శివాజి పార్కు (విశాఖపట్టణం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివాజి పార్కు
Shivaji Park in Visakhapatnam city.JPG
శివాజి పార్కు ప్రవేశద్వారం
స్థానంశివాజిపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశంభారతదేశం
విస్తీర్ణం16 ఎకరం (6.5 హె.)
నవీకరణ1999 (1999)
నిర్వహిస్తుందిమహా విశాఖ నగరపాలక సంస్థ

శివాజి పార్కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఒక పార్కు. 16 ఎకరాలు (6.5 హెక్టార్లు) విస్తీర్ణంలో తోటలు, పువ్వులు, చెట్లు, పచ్చదనంతో నిండి ఉన్న ఈ పార్కు చుట్టూ ఎంవిపి కాలనీ, శివాజిపాలెం ఉన్నాయి.[1]

చరిత్ర[మార్చు]

డంపింగ్ యార్డ్ కోసం ఉన్న ఈ ప్రాంతంలో 1999లో 8 లక్షల రూపాయలతో ఈ పార్కు నిర్మించారు.[2] ఇందులో ఆర్కిడ్ తోటలు, స్లైడ్‌లు, ఫౌంటైన్లు, స్పోర్ట్ రింగ్, పిల్లల ఆటస్థలం, మనోహరమైన ఉద్యానవనాలు, ఫుడ్ కోర్ట్ వంటివి ఉన్నాయి. ఫౌంటెన్ ప్రదేశంలో, 3 ఫౌంటెన్ హబ్‌లు డ్యాన్స్ ఉన్నాయి. ఈ మూడు భారీ ఫౌంటైన్లు రాత్రిపూట లైట్లతో మరింత అందంగా కనిపిస్తాయి.

ఇతర వివరాలు[మార్చు]

విశాఖపట్నంలోని అత్యంత పేరొందిన వాటిల్లో ఇదీ ఒకటి. ఈ ఉద్యానవనంలో "పెరిగిన పొదలు, విరిగిన బెంచీలు" ఉన్నాయని ది హిందూ పత్రిక రాసింది.[3]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Walkers object to felling of trees". The Hindu. 14 November 2010. Retrieved 6 May 2021.
  2. RaviI. P. Benjamin (21 March 2013). "A posh township with many residential colonies". The Hindu. Retrieved 6 May 2021.
  3. "Sivaji Park turns into a garbage dump". The Hindu. 14 March 2012. Retrieved 6 May 2021.