పూడిపెద్ది వెంకటరమణయ్య
స్వరూపం
పూడిపెద్ది వెంకటరమణయ్య | |
---|---|
జననం | 1893 |
మరణం | 1937 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత |
గుర్తించదగిన సేవలు | పూలమాల, పూడిపెద్ది వారి కథలు |
తల్లిదండ్రులు | బుచ్చయ్య, సూరమ్మ |
పూడిపెద్ది వెంకటరమణయ్య తొలితరం కథారచయిత. ఇతడు 1893లో విశాఖపట్నంలో బుచ్చయ్య, సూరమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం విశాఖపట్నంలోనే జరిగింది. ఇతడు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు.[1] ఇతడు ఎక్కువ కాలం శ్రీకాకళం జిల్లా రాజాంలో నివసించి 1937లో అక్కడే మరణించాడు. ఇతడు విశాఖపట్నంలోని కవితా సమితిలో ముఖ్యమైన సభ్యుడు. ఇతడు సుమారు 300 కథలను రచించాడు. కేవలం కథలను ప్రచురించడానికి ఇతడు పూలగుత్తి అనే పత్రికను నడిపాడు.[2] ఇతని కథలు, పద్యాలు, గేయాలు, వ్యాసాలు పూలగుత్తితో పాటు భారతి, ఆంధ్రపత్రిక, ప్రబుద్ధాంధ్ర, ఆనందవాణి, వినోదిని, గృహలక్ష్మి, విజయ, పుస్తకం, జయలక్ష్మి మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
రచనలు
[మార్చు]- పూలమాల
- ముత్యాలు
- సుందరరామచరిత్రము
- పూడిపెద్ది వారి కథలు
కథల జాబితా
[మార్చు]కథానిలయంలో లభ్యమౌతున్న పూడిపెద్ది వెంకటరమణయ్య కథల జాబితా[3]:
- అంతేచాలు
- అక్కమ్మ అక్కసు
- అతడి ధోరణి
- అనాగతం
- అన్నవాకుపిట్ట
- అమ్మమ్మతల్లి
- అరణ్యరోదనం
- అలుక
- అసౌభాగ్యం చీర నేసిన శిల్పిది
- ఆరూఢ పతితుడు
- ఇద్దరు పెళ్లాల ముద్దుల మగడు
- ఉగాది బాలు
- ఉగ్గుగిన్నె
- ఉరుమని పిడుగు
- ఎవరికెవరూ?
- ఏమిటనడం
- కడవెలుగు
- కథలు
- కనబడదూ ఆ నీటి చుక్క
- కల నిజమవుతుందా
- కుబేరపుష్పకం
- కృష్ణదైవం
- క్షవర కల్యాణం
- గోరచిలుక
- చంద్రంపేట
- జాగ్రత జాగ్రత
- టాయిలెట్
- తట్ట తప్పు
- తలతక్కువా తమాసెక్కువా
- తిరిగిచూస్తే తిరుమణి తోడు
- తుపానులో తృణం
- తెర
- దాసరి పదం
- ధాంక్యూ
- నను మరువకు
- నాయనగారు
- నీబిచ్చానికో దండం...
- నూత్న దాంపత్యం
- నెల్లిపాప
- పట్టెడన్నం
- పతివ్రతామహాత్మ్యం
- పాకానబడ్డ భావగీతి
- పేరంటం
- ప్రేమసూత్రం
- బహిరంగము
- బహుమానము
- బాల
- బొట్టుపెట్టి
- బొల్లిమాట మాత్రం నిజం
- భరత వాక్యం
- భాగస్వాములు
- మా చిన్నపిల్ల
- మామేనబావ
- మాయబజారు
- మూగకత
- మూగకతలు
- మూడు ముక్కలు
- రుమాలు
- రెండూ రెండూ నాలుగు
- వలపుతో ఆటకాదు
- విడవనంటాడు పూర్తిగా పోతేగాని
- శుకాలాపము
- శృంగారం
- శ్రీరాములు
- సంసారి ముదిరి సన్యాసి
- సున్నితాల సుందరి
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Venkataramanayya Pudipeddi (1893-1937)" (PDF). వేపచేదు. వేపచేదు విద్యాపీఠం. Retrieved 2 December 2023.
- ↑ దామర వేంకట సూర్యారావు (1 August 1999). "విశాఖ జిల్లా తెలుగు కథా చరిత్ర" (PDF). మిసిమి. 30 (8): 15–26. Retrieved 2 December 2023.
- ↑ కాళీపట్నం రామారావు. "రచయిత: పూడిపెద్ది వెంకటరమణయ్య". కథానిలయం. కథానిలయం. Retrieved 2 December 2023.