గ్రామం
గ్రామం (Village) లేదా పల్లె అనేది కొన్ని నివాసాల సముదాయం. ఇది నగరం లేదా పట్టణం కంటే చిన్నది. గూడెం (Hamlet) కంటే పెద్దది[1].
మనిషి సంఘజీవి కనుక ఇతరులతో అవసరాలను అనుసరించి దగ్గరగా జీవించుటకు కొందరు ఒకే చోట లేదా ఒకే ప్రాంతమును కేంద్రముగా చేసుకొని వారి వారి నివాసాలను ఏర్పాటు చేసుకోగా ఏర్పడినది ఒక గ్రామం. గ్రామాలు వాటి మధ్య వ్యాపార సంబంద కార్యకలాపాలు నెరపేందుకు వాటి కూడలిగా కొన్ని పట్టణాలు ఏర్పడతాయి. ఆయా పట్టాణాలను కేంద్రీకృతం చేసుకొని దగ్గర దగ్గరలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఎక్కువ గ్రామాలు శాశ్వతంగా ప్రజలు నివాసం ఉండేవి. కాని కొన్ని గ్రామాలు తాత్కాలికం కావచ్చును. అలాగే ఎక్కువ గ్రామాలలో ఇండ్లు దగ్గర దగ్గరగా ఉంటాయి. గుడేంలో ఎక్కువగా హరిజనులు ఉంటారు కాని కొన్ని గ్రామాలలో ఇండ్లు దూర దూరంగా ఉండవచ్చును[2].
చారిత్రికంగా వ్యవసాయం గ్రామాల ఏర్పాటుకు పట్టుకొమ్మ కాని కొన్ని గ్రామాలు ఇతర వృత్తులు ఆధారంగా ఏర్పడ్డాయి. రాజకీయ, పరిపాలనా ప్రయోజనాల కారణంగానూ