895లో విశాఖపట్నం జిల్లా లక్కవరంలో జన్మించిన విశ్వనాథం మద్రాసులో బి. ఎ., ఎం. ఎ. పూర్తి చేసి, ట్రివేండ్రంలో లా పట్టా తీసుకుని విశాఖపట్నంలో ప్రేక్టీస్ చేస్తూ 1926 లో విశాఖపట్నం కాంగ్రెస్ కమిటికి అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డారు. మహాత్మా గాంధీచే ప్రభావితుడై స్వాతంత్ర్యోద్యమములో చేరి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నాడు. స్వాతంత్ర్యోద్యమ కాలములో ఐదు సార్లు జైలుకు వెళ్లాడు. 1937లో మద్రాసు శాసనసభకు ఎన్నికైనాడు. స్వరాజ్యం వచ్చిన తర్వాత కాంగ్రేస్ పార్టీని వదలి పెట్టి, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి ప్రజా పార్టీలో చేరేరు. విశ్వనాథం 1951లో మద్రాసు శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా కూడా పనిచేశాడు.

ఇంకా చిన్న వయస్సులో ఉన్న రోజులలోనే వారింట అంతా ఆయనని పెళ్ళి చేసుకోమని బలవంత పెట్టేరుట. ఆయనకి అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదో, లేక చూపించిన పిల్లంటే ఇష్టం లేదో, తెలియదు కాని మొత్తం మీద అప్పట్లో ఆయన పెళ్ళి చేసుకోటానికి ఇష్టపడ లేదుట. ఈ సందర్భంలోనే ఆయన ఇంట్లో ఎవ్వరితోటీ చెప్పకుండా రంగూన్ వెళ్ళిపోయారుట.

విశ్వనాధం గారు మంచి స్పురద్రూపి, వక్త గానే కాకుండా తెలుగు, సంస్కృత భాషలలో మంచి ప్రవేశము ఉన్న వ్యక్తి. విశ్వనాధం గారు విశాఖపట్నం జిల్లా అభివృద్ధికి చెప్పుకోదగ్గ కృషి చేశారు. ఈయన కాఫీ బోర్డు ప్రెసిడెంటుగా ఉన్న రోజులలోనే అరకు లోయలో కాఫీ తోటలు వేయించటం మొదలు పెట్టేరు. ఈ సేవని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం పురజనులు వారి పురపాలక సంఘం భవనానికి “తెన్నేటి భవన్” అనీ, వారి ఊరిలో ఉన్న ఒక పార్కుకి “తెన్నేటి పార్క్” అని పేరు పెట్టుకున్నారు. ఆయన విగ్రహం ఇప్పటికీ జగదాంబా సినిమా హాలు దగ్గర ఉంది.

భారతీయ తపాలా శాఖ తెన్నేటి విశ్వనాథం స్మృత్యర్ధం 2004 నవంబర్ 10వ తేదీన ఐదు రూపాయల తపాళా బిళ్లను పోస్టు మాస్టర్ జనరల్ ఎస్.కె.చక్రబర్తి విడుదల చేశాడు.[2].

మూలాలు

[మార్చు]
  1. తుర్లపాటి, కుటుంబరావు (1989). తెన్నేటి విశ్వనాథం జీవిత చరిత్ర. విశాఖపట్నం: డా. తెన్నేటి విశ్వనాథం స్మారక సంఘం.[permanent dead link]
  2. http://www.thehindubusinessline.com/2004/11/11/stories/2004111103110200.htm