ఎర్రమట్టి దిబ్బలు
ఎర్రమట్టి దిబ్బలు, విశాఖపట్నం, భీముని పట్నం మధ్యలో ఉన్న ఒక పర్యాటక ప్రాంతం.[1] ఇవి 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ఇవి కూడా ఒకటి. ఇక్కడ కాకుండా దక్షిణాసియాలో మరో రెండు చోట్ల మాత్రమే ఇలాంటి దిబ్బలున్నాయి. రెండవది తమిళనాడులోని పేరి వద్ద ఉన్నా అవి జనావాసానికి దూరంగా ఉండడం వల్ల అందుబాటులో లేక అంతగా ఆదరణకు నోచుకోవడం లేదు. మూడోది శ్రీలంకలో ఉన్నాయి.[2] ఇక్కడ సినిమాలు చిత్రీకరిస్తుంటారు.
ఇవి విశాఖపట్నం నుంచి భీమిలి వెళ్ళే ప్రధాన మార్గంలో విశాఖకు 20 కిలోమీటర్ల దూరంలో సముద్రానికి ఆనుకునే ఉన్నాయి. రోడ్డుకు అటు సముద్రం, ఇటు ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి. చిన్న చిన్న మట్టి కొండల్లాంటి దిబ్బల మధ్య జీడిమామిడి, సరుగుడు, ఇతర చెట్లు ఉంటాయి.
రవాణా సౌకర్యాలు
[మార్చు]విశాఖ నుంచి బస్సు, కారు, జీపు, ఆటో వంటి సదుపాయాలున్నాయి. విశాఖ నుంచి భీమిలి (బీచ్‌రోడ్డులో) వెళ్లే ఆర్టీసీ బస్సులు (ద్వారకా బస్ స్టేషన్ నుంచి) ప్రతి 15 నిమిషాలకు అందుబాటులో ఉంటాయి. ఉదయం 5.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకూ 900కె, 900టి నంబర్ల బస్సులు వెళ్తాయి. రైళ్లలో వచ్చే వారు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వస్తే అక్కడ నుంచి బస్సుల్లో వెళ్లవచ్చు.
ఇక్కడ ప్రవేశం ఉచితం. ఎంతమందినైనా అనుమతిస్తారు. నిత్యం వందల్లో, దసరా, కార్తీకమాసం పిక్నిక్, వేసవి సీజన్లలో వేలాది మంది సందర్శిస్తుంటారు. వీరిలో ఇతర రాష్ట్రాల వారితో పాటు విదేశీయులూ ఉంటారు.
సమీప ప్రదేశాలు
[మార్చు]ఇక్కడికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమిలి కూడా పర్యాటక స్థలమే. ఇక్కడికి సమీపంలోనే బౌద్ధ కట్టడాలున్న పావురాలకొండ, తొట్లకొండ, బావికొండలతో పాటు మంగమారిపేట వద్ద బ్యాక్‌వాటర్స్‌ను కూడా తిలకించవచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ విలేకరి. "ఉనికి కోల్పోతున్న ఎర్రమట్టి దిబ్బలు". andhrajyothy.com. వేమూరి రాధాకృష్ణ. Retrieved 14 October 2016.[permanent dead link]
- ↑ బొల్లం, కోటేశ్వర రావు. "ఎర్రదిబ్బలో ఎన్నియలో..." sakshi.com. జగతి ప్రచురణలు. Retrieved 14 October 2016.