బుద్ధ మహాలక్ష్మి నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుద్ధ మహాలక్ష్మి నాయుడు
జననం30 August 1879
మరణం17 June,1944
సమాధి స్థలంబంగ్లా జంక్షన్
బిరుదురావు-సాహెబ్
పురస్కారాలుH.M కింగ్ జార్జ్ 1935 రజతోత్సవ పతకం

రావు-సాహెబ్ బుద్ధ మహాలక్ష్మి నాయుడు,అనకాపల్లికి చెందిన మున్సిఫ్, ఇనామ్దార్.ప్రజలకు అతను చేసిన సేవలకుగాను బ్రిటిష్ వారి నుండి రావు-సాహెబ్ బిరుదును[ఆధారం చూపాలి] అందుకున్నాడు.

జననం[మార్చు]

బుద్ధ మహాలక్ష్మి నాయుడు 1879 ఆగస్టు 30న అనకాపల్లిలోని గవరపాలెంలో జన్మించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

బుద్ధ మహాలక్ష్మి నాయుడు, అనకాపల్లికి చెందిన పెద్ద భూస్వామి. 1922 మార్చి 1న విశాఖపట్నం బోర్డు సభ్యునిగా ఎన్నికయ్యాడు. అధ్యక్షులుగా వెంకటపతి రాజు పూసపాటి, ఉపాధ్యక్షులు సీతారామరాజు.బి, ఇద్దరూ 1922 మార్చి 28 న ఎన్నికయ్యారు. అతను 1921 మే 27న అనకాపల్లి మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు.[1] 1927-1931,1931-1933,1941-42 పలుపర్యాయాలు అనకాపల్లి మున్సిపల్ కౌన్సిల్ చైర్మనుగా పనిచేసాడు.[2]

మూలాలు :[మార్చు]

  1. Government_press_madras (1923). The Madras Year Book 1923. pp. 670–671.
  2. Fort St. George, 1941-05-27. Madras Presidency. 1941-05-27. p. 386.