Jump to content

పుదుక్కొట్టై జిల్లా

వికీపీడియా నుండి
Pudukkottai District
புதுக்கோட்டை மாவட்டம்
Pudhugai Mavattam
District
Paddy fields, Regunathapuram
Location in Tamil Nadu, India
Location in Tamil Nadu, India
Country India
రాష్ట్రంతమిళనాడు
జిల్లాPudukkottai
Pudukkottai14th January 1974
ప్రధాన కార్యాలయంPudukkottai
BoroughsPudukkottai, Karambakkudi, Alangudi, Aranthangi, Thirumayam, Ponnamaravathi, Gandarvakottai, Avudaiyarkoil, Manamelkudi, Kulathur, Iluppur.
Government
 • Collector & District MagistrateManoharan IAS
విస్తీర్ణం
 • Total4,663 కి.మీ2 (1,800 చ. మై)
జనాభా
 (2011)
 • Total16,18,725
 • జనసాంద్రత350/కి.మీ2 (900/చ. మై.)
భాషలు
 • అధికారTamil,ఆంగ్లం
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
622xxx
టెలిఫోన్ కోడ్04322
ISO 3166 code[[ISO 3166-2:IN|]]
Vehicle registrationTN-55
Coastline42 కిలోమీటర్లు (26 మై.)
Largest cityPudukkottai
Nearest cityTiruchirapalli, Thanjavur
లింగ నిష్పత్తిM-50%/F-50% /
అక్షరాస్యత80%%
Legislature typeelected
Lok Sabha constituency0
Precipitation827 మిల్లీమీటర్లు (32.6 అం.)
Avg. summer temperature40.9 °C (105.6 °F)
Avg. winter temperature17.8 °C (64.0 °F)

పుదుక్కోట్టై జిల్లా, దక్షిణ భారతదేశం, తమిళనాడు రాష్ట్రంలోని జిల్లాలలో ఇది ఒకటి. పుదుక్కోట్టై నగరం జిల్లాకేంద్రంగా ఉంది. దీనిని వ్యవహారికంలో పుధుగై అని కూడా అంటారు. పుదుక్కోట్టై జిల్లా ఈశాన్య, తూర్పున తంజావూరు జిల్లా, ఆగ్నేయంలో పాక్ జలసంధి, నైరుతి సరిహద్దులో రామనాథపురం, శివగంగ జిల్లాలు, పశ్చిమ, వాయువ్య సరిహద్దులలో తిరుచిరాపల్లి జిల్లా ఉన్నాయి. 2011 నాటికి, జిల్లాలో ప్రతి 1,000 మంది పురుషులకు 1,015 స్త్రీల లింగ నిష్పత్తితో 1,618,345 జనాభా ఉంది. జిల్లా వైశాల్యం 4,663 కిమీ²తో పాటు 42 కిమీ తీరప్రాంతాన్ని కలిగి ఉంది. జిల్లా 78° 25' 79° 15' తూర్పు రేఖాంశం మధ్య, ఉత్తర అక్షాంశంలో 9° 50', 10° 40' మధ్య ఉంది.

విభాగాలు

[మార్చు]

1975 జనవరి 14న, తంజావూరు జిల్లా నుండి కొన్ని చేర్పులతో తిరుచిరాపల్లి జిల్లాలోని పూర్వపు పుదుక్కోట్టై డివిజను కలిపి ఒక ప్రత్యేక జిల్లాగా పుదుక్కోట్టై జిల్లా ఏర్పడింది.2022 నాటికి ఈ జిల్లాలో పుదుక్కోట్టై, అరంతంగి, ఇల్లూపూర్ అనే మూడు రెవెన్యూ డివిజన్లు, పదకొండు తాలూకాలు, 762 రెవెన్యూ గ్రామాలు కలిగిఉన్నాయి.

తాలూకాలు

[మార్చు]

కులత్తూరు, ఇలుప్పూర్, అలంగుడి, పుదుక్కోట్టై, గందర్వకోట్టై, తిరుమయం, అరంతంగి, పొన్నమరావతి, కరంబకుడి, మనుముదియార్‌కిల్, అవుదైయార్‌కి.

చరిత్ర

[మార్చు]

పుదుకోట్టై జిల్లాలోని పలు గ్రామాలు చరిత్రపూర్వ మానవనివాస చిహ్నాలకు ఆవాసంగా ఉన్నాయి. జిల్లాలోని ఉత్తర, పడమర ప్రాంతాలలో పెద్దసంఖ్యలో అతిపురాతన సమాధులు కనిపించడం అందుకు ప్రత్యక్ష నిదర్శనం. పుదుకోట్టై చరిత్ర దక్షిణ భారతదేశ చరిత్రకు సంగ్రహరూపమని చెప్పవచ్చు. జిల్లా లోపలవెలుపల పురాతనకాలానికి చెందిన మానవనివాసాలకు సాక్ష్యాధారాలు లభిస్తున్నాయి. కొన్ని పురాతన వ్రాతప్రతులు లభిస్తున్నాయి.పాండ్యులు, చోళులు, పల్లవుకు, హొయశలలు, విజయనగర పాలకులు, మదురై నాయకుల ఆధీనంలో ఈ ప్రాంతం ఉంటూ వారి రాజ్యంలో భాగంగా ఉంటూవచ్చింది. ఈ పాలకులు ఈ ప్రాంతంలోని సాంస్కృతిక సంస్థలు, వాణిజ్యం, పరిశ్రమలను పెంచిపోషించారు. వారు అద్భుతరీతిలో ఆఅయాలు, ఙాపకచిహ్నాలను కూడా నిర్మించారు.

