Jump to content

విల్లూరి వెంకట రమణ

వికీపీడియా నుండి

విల్లూరి వెంకట రమణ ( 1923 మే 15 - 1978) ఒక భారతీయ రాజకీయ నాయకుడు.అతను అనకాపల్లిలోని గవరపాలెంలో జన్మించాడు అతను భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా భారతదేశ పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు సభ్యుడు.

విల్లూరి వెంకట రమణ
పదవీ కాలం
1953-59
పదవీ కాలం
1959-62

వ్యక్తిగత వివరాలు

జననం 15 మే 1923
గవరపాలెం(అనకాపల్లి),అనకాపల్లి జిల్లా(అంతకుముందు విశాఖపట్నం జిల్లా)
మరణం 1978(aged 54-55)
రాజకీయ పార్టీ
మతం హిందూమతం

రాజకీయ ప్రయాణం:

[మార్చు]

అతను రాజ్యసభకు ఎన్నికైన అతి పిన్న వయస్కుడు, సర్వేపల్లిరాధాకృష్ణన్, జవహర్‌లాల్ నెహ్రూ, బాబు జగ్జీవన్‌రామ్, లాల్‌బహదూర్ శాస్త్రి వంటి ప్రముఖుల వద్ద పనిచేశాడు.అతను 1953-62లో అనకాపల్లి రాజ్యసభ సభ్యునిగా పనిచేశాడు.అతను కృషికార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీలో పనిచేశాడు.అతను ఆచార్యఎన్.జి.రంగా, గౌతు లచ్చన్నలకు ప్రియమైన శిష్యుడు.[1] అతను క్యాన్సర్‌తో మరణించాడు.

అసెంబ్లీ కి పోటీ[2] :

[మార్చు]
సంవత్సరం అభ్యర్థి పేరు ఓట్లు పార్టీ పేరు %
1952 కొడుగంటి గోవిందరావు 18,505 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 41.42%
విల్లూరి వెంకట రమణ 11,866 కృషికర్ లోక్ పార్టీ 26.61%
బొడ్డేడ అచ్చన్నాయుడు 9,797 భారత జాతీయ కాంగ్రెస్ 21.93%

పార్లమెంట్ కి పోటీ[3] :

[మార్చు]
సంవత్సరం అభ్యర్థి పేరు పార్టీ పేరు ఫలితం ఓట్లు ఓట్ల వాటా
1962 మిస్సుల సూర్యనారాయణ మూర్తి భారత జాతీయ కాంగ్రెస్ విజేత 96895 38%
విల్లూరి వెంకట రమణ స్వతంత్ర పార్టీ ద్వితియ విజేత 80885 32%
1967 మిస్సుల సూర్యనారాయణ మూర్తి భారత జాతీయ కాంగ్రెస్ విజేత 165121 45%
విల్లూరి వెంకట రమణ స్వతంత్ర పార్టీ ద్వితియ విజేత 162097 44%
1971 ఎస్.ఆర్.ఎ.ఎస్అప్పల నాయుడు భారత జాతీయ కాంగ్రెస్ విజేత 215209 69%
విల్లూరి వెంకట రమణ స్వతంత్ర పార్టీ ద్వితియ విజేత 69115 22%

రైతులకు నాయకుడు:

[మార్చు]
  • 1932లో అనకాపల్లి చక్కెర కర్మాగారాన్ని ప్రయివేటు వ్యక్తులు నడుపుతున్నారు. రైతుల సంక్షేమం కోసం విల్లూరి వెంకట రమణ ఎంతో కృషి చేసి సహకార సంఘంగా తీర్చిదిద్దారు.
  • తుమ్మపాలలో రామకృష్ణ కో-ఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సొసైటీ పేరుతో దాదాపు 6 సంవత్సరాలు నడిచింది. తర్వాత 1939లో ఈ సొసైటీని ఇతర రాష్ట్ర వ్యక్తులు శాంతి లాల్, కుంతి లాల్ కొనుగోలు చేశారు. వైజాగ్ సూపర్ రిఫైనరీస్ పేరుతో కొన్నేళ్లు నడిపారు. .తర్వాత యజమానులు గోదావరి జిల్లాలకు మార్చాలనుకున్నారు.బెల్లం ధరలు తగ్గితే రైతులకు ఈ ఫ్యాక్టరీ మాత్రమే ఉండేది.అందుకే విల్లూరి వెంకట రమణ సమావేశాలు నిర్వహించి రైతుల సంక్షేమం కోసం డబ్బులు వసూలు చేసి ఫ్యాక్టరీని కొనుగోలు చేశారు.కర్మాగారం నుంచి రైతులను వాటాలు తీసుకునేలా చేశాడు.రైతులు, వివి రమణ సహాయంతో 1959లో అనకాపల్లి కో-ఆపరేటివ్ షుగర్స్ ఏర్పడ్డాయి.గౌరీ శ్రేయస్సు సంఘం పేరుతో రైతులకు సేవ చేశాడు.
  • వై.యస్. రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్న సమయంలో రైతులకు ఆయన చేసిన సేవలకు గాను 44 ఏళ్ల తర్వాత వివి రమణ కో-ఆపరేటివ్ షుగర్స్‌[4]గా పేరు మార్చారు.

మూలాలు:

[మార్చు]
  1. "జనం గుండెల్లో కొలువై..." EENADU. Retrieved 2023-08-03.
  2. "Wayback Machine" (PDF). web.archive.org. Archived from the original on 2013-01-27. Retrieved 2023-08-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Anakapalli (Andhra Pradesh) Lok Sabha Election Results - Anakapalli Parliamentary Constituency, Winning MP and Party Name". www.elections.in. Retrieved 2023-08-07.
  4. ABN (2023-02-19). "ఫ్యాక్టరీ పాయె!". Andhrajyothy Telugu News. Retrieved 2023-07-02.