Jump to content

మిస్సుల సూర్యనారాయణమూర్తి

వికీపీడియా నుండి
ఎం.ఎస్.మూర్తి
మిస్సుల సూర్యనారాయణమూర్తి


పార్లమెంటు (లోక్‌సభ ఎం.పి.)
పదవీ కాలం
13 సంవత్సరాలు
నియోజకవర్గం అనకాపల్లి

వ్యక్తిగత వివరాలు

జననం 4 ఫిబ్రవరి 1911
కొండకర్ల, విశాఖపట్నం జిల్లా
మరణం ఆగస్టు 1973
కె.జి.హెచ్, విశాఖపట్నం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి సుభద్ర అన్నపూర్ణాదేవి
సంతానం 6; 4 కుమారులు (మల్లిఖార్జునరావు, వెంకటమోహనరావు, భవానీశంకర నెహ్రూ, సూర్యనారాయణ), 2 కుమార్తెలు
నివాసం బ్రాహ్మణవీధి, కొండకర్ల గ్రామం, అత్యుతాపురం మండలం, విశాఖపట్నం జిల్లా
మతం హిందూ

మిస్సుల సూర్యనారాయణమూర్తి (జననం 1911) బి.యస్సీ భారతదేశ రాజకీయవేత్త, పార్లమెంటు సభ్యులు.

జీవితం

[మార్చు]

ఆయన కొండకర్ల లోని బ్రాహ్మణ కుటుంబంలో శ్రీ వెంకన్నకు జన్మించారు. ఆయన ఎం.ఎస్.అన్నపూర్ణాదేవిని మే 29, 1929 న వివాహమాడారు. ఆయనకు ఆరుగురు పిల్లలు. వారిలో నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.

కెరీర్

[మార్చు]

మూర్తి రసాయనశాస్త్రంలో బి.యస్సీ చదివారు. ఆయన అనకాపల్లికి దగ్గరలో గల సుగర్ ప్లాంట్ లో పనిచేసేవారు. ఆ కాలంలో సుగర్ టెక్నాలజీలో కార్బన్ క్రియాశీలకతపై పరిశోధనలు చేసారు.

ఆయన 1945లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా వ్యవహరించారు. ఆయన 1942 నుండి 1946 వరకు, 1953 నుండి 1957 వరకు విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ కమిటీకి రెండు పర్యాయాలు అధ్యక్షునిగా ఉన్నారు.

ఆయన 1957 లో గోలుగొండ లోక్‌సభ నుండి 2వ లోక్‌సభ సభ్యునిగానూ, అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 3వ, 4వ పార్లమెంతు సభ్యునిగా వరుసగా 1962, 1967 లలో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.

ఆశ్చర్యకరంగా ఆయన వరుసగా లోక్‌సభ సభ సభ్యునిగా ఎన్నికైనప్పటికీ, ఆయన చిన్న గుడెసెలో తన జివిత చరమాంకం వరకు నివసించారు. ఆయన తనకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తులను ప్రజా సేవకోసం అమ్మివేసారు.

రాజకీయాలకు రాకముందు, ఆయన అత్యుతాపురం మండలంలోని కొండకర్ల గ్రామ అధ్యక్షునిగా ఉండేవారు.

హరిజనుల అభివృద్ధి కోసం అభివృద్ధి సూత్రాలను ప్రతిపాదించారు. పేద పిల్లల విద్యాభివృద్ధికోసం కొండకర్ల లో కోఆపరేటివ్ సొసైటీని స్థాపించారు.

ఆయన జీవితం మొత్తం ఖాదీ దుస్తునను ధరించారు.

ఇతర లింకులు

[మార్చు]