జనాభా గణాంకాలు

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19015,47,620—    
19115,83,413+0.64%
19216,07,933+0.41%
19315,73,642−0.58%
19416,22,706+0.82%
19517,04,102+1.24%
19617,50,461+0.64%
19719,47,351+2.36%
198111,56,813+2.02%
199113,27,148+1.38%
200114,59,601+0.96%
201116,18,345+1.04%
ఆధారం: [1]

2011 భారత జనాభా గణాంకాలను అనుసరించి పుదుకోట్టై జిల్లా జనసంఖ్య 1,618,345. స్త్రీపురుష నిష్పత్తి 1015:1000. జాతీయసరాసరి అయిన 929 కంటే ఇది అధికం.[2] వీధిలో 6 సంవత్సరాలకు లోబడిన వారి సంఖ్య . వీధిలో బాలల సంఖ్య 91,696 బాలికల సంఖ్య 87,992. షెడ్యూల్ జాతుల శాతం 17.6% కాగా, షెడ్యూల్డ్ తెగల శాతం 0.8%. సరాసరి అక్షరాస్యత 68.62%, జాతీయ అక్షరాస్యత 72.99%.[2] జిల్లాలో కుటుంబాల సంఖ్య 3,87,679. వీరిలో శ్రామికుల సంఖ్య 7,61,693. రైతులు 2,34,344 కలిపి వ్యవసాయ కూలీలు 10,170. కుటీర పరిశ్రమలలో పనిచేసే వారి సంఖ్య 203,272. ఇతర కూలీలు 121,445. సమయానుకూల కూలీలు 2,03,272. సమయానుకూల రైతులు 16,808. సమయానుకూల రైతుకూలీలు 1,92,462. సమయానుకూల ఇతర పనులు పనిచేసేవారు 3,771. సమయానుకూలంగా పనిచేసే రైతుకూలీలు 70,805, సమయానుకూలంగా కుటీరపరిశ్రమలలో పనిచేసేవారు 30,061 మంది ఉన్నారు.[3]

మతాల ప్రకారం పుదుక్కొట్టై జిల్లా జనాభా (2011)[4]
మత వివరం శాతం
హిందూ
  
88.29%
ఇస్లాం
  
7.06%
క్రిష్టియన్లు
  
4.50%
మతం అవలబించనివారు
  
0.15%

సంగమ కాలం

[మార్చు]
పుదుకోట్టై హోర్డ్‌లో పురాతన అగస్టస్ నాణెం

సంగమ కాల తమిళసాహిత్యం జిల్లాలోని పలుగ్రామాల గురించి ప్రస్తావించింది. తిరుమంగళం తాలూకాలో ఉన్న ఒలియమంగళం పురనానూరులో ఒలైయూరుగా ప్రస్తావించబడింది. ఈగ్రామం ప్రఖ్యాత కవి ఒలైయూర్ కిలాన్ మకాన్ పెరుంచట్టన్, ఒలైయూర్ తంద బుధ పాండ్యన్‌లకు జన్మస్థలం. సంగకాల గ్రంథాలైన అగనానూరులో కూడా ఒలైయూరు ప్రస్తావన ఉంది. ప్రస్తుత అంబుకోవిల్ అగనానూరులో అంబులిగా ప్రస్తావించబడింది. ఆవూరు ప్రముఖ కవులైన అవుర్ కిలార్, అవుర్ మూంకిలార్ జన్మస్థలం. పురాతన ఎరిచలూరు ప్రస్తుతం పుదుకోట్టై అరంతాంగి రోడ్డులో ఉన్న ఎరిచిగా భావించబడుతున్నప్పటికీ ఆధునిక పరిశోధకులు ప్రస్తుత ఇళుపూర్ గ్రామమే పురాతన ఎరిచలూరుగా భావిస్తున్నారు . ఇది ప్రముఖ కవి మాదలన్ మదురై కుమరనార్ జన్మస్థలమని భావించబడుతుంది. ఆవయాపట్టిలో కవయిత్రి అవయార్ కొంతకాలం నివసించినట్లు విశ్వసిస్తున్నారు. సంగకాలంలో పుదుకోట్టై ప్రాంతాన్ని మొదటి పాండ్యరాజు పాలించాడు. అయినప్పటికీ ఉత్తరభాగలోని కొన్ని ప్రాంతాలను చోళూల ఆధీనంలో ఉంటూ వచ్చింది. కిల్లి, వలావన్ పదాలతో కలిసిన పేర్లతో సంబంధమున్న గ్రామాలకు చోళసామ్రాజ్యానికి సబంధమున్నదని విశ్వసిస్తునారు. ఈ రెండు పదాలు చోళుల బిరుదునామాలు కనుక ఇలా భావించబడుతుంది. ఈ జిల్లా వాసులు ఒకప్పుడు తమిళుల సముద్రవ్యాపార సంబంధిత సమృద్ధిని అనుభవించారు. కరుకంకురుచ్చి వద్ద లభించిన భుగర్భనిధిలో 500 రోమ్‌ సామ్రాజ్యానికి చెందిన బంగారు, వెండినాణ్యాలతో నిండిన పాత్ర ఇందుకు ప్రబల నిదర్శనం. ఇప్పటి వరకు లభించిన నాణ్యాలలో ఇదే పెద్ద మొత్తమని భావించబడుతుంది. ఈ ప్రాంతం అరంతాంగికి ఉత్తరప్రాంతంలో ఉన్న ఆలంగుడి తాలూకాలో ఉంది. అంతేకాక మిమిసల్, సాలియూర్ వంటి పురాతన నౌకాశ్రయాలు కూడా సమీపంలోనే ఉన్నాయి. అలాగే దక్షిణప్రాంతంలో తుండి గ్రామం ఉంది. పుదుకోట్టలో ఒకప్పుడు రోమ్‌ రాకుమారులు వారి రాణులతో నివసించారని భావిస్తున్నారు. అగస్టస్ (క్రీ.పూ 29-సా.శ. 14) నుండి వెస్పాసియన్ (69-79) వంటి వారు ఇక్కడ నివసించినట్లు భావిస్తున్నారు.

