Jump to content

రామనాథపురం (తమిళనాడు)

అక్షాంశ రేఖాంశాలు: 9°21′50″N 78°50′22″E / 9.363900°N 78.839500°E / 9.363900; 78.839500
వికీపీడియా నుండి
Ramanathapuram
Muguvai
Ramnad (shortened)
Town
రామనాథపురం ప్యాలెస్
రామనాథపురం ప్యాలెస్
Ramanathapuram is located in Tamil Nadu
Ramanathapuram
Ramanathapuram
Ramanathapuram, Tamil Nadu
Coordinates: 9°21′50″N 78°50′22″E / 9.363900°N 78.839500°E / 9.363900; 78.839500
Country India
StateTamil Nadu
DistrictRamanathapuram
Government
 • TypeSpecial Grade Municipality
 • BodyRamanathapuram Municipality
Elevation
35 మీ (115 అ.)
జనాభా
 (2011)
 • Total61,440
 • Rank2nd in Ramanathapuram District(as of 2011 Census)
Languages
 • OfficialTamil
Time zoneUTC+5:30 (IST)
Telephone code04567
Vehicle registrationTN-65
Websitehttp://ramanathapuram.nic.in

రామనాథపురం, దీనిని రామ్ నాడ్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, రామనాథపురం జిల్లాలో పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం. రామనాథపురం జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. రామనాథపురం జిల్లాలో జనాభా ప్రకారం రెండవ అతిపెద్ద పట్టణం.

చరిత్ర

[మార్చు]

ఈ ప్రాంతం పురాణ యుగాల నుండి ప్రసిద్ధి చెందింది. రామనాడ్ హిందూ పవిత్ర ద్వీపం రామేశ్వరం ఇక్కడే ఉంది. ఇక్కడ నుండి హిందూ దైవం రాముడు, రావణుడి లంకపై దండయాత్ర ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి.

జనాభా శాస్త్రం

[మార్చు]
మతాల ప్రకారం జనాభా
మతం శాతం (%)
హిందూ
  
76.39%
Muslim
  
19.77%
క్రిష్టియన్లు
  
3.08%
సిక్కులు
  
0.01%
ఇతర మతాలు వారు
  
0.79%
మతం చెప్పనివారు
  
0.01%

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, రామనాథపురంలో మొత్తం 61,440 జనాభా ఉన్నారు. ప్రతి 1,000 మంది పురుషులకు 988 స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. ఇది జాతీయ సగటు 929 కంటే చాలా ఎక్కువ [1] మొత్తం జనాభాలో 6,370 మంది ఆరేళ్ల లోపు వారు ఉన్నారు. వారిలో 3,245 మంది పురుషులు, 3,125 మంది మహిళలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత 83.42% గా ఉంది. జాతీయ సగటు అక్షరాస్యత 72.99% కంటే ఎక్కువ ఉంది.[1] పట్టణంలో మొత్తం 14716 గృహాలు ఉన్నాయి. మొత్తం జనాభాలో 20,375 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 115 మంది రైతులు,178 మంది ప్రధాన వ్యవసాయ కార్మికులు, 262 మంది గృహపరిశ్రమలపై ఆధారపడినవారు, 18,773 ఇతర కార్మికులు, 1,047 సన్నకారు కార్మికులు, 20 సన్నకారు రైతులు, 30 మంది ఉపాంత వ్యవసాయ కార్మికులు, 41 మంది ఇతర ఉపాంత కార్మికులు ఉన్నారు [2]

2011 మతాల గణన ప్రకారం, రామనాథపురంలో 76.39% హిందువులు,19.77% ముస్లింలు, 3.08% క్రైస్తవులు, 0.01% సిక్కులు, 0.7% ఇతర మతాలను అనుసరిస్తున్నారు. 0.01% ఏ మతాన్ని అనుసరిస్తుంది లేదా మతపరమైన ప్రాధాన్యతను సూచించనివారు ఉన్నారు. [3]

పౌర పరిపాలన

[మార్చు]

