కళ్లకురిచి
కళ్లకురిచి | |
---|---|
Nickname: చెరకు పట్టణం | |
Coordinates: 11°44′17″N 78°57′43″E / 11.738°N 78.962°E | |
దేశం | భారతదేశం |
Named for | చెరకు నగరం, వ్యవసాయం |
జనాభా (2015) | |
• Total | 57,628 |
భాషలు | |
• ప్రాంతం | తమిళం |
Time zone | UTC+05:30 (IST) |
పిన్‌కోడ్ | 606 202 |
Telephone code | 0-4151 |
Vehicle registration | TN-15 |
కళ్లకురిచి, తమిళనాడు రాష్ట్రం, కళ్లకురిచి జిల్లా లోని పట్టణం.ఇది ఒక జిల్లా కేంద్రం.[1] కళ్లకురిచి పూర్వం విలుప్పురం జిల్లాలో భాగంగా ఉండేది. విలుప్పరం జిల్లాను విభజించుటద్వారా, కళ్లకురిచి జిల్లా 2019 నవంబరు 26న ఏర్పడింది. దానిలో భాగంగా కల్లకురిచి పట్టణం ఇది అధికారికంగా జిల్లా కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలో వరి, మొక్కజొన్న, చెరకు, నల్లరేగడి తదితర ప్రధాన పంటలు సాగుచేస్తారు. ప్రధానంగా గోముఖి, మణిముక్త నదుల ఆనకట్టలతో పాటు, వర్షాధారం, ఇతర చెరువులు ద్వారా నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయి.[2]
వాతావరణం
[మార్చు]వాతావరణం వేడిగా ఉంటుంది, గరిష్ట ఉష్ణోగ్రత 38° సెంటీగ్రేడ్ వద్ద, కనిష్ట 21 సెంటీగ్రేడ్ వద్ద ఉంటుంది. శీతాకాలంలో ఈశాన్య ఋతుపవనాల నుండి, వేసవి నెలల్లో నైరుతి ఋతుపవనాల నుండి ఈ పట్టణంలో వర్షపాతం కురుస్తుంది. సగటు వార్షిక వర్షపాతం 1,070 మి.మీ. [3]
ఆర్థికం
[మార్చు]కల్లకురిచికి 2020లో తమిళనాడు హస్తకళా అభివృద్ధి సంస్థ లిమిటెడ్, “పూంపుహార్” (తమిళనాడు ప్రభుత్వం అండర్‌టేకింగ్) ద్వారా “వుడ్ కార్వింగ్స్”, “గంధపు చెక్కల” కోసం జిఐ ట్యాగ్ పొందింది. [4]
జనాభా
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం, కల్లకూరిచి జనాభా 52,508, ప్రతి 1,000 మంది పురుషులకు 984 మంది స్త్రీలు, ఇది జాతీయ సగటు 929 కన్నా ఎక్కువ. [5] మొత్తం జనాభాలో 5,541 మంది ఆరేళ్ల లోపు వారు ఉన్నారు.
వారిలో 2,914 మంది పురుషులు, 2,627 మంది మహిళలు ఉన్నారు. వెనకబడిన కులాలు జనాభా 15.49% మంది, వెనకబడిన తెగలు జనాభా 27% మంది ఉన్నారు. పట్టణం సగటు అక్షరాస్యత 77.08%,ఇది జాతీయ సగటు 72.99% తో పోలిస్తే తక్కువ.
కల్లకురిచి పట్టణంలో మొత్తం 12801 గృహాలు ఉన్నాయి. మొత్తం 19,013 మంది కార్మికులు, 471 మంది సాగుదారులు, 840 మంది ప్రధాన వ్యవసాయ కూలీలు, 537 గృహనిర్మాణ పరిశ్రమలు , 14,673 మంది ఇతర కార్మికులు, గృహ పరిశ్రమలలో కార్మికులు 1,943 మంది ఇతర కార్మికులు ఉన్నారు.[6]
2011 మత జనాభా లెక్కల ప్రకారం, కల్లకురిచిలో 83.87% హిందువులు, 13.4% ముస్లింలు, 1.72% క్రైస్తవులు, 0.04% సిక్కులు, 0.02% బౌద్ధులు, 0.17% జైనులు, 0.71% ఇతర మతాలను అనుసరిస్తున్నారు. [7]
పట్టణ ప్రముఖులు
[మార్చు]- ఉదయ్‌కుమార్ ధర్మలింగం, ఇతను భారతీయ విద్యావేత్త, రూపాయి చిహ్నం రూపకల్పనకు ప్రసిద్ధి చెందిన రూపకర్త డి. ఉదయ్‌కుమార్ ఈ పట్టణంలో జన్మించాడు[8]
మూలాలు
[మార్చు]- ↑ "About city". Kallakurichi municipality. 2015. Archived from the original on 2018-01-22. Retrieved 2013-08-08.
- ↑ "History | Kallakurichi District, Govt. of Tamil Nadu, | India". Retrieved 2021-02-27.
- ↑ "About city". Kallakurichi municipality. 2011. Archived from the original on 1 September 2013. Retrieved 2013-08-08.
- ↑ "Tamil Nadu Handicraft Development Corporation Ltd.,". Poompuhar.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
- ↑ "Census Info 2011 Final population totals - Kallakkurichi". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
- ↑ "Population By Religious Community - Tamil Nadu" (XLS). Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2011. Retrieved 13 September 2015.
- ↑ "Rupee gets a new symbol". Retrieved 19 November 2011.