రోమ్‌తో వ్యాపార సంబంధాలు

[మార్చు]

రోమ్‌తో వ్యాపారసంబంధాలకు కరుక్కకురిచ్చి కేంద్రంగా ఉండేది. అంతేగాక దేశీయంగా పడమర, తూర్పు దిక్కులను కలుపుతూ వాణిజ్యమార్గం ఈ ప్రాంతం నుడే ఉంటూవచ్చింది. కొర్కై, కిళక్కరై, అళగన్‌కుళం గ్రామాలలో రోమ్‌ నాణ్యాల నిధినిక్షేపాలు లభించడమే అందుకు ఆధారం. ఈ గ్రామాలన్నీ ఈ ప్రాంతంలోని తూర్పు సముద్రతీరంలో ఉన్నాయి. వీటిలో కరుంకురిచ్చి సముద్రతీరానికి కొంచం దూరంలో ఉన్నప్పటికీ మిమిసాల్‌లా సముద్రతీరానికి మరింత దూరం కాదు. తూర్పుసముద్రతీరంలో మరికొన్ని ప్రాంతాలలో మరికొన్ని సాక్ష్యాధారాలు లభించాయి. రోమన్ బంగారు, వెండి నాణ్యాలకు బదులుగా భారతీయ వస్తువులు విక్రయించబడ్డాయి. ప్రస్తుతం రోమన్ నాణ్యాల నిధినిక్షేపాలు లభిస్తున్న గ్రామాలు అప్పుడు వాణిజ్యకేంద్రాలుగా ఉండేవని తెలియజేస్తున్నాయి.

కలభ్రాల పాలన

[మార్చు]

4 వ శతాబ్దం చివరి నుండి 6వ శతాబ్దం ఆరంభకాలం వరకు ఈ ప్రాంతం కలభ్రాల పాలనలో ఉంది. ఈప్రాంతానికి కుర్రన్ రాజుగా ఉండేవాడు. శిలాశాసనాల ఆధారంగా కుర్రన్ పొన్నమరావతి సమీపంలో " పులాంకురిచి " రాజ్యస్థాపన చేశాడని భావిస్తున్నారు.

పాండ్యసాంరాజ్యం

[మార్చు]

పుదుకోట్టై జిల్లా చరిత్రలో తరువాత అడుగు కాలభరాల పతనం. పాండ్యదేశంలో కడుంగన్లు కాలభరాలను 590లో ఓడించారు. తరువాత మొదటిసారిగా పుదుకోట్టైలో పాండ్యులు రాజ్యస్థాపన చేసి విస్తరణ పనులు చేపట్టారు. దీనిని ౠజువుచేసే ఆధారాలు కుడుమియన్మలై, తిరుగోకర్ణం, సాత్తన్నవాసల్‌లో లభ్యమౌతున్నాయి. వెల్లార్ నది ఉత్తరతీరంవెంట నివాసమున్న స్థానికులు పాండ్యులని పాండ్యశతకం పద్యాల ద్వారా విశ్వసిస్తున్నారు. వెల్లార్ నది పుదుకోట్టై ప్రాంతం నుండి పురాతన కాలం నుండి ప్రవహిస్తుంది. వెల్లార్ నది పుదుకోట్టైని కొనాడు, కనాడుల నుండి విడదీసే సరిహద్దుగా ఉంది. అందువలన జిల్లా పాండ్య, పల్లవరాజ్యాలకు సరిహద్దుగా ఉంటూవచ్చింది. పాండ్యులు, పల్లవులు పరస్పరం సామంతరాజులైన మరాతియర్లు, వెలిర్ల సాయంతో యుద్ధ్హలు కొనసాగించారు. వెలిర్ల మద్య కొడుబలూరు ఇరుకువెల్స్‌కు గుర్తింపు అధికంగా ఉండేది. రెండురాజ్యాల మద్య కొడుంబలూరు వెలిర్లు చిక్కుకుని ఉండేవారు. పాండ్యులు, చోళులు సామంతరాజ్యాల మద్య వివాహసంబంధాలు ఏర్పరచుకుని రాజ్యాలను మరింత బలపరచారు.