రామనాథపురం పురపాలిక హోదా పట్టణం. జిల్లా కేంద్ర కార్యాలయాలను మధురై నుంచి రామనాథపురానికి మారిన తర్వాత పట్టణం అభివృద్ధి చెందింది. మదురై నుండి రామేశ్వరం, తిరుచ్చి నుండి రామేశ్వరం వరకు రైల్వే గేజ్ మార్పిడి ద్వారా, పట్టణం అన్ని ప్రధాన భారతీయ నగరాలను కలుపుతుంది. రామనాథపురం జిల్లా తమిళనాడులో ఒక పెద్ద జిల్లా. తరువాత శివగంగ జిల్లాను ఏర్పాటు చేయడానికి దానిలోని కొన్ని ప్రాతాలను విడదీసారు. వైగై నది ద్వారా నీరు, పెరియ కన్మాయి అనే పెద్ద ట్యాంక్ లోకి ప్రవేశిస్తుంది. దాని ద్వారా వ్యవసాయం కోసం నీరు సేకరించబడుతుంది. పరీవాహక ప్రాంత పరిమాణాన్ని చిత్రీకరిస్తూ నది నీరు సముద్రంలోకి చేరదని పేర్కొన్నారు. పట్టణంలో ప్రజల అవసరాలను తీర్చే అనేక చెరువులు ఉన్నాయి.

విద్యా సంస్థలు

[మార్చు]

అన్నా యూనివర్శిటి, యుసిఈఆర్-రామ్ నాడ్ క్యాంపస్, సయ్యద్ అమ్మాల్ ఇంజినీరింగ్ కళాశాల, మొహమ్మద్ సథక్ ఇంజినీరింగ్ కళాశాల వంటి ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం రామనాథపురంలోని స్క్వార్ట్జ్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో చదివాడు.

ప్రభుత్వం

[మార్చు]

ఇది రామనాథపురం పట్టణం, రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఒక భాగం.

భౌగోళిక శాస్త్రం

[మార్చు]

రామనాథపురం సముద్రమట్టానికి 2 మీటర్లు (6 అడుగులు) సగటు ఎత్తుతో 9°23′N 78°50′E / 9.38°N 78.83°E / 9.38; 78.83 వద్ద ఉంది.[4] దీనికి సమీపంలో పరమకుడి, రామేశ్వరం, ముదుకులత్తూరు, కిలకరై, మనమదురై పట్టణాలు ఉన్నాయి .

రవాణా

[మార్చు]

ఈ పట్టణం ఆగ్నేయ తమిళనాడు ప్రాతంలో ఉంది. రామేశ్వరం నుండి మధురైకి ఎన్ఎచ్ 49 ద్వారా అనుసంధానం ఉంది. ఈస్ట్ కోస్ట్ రోడ్ తూర్పు తమిళనాడులోని ప్రధాన తీర రహదారి. ఇది రాష్ట్ర రాజధాని చెన్నై, రామనాథపురంలను, అలాగే, రామనాథపురం పాండిచ్చేరి, టుటికోరిన్, కన్యాకుమారితో కలుపుతుంది. ఈ పట్టణం మదురై జంక్షన్ ద్వారా భారతదేశంలోని ప్రధాన నగరాలకు రైలుమార్గం ద్వారా బాగా అనుసంధానం కలిగి ఉంది.సమీప విమానాశ్రయం మధురై విమానాశ్రయం సమారు 125 కి.మీ. దూరంలో ఉంది.

పర్యాటకం

[మార్చు]
ముగవై ఆలయం, దక్షిణ భారతదేశం (1858) [5]
  • యాత్రికులు ఎక్కువుగా రామనాడ్ ను, రాజా ప్యాలెస్ ని సందర్శిస్తారు. [6]
  • ఏర్వాడిలో ప్రతి సంవత్సరం జరిగే సంతానకూడు ఉత్సవం సందర్భంగా రాజ కుటుంబం సంతానకూడు ఊరేగింపు కోసం ఏనుగును పంపుతుంది.
  • రామనాథపురం పట్టణానికి రామేశ్వరం, దేవిపట్టినం, తిరుప్పుల్లని, ఉతిరకోసమంగైకి సమీపంలో ఉన్నాయి. ఇవి చాలా ముఖ్యమైన పురాతన పుణ్యక్షేత్రాలు.
  • ఉచిపులి, అరియమాన్ సముద్రతీరం సమీపంలో ఉన్న భారతీయ నావికాదళ ఎయిర్ స్టేషన్, ఉచిపులిలోని ప్రసిద్ధ సముద్రతీరాలలో ఒకటి.
  • పెరియపట్టినం, అతియుతు, పనైకులం, అలగంకులం, పుదువలసై, చిత్తర్‌కోట్టై సముద్రతీర ప్రాంతాలు రామనాడ్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  2. "Census Info 2011 Final population totals - Ramanathapuram". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  3. "Population By Religious Community - Tamil Nadu" (XLS). Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2011. Retrieved 13 September 2015.
  4. Falling Rain Genomics, Inc - Ramanathapuram
  5. (August 1858). "The temple of Ramnad, South India".
  6. "Ramanathapuram palace - near Rameshwaram". 16 April 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]