చోళపాండ్య సరిహద్దులు

[మార్చు]
Vijayalaya Choleswaram, Pudukkottai, built c. 850 C.E.

600 - 900 మద్య ఉన్న 3 శతాబ్ధాల కాలం పల్లవులు (కంచి), తమిళనాడు అంతటినీ పాలించిన పాండ్యులు (మదురై) ఈ ప్రాంతాన్ని పాలించారు.

పల్లవులు

[మార్చు]

పరాక్రమవంతుడైన సింహవిష్ణు నుండి వారసత్వంగా లభించిన పల్లరాజ్యాన్ని మహేంద్రవర్మ పల్లవ (604-630) వరకు పాలన సాగించాడు.కంచి నుండి కావేరీ వరకు పల్లవరాజ్యం విస్తరించింది. చోళమండలానికి వెంటనే సరైన వారసుడు లభించని కారణంగా పాండ్యులు దక్షిణదిశగా మరికొంత ముందుకు సాగారు. వెల్లార్ నది ఉత్తర దక్షిణ భూభాగాలు సామంతులైన ముత్తురాయర్ స్వాధీనపరచుకున్నారు. వారు చోళరాజైన రెండవ విజయాలయా కాలం వరకు ఈ ప్రాంతం మీద ఆధిపత్యం కొనసాగించారు. చివరికి ఇరుకువెల్లార్లు చోళరాజుల ఆధీనంలో ఈ ప్రాంతాన్ని పాలించారు.

జ్నాపకచిహ్నాలు

[మార్చు]

పుదుకోట్టై ప్రాంతంలో పల్లవుల చిహ్నాలు లభించనప్పటికీ ముతరాయరాలు, ఇరుక్కువెల్లర్లతో సమకాలీన పాడ్యుల చిహ్నాలు మాత్రం లభిస్తున్నాయి. తరువాత పల్లవులు ఈ ప్రాంతాన్ని పాండ్యులచేతిలో పెట్టారు. పుదుకోట్టై ప్రాంతం రెండవ నందివర్మన్ (730-796) లో పల్లవుల ప్రాభవంలో ప్రవేశించి కావేరీ దక్షిణప్రాంతం వరకు వ్యాపించింది. అలాగే వెల్లార్ ఉత్తర ప్రాంతం, పుదుకోట్టైలో కొంత భాగం పల్లవుల వశమైంది. ఈ సమయంలో పాండ్యులు, ముతరాయర్లు గుహలను తొలిచి ఆలయాలు నిర్మించబడ్డాయి.

పాండ్యులు

[మార్చు]

పాండ్యరాజ్య చిహ్నాలు మాత్రం అరుదుగా లభిస్తున్నాయి. శ్రీరామ శ్రీవల్లభ (851-862) కాలానికి చెందిన చిహ్నాలు సిద్ధన్నవాసల్ వద్ద లభిస్తుండగా కొచ్చడయన్ రణధీరన్ (సడయన్ మారన్) (700-730) కాలంనాటి చిహ్నాలు కుడుమియాన్మలై ప్రాంతంలో లభిస్తున్నాయి. మారవర్మన్ నరసిహా కాలంలో పల్లవులతో అనేక యుద్ధాలు జరిగాయి. యుద్ధాలు జరిగిన ప్రాంతాలలో కొడబలూరు కూడా ఒకటి. నెడుంచడయన్ (768-816) కాలంనాటి శిలాశాసనాలు తిరుగోకర్ణం, నిర్పలానిలలో లభిస్తున్నాయి. శ్రీరమ శ్రీవల్లభాతో మొదలైన పాలన రెండవ రాజసింహా (920)తో పాండ్యుల పాలన ముగింపుకు వచ్చి పుదుకోట్టైలో చోళుల ప్రాభవం మొదలైంది.

పల్లవులు

[మార్చు]

పుదుకోట్టైలో పల్లవుల చిహ్నాలు లభించడం చాలా అరుదు. పల్లవుల గురించిన చిహ్నాలు వెల్వికుడి, చిన్నమనూరులలో ఉన్న పాండ్యుల శలాశానాలలో మాత్రమే లభిస్తున్నాయి. ఇక్కడ అభిస్తున్న ఆధారాలు నందివర్మన్ పల్లవ వర్మను మారవర్మన్ రాఅసింహా ఓడించినట్లు తెలియజేస్తున్నాయి. ఆయన వారసుల శిలాశాసనాలు కూడా కున్నందర్ కోయిల్, మలయాడిపట్టి, రాసలిపట్టిలో లభిస్తున్నాయి. పల్లవులు, పాండ్యులు పాలనా కాలంలో తమిళనాడులో భక్తిభావం పరిడవిల్లింది. పుదుకోట్టైలో ప్రస్తావించిన పలు ఆలయాలు పుదుకోట్టై జిల్లాలో ఉన్నాయి. శివభక్తులైన ముగ్గురు నాయన్మార్లు ఈ జిల్లావాసులన్నది లోకవిదితం. కొడంబలూరులో ఇడంగలి నయనార్, దేవర్‌మలైలో పెరుమిళలై కురుంబనయనార్, మాన్మేల్గుడిలో కుళచిరై నయనార్ జన్మించారు.

జైనిజం

[మార్చు]

11వ శతాబ్దం వరకు పుదుకోట్టైలో జైనమతం వర్ధిల్లింది. అందుకు నిదర్శనగా పలు జైనమత ఙాపక చిహ్నాలు లభిస్తున్నాయి. మునుపటి తంజావూరు జిల్లా నుండి పుదుకోట్టైలో బుద్ధిజం ప్రవేశించిది. కొట్టియపట్టణం, కరూర్ లలో బుద్ధమత చిహ్నాలు లభిస్తున్నాయి. రాజకీయ చతురంగం నుండి పల్లవులు కనుమరుగై పాండ్యుల శక్తిని చోళులు తరిమి కొట్టిన తరువాత చోళసామ్రాజ్యం తంజావూరు వరకు విస్తరించింది. 9వ శతాబ్దం వరకు తంజావూరు చోళులకు రాజధానిగా ఉంటూవచ్చింది. 11వ శతాబ్ధానికి చోళులు తమసామ్రాజ్యాన్ని మరింత విస్తరించారు. మిగిలిన పలుప్రాంతాలతో కలిసి పుదుకోట్టై కూడా చోళుల ఆధీనజ్ంలోకి మారింది.13వ శతాబ్దం మద్యకాలంలో పాండ్యులు తిరిగి ప్రవేశించే వరకు పుదుకోట్టైలో చోళుల ప్రాభవం కొనసాగింది.

జిల్లాలోని 9వ శతాబ్ధానికి చెందిన ఆలయాలు ఈ ప్రాంతం విజయాలయ చోళునికాలంలో చోళుల ఆధీనంలో ఉన్నదనడానికి సాక్ష్యాధారంగా ఉన్నాయి. అయినప్పటికీ మొదటి పరంతక (907-955) వరకు పాండ్యులకు ఈ ప్రాంతంతో సంబంధబాంధవ్యాలు ఉంటూ వచ్చింది. విజయాలయా తరువాత వచ్చిన రెండవ వారసుడు పాండ్యరాజ్యం అంతటినీ ఆక్రమించుకున్నాడు. పరంతకా సాగించిన యుద్ధానికి కొడంబలూరు సామంతరాజులు సహకరించారు. తరువాత వారు చోళసామ్రాజ్యానికి విశ్వసపాత్రులుగా ఉంటూవచ్చారు. మొదటి కుళోత్తుంగ చోళుని కాలంలో ఈ ప్రాంతం తమిళనాడు లోని అన్ని ప్రాంతాలలా అత్యంతవైభావాన్ని చవిచూసింది. చోళుల పాలనా వైభవాన్ని జిల్లాలో లభిస్తున్న శిలాశాసనాలు వివరిస్తున్నాయి. చోళుల కాలంలో సాగిన అత్యున్నత నిర్వహణా వైభవానికి ఈ ప్రాంతం తార్కాణంగా నిలిచింది.

మొదటి రాజరాజచోళుడు

[మార్చు]

మొదటి రాజరాజచోళుడు తాను జయించిన పాండ్య, చేర రాజ్యాలకు తన కుమారుని రాజప్రతినిధిగా చేసాడు. మూడవ కుళోత్తుంగుని చివరిదశ (1178-1218) వరకు పుదుకోట్టై జిల్లా ప్ర్రంతం చోళసామ్రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది.

పాండ్యుల స్వాతంత్ర్య పోరాటం

[మార్చు]

రెండవ రాజరాజుని తరువాత వారసుడుగా రెండవ రాజాధిరాజా రాజ్యాపలన చేపట్టగానే చోళసామ్రాజ్య క్షీణదశ మొదలైంది. ఒదటి కుళోత్తునగా పాలనా కాలంలో పాండ్యుకు స్వతంత్రం కొరకు పోరాడడం మొదలైంది. పాండ్యులను ఎదిరిస్తున్న రెండవ రాజరాజ, కులశేఖర చోళుల సహాయం కోరారు. వారి శత్రువైన పరంతక శ్తీలంక వైపు దృష్టి సారించాడు. పుదుకోట్టై కూడా అతర్యుద్ధంలో ప్రధానపాత్ర వహించింది. శ్రీలంక రాజైన పరాక్రమ బాబు కులవంశాతో పరాక్రమ పాండ్యుని సహాయార్ధం సైన్యాలను పంపాడు. శ్రీలంక సైన్యం జిల్లాలో సాగిన యుద్ధానికి ప్రోత్సాహం అందించాడు. చోళుల పతనం తరువాత జిల్లాచరిత్ర వివరణ లభించలేదు కాని సంగ్రహ చరిత్ర మాత్రం లభిస్తుంది.క్రమంగా పాండ్యులు ఈ ప్రంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

పాండ్యుల పాలన

[మార్చు]

మొదటి జాటావర్మన్ సుందరపాండ్య, మొదటి జాతవర్మన్ వీర పాండ్యన్ సమైక్యపాలనలో పాండ్యుల శక్తి శిఖరాగ్రాన్ని చేరిన ఈ ప్రాంతం పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకున్నది. కుడిమియన్ మలైలో లభిస్తున్న శిలాశాసనాలు వీరపాండ్యునికి శ్రీలంక సామ్రాజ్యానికి ఉన్న సత్సంబంధాలను తెలియజేస్తుంది. మొదటి మహావర్మన్ కులశేఖరా పాలనాకాలంలో సా.శ. 1268లో నౌకాయాత్రికుడైన మార్కోపోలో పాండ్యసామ్రాజ్యంలోకి పాదంమోపాడు. కులశేఖరుని పాలన చివరిదశలో రెండవ జాతవర్మ, రెండవ జాతవర్మన్ సుందరపాండ్యుల మద్య కూచులాటలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ కారణంతో దేశంలో అంతఃకలహాలు చెలరేగి రాజకీయంగా అస్థిరత నెలకొన్నది. అల్లాఉధీన్ జనరల్, డిల్లీ సుల్తాన్ అయిన మాలికాపూర్ ఈ పరిస్థితిని అవకాశంగా చేసుకుని పాండ్యరాజ్యం మీద దండెత్తాడు. తరువాత పాండ్యరాజ్యం డిల్లీ సుల్తానేటులో భాగంగా మారింది. మదురై సుల్తానేటు స్థాపన తరువాత పుదుకోట్టై ప్రాంతం మదురై సుల్తానేటులో భాగం అయింది. దీనికి సంబంధించిన రెండు శిలాశాసనాలలో ఒకటి రాంగియం (1332), పానైయూరు (1344) లో ఉన్నాయి.

ముస్లిం పాలన

[మార్చు]

మదురై సుల్తానుల ఆధ్వర్యంలో 75 సంవత్సరాల కాలం ఈ ప్రాంతం నవాబుల ఆధీనంలో ఉంది. తరువాత దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత పుదుకోట్టై ప్రాంతంలో కూడా చోటుచేసుకొన్నది. మినార్ రాజకుమారులు చిన్నచిన్న ప్రాంతాలను కొంతకాలం పాలించారు. 1371లో విజయనగరానికి చెందిన కుమారకంపన రాయలు మదురై సుల్తానత్ ని స్వాధీనం చేసుకున్న తరువాత పుదుకోట్టై ప్రాంతంలో సుల్తానుల పాలన ముగింపుకు వచ్చింది.

హొయసాల

[మార్చు]

కర్నాటక నుండి దక్షిణ తమిళనాడులో ప్రవేశించిన హొయశలలు చోళులను పాండ్యులను అధిగమించి కావేరీ తీరం వరకు ఉన్న ప్రాతాన్ని తమ ఆధీనంలోకి తీసుకువచ్చారు. హొయశలలు కన్ననూరు (ప్రస్తుత సమయపురం) ను రాజధానిగా చేసుకుని పాలనకొనసాగించారు. 13వ శతాబ్ధపు మద్యకాలానికి హొయశలలు ఈ ప్రాంతంలో రాజ్యస్థాపన చేసారు. 13వ శతాబ్ధపు చివరి వరకు పుదుకోట్టై హొయశలల పాలనలో ఉంది. హంపిని రాజధానిగా చేసుకున్న విజయనగర రాజులు కర్నాటకాతో చేర్చి మదుర సంస్థానాన్ని కూడా స్వాధీనపరచుకున్నారు. కర్నాటకా, ఆంధ్ర, తమిళనాడు ప్రాంతం అంతా విజయనగర సామ్రాజ్యలో అంరభాగంగా మారింది.

విజయనగరం

[మార్చు]

విజయనగర సంగమ సామ్రాజ్యంలో (1336-1485) ప్రాంతీయంగా లభ్యమౌతున్న శిలాశాసనాలు ఈ ప్రాంతాలను పాలించిన రాజప్రతినిధుల (సూరైకుడి, పెరంబూరు, సెందవన్ మంగళం, వనదరైయర్, గంగైరాయర్, అరంతాంగి తొండైమానులు ) వివరణలు లభిస్తున్నాయి. సులువ పాలనా కాలంలో (సా.శ. 1485-1505) మొదటి నరసింహరాయలు తన సామ్రాజ్యాన్ని సందర్శిస్తూ ముంబైకి పోతున్న సమయంలో పుదుకోట్టై ప్రాంతాన్ని కూడా సందర్శించాడు. వీరనరసింహ నాయక్, సేనానాయకుడైన మొదటి సులువ నరసింహ పాండ్యరాజ్యం మీద సేనలను నడిపించిన సమయంలో పుదుకోట్టై మార్గంలో పయనించారు.

తుళువ వంశం

[మార్చు]
Princely flag of Pudukkottai

తుళువ వంశజులలో గొప్పవ్యక్తి శ్రీ కృష్ణదేవరాయలు (1509-1529) రామేశ్వరం వెళ్ళే సమయంలో తిరుగోకర్ణంలో ఉన్న బృహదాంబ గోకర్ణేశాలయం దర్శించి ఆలయానికి అనేక కానుకలను సమర్పించుకున్నాడు.ఆయన తరువాత వచ్చిన రాజప్రతినిధి పుదుకోట్టై ప్రంతాన్ని తంజావూరు సంస్థానంలో భాగంగా చేసి మిగిలిన ప్రంతాలను మదురై నాయకాల ఆధీనంలో ఉంచాడు. 17వ శతాబ్ధపు చివరి కాలానికి పుదుకోట్టై ప్రాంతంలో తొండైమానులు వెలుగులోకి వచ్చారు. విజయనగర రాజప్రతినిధులైన మదురైనాయకులు, తంజావూరు ప్రతినిధులు విజయనగర రాజ్య పతనావస్థలో స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. తరువాత పుదుకోట్టై ప్రాంతం ముందు మదురై నాయలులు తరువాత తంజావూరు నాకులకు ఆధీనంలో ఉంది. తరువాత పుదుకోట్టై తొండైమానుకు పూర్తి అధికారంతో వశపరచుకుని పాలించారు. 17వ శతాబ్ధపు మద్యకాలం నుండి 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు పాలించిన తొండైమానులు తరువాత పుదుకోట్టై ప్రాంతాన్ని దేశంలో ఒక భాగంగా చేసారు.

తొండైమాన్లు

[మార్చు]

పుదుకోట్టైను పాలించిన తొండైమానులు పురాతన తమిళరాజ్యంలో ఉత్తర సరిహద్దులో ఉన్న తిరుపతి ప్రాంతంలోని తొండైమండలం నుండి వలస వచ్చారని భావిస్తున్నారు. వీరు 17వ శతాబ్దంలో విజయనగర సైన్యాలతో ఈ ప్రాంతానికి వచ్చారని అంచనా. వారిలో ఒకరికి ఈ ప్రాతం సామంతరాజైన పల్లవరాయన్ ప్రాపకం లభించి రాజు నుండి కరంబంకుడి, అంబుకోవిల్ వద్ద భూములను స్వీకరించి ఈ ప్రాంతంలో స్థిరపడినట్లు భావిస్తున్నారు. తరువాత వీరు సామంతరాజై ఆతరువాత పుదుకోట్టై పాలకులైనట్లు భావిస్తున్నారు.తెలుగు పధ్యాల ఆధారంగా తొండైమాన్లు ఇంద్రవశజులని మొదటి పాలకుడు పచ్చై తొండైమన్ అని తెలుస్తుంది. పచ్చై తొండైమన్ తరువాత మూడవ వెంకటరాయ సహాయంతో ఆవడి రాయ తొడైమాన్ పాలకుడయ్యాడని భావిస్తున్నారు. విజయనగర రాజు ఆవడి రాయ తొడైమాన్ ఆధ్వర్యంలో రాజ్యవిస్తరణ చేసాడని ఆ తరువాత ఆవడి రాయ తొడైమాన్ రాయ బిరుదాకితుడయ్యాడని భావిస్తున్నారు. ఆవడి రాయ తొడైమాన్ విజయనగర సంప్రదాయాన్ని స్వీకరించాడు ఆ తరువాత తొండైమాన్ల సంప్రదాయం కూడా అనుసరించాడు.

రఘునాథనాయక తొండైమాన్

[మార్చు]
Thirumayam Fort

ఆవడి రాయ తొడైమాన్ కుమారుడైన రఘునాథనాయక తొండైమాన్ తంజావూరు నాయకా, తిరుచిరాపల్లి ముత్తువీరప్పనాయకాలతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు. తరువాత రఘునాథనాయకా తొండైమాన్ తిరుచిరాపల్లి అరసు కావలర్‌ (రాజ్యరక్షకుడు) గా నియమితుడయ్యాడు. రామనాథపురం పాలకుడైన విజయరఘునాథ కిళవన్ సేతుపతి తొండైమాన్ సహోదరి అయిన కదలి నాచ్చియారుని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం రెండురాజ్యాలమద్య సంబంధాలను మరింత బలపరచింది. సేతుపతి వెల్లార్ దక్షిణప్రాంతాన్ని తొండైమాన్‌కు బహూకరించాడు. అలా పుదుకోట్టై రాజ్యం విస్తరించింది. ఈ ప్రాతం పుదుకోట్టై సేతుపతి భూమిగా గుర్తింపు పొందింది. అలాగే తొండైమాన్ పాలన విస్తరించింది. రాజ్యం వెల్లార్ దక్షిణప్రాంతం వరకు విస్తరించిన రఘునాథనాయకా పాలన 1686-1730 వరకు కొనసాగింది.

రఘునాథరాజ తొండైమాన్ రాజ్యవిస్తరణ

[మార్చు]

రఘునాథరాజ తొండైమాన్ పుదుకోట్టై పాలకుడైన సమయంలో తిరిచిరాపల్లి, కొళత్తూరుల నాయకా రాజైన రంగకృష్ణ ముత్తువీరప్ప ఆశీర్వాదంతో (1682-1689) కొళత్తూరు పాళయం రాజప్రతినిధిగా నియమించబడ్డాడు. తిరుచిరాపల్లి, కొళత్తూరులు (ప్రస్తుత కొళత్తూరు తాలూకా) వేరువేరు ప్రాంతాలుగా ఉంటూవచ్చాయి. కొళత్తూరుకు పాలకుడు కొళత్తూరు తొండైమాన్‌గా గుర్తింపు పొంది 1750 వరకూ పాలన సాగించాడు. పుదుకోట్టైకు ఆనుకుని ఉన్న కొళత్తూరు లోని కొన్న ప్రాంతాలను రఘునాథనాయకా జయించి తన రాజ్యంలో కలిపాడు. తరువాత పుదుకోట్టై రాజ్యంలో కొళత్తూరు, ఆలంగుడి, తిరుమయం తాలూకాలు ఉంటూ వచ్చాయి. తరువాత ఈ ప్రాంతం పుదుకోట్టై సంస్థానం అయింది.

విజయరఘునాథరాజ తొండైమాన్

[మార్చు]
Todiman Raja in his Durbar, Pudukkottai, 1858

తొండైమాన్ రాజ్యానికి విజయ రఘినాథరాయ తొండైమాన్ (1730-1769) రెండవ పాలకుడయ్యాడు. ఆయన కాలంలో భారతదేశం అంతా మొగలు పాలనలోకి వచ్చింది. జింజీ, తంజావూరు, మదురై మరికొన్ని పాళయాలను కలుపుకొని మొగల్ సామ్రాజ్యానికి సామంతులై కప్పం చెల్లించాయి. దక్షిణభారతదేశానికి మొగల్ రాజ్యప్రతినిధిగా నిజాం నవాబు నియమితుడయ్యాడు. ఆ సమయంలో కర్నాటకాగా ప్రస్తావించబడుతున్న తమిళనాడు ప్రాంతం కలిసిన ప్రాంతం ఆర్కాటు నవాబుకు అప్పగించబడింది. సామంతరాజ్యాలలో అనేకం మొగల్ సామ్రాజ్యానికి కప్పం కట్టకుండా తిరుగుబాటు చేసాయి. వాటిపై నవాబు సైన్యాలు దాడి చేసాయి. పుదికోట్టై మాత్రం ఈ దాడులకు గురికాకుండా తప్పించుకున్నది.

నవాబుల దాడి

[మార్చు]

కర్నాటికా యుద్ధాలుగా వర్ణించబడిన మొహమ్మద్ అలి, చందాసాహెబ్‌ల మద్య సాగిన పోరు ఫ్రెంచ్, ఆంగ్లేయుల మద్య ఆధిపత్యపోరుగా మారింది. ఫ్రెంచ్ చందాసాహెబ్‌ను సమర్ధించగా ఆంగ్లేయులు మాత్రం మొహమ్మద్ ఆలీని సమర్ధించారు. తిరుచిరాపళ్ళి సమీపంలో ఈ యుద్ధాలు కొన్ని సంవత్సరాలపాటు కొనసగింది. ఈ యుద్ధంలో తొండైమాన్ స్థిరంగా ఆంగ్లేయుల వైపు నిలిచాడు. చివరికి ఆంగ్లేయుల వైపు విజయం వరించింది. ఫలితంగా నవాబు తొండైమాన్‌కు కప్పం నుండి విడుదల కల్పించాడు. తరువాత అది ఆంగ్లేరభుత్వం కొనసాగించింది. ఆగ్లేయులతో తొండైమాన్ సాగించిన మైత్రి తరువాతి పాలకుడు రఘునాథ తొండైమాన్ వచ్చిన తరువాత (1769-1789) వరకు కూడా కొనసాగింది. ఈ కారణంగా తొండైమాన్లు శక్తివంతమైన హైదర్ అలీ సైన్యాలను ఎదుర్కొనకలిగారు.

మూలాలు

[మార్చు]
  1. Decadal Variation In Population Since 1901
  2. 2.0 2.1 "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  3. "Census Info 2011 Final population totals - Pudukkottai district". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  4. "Table C-01 Population by Religion: Tamil Nadu". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.

వెలుపలి లింకులు

[మార్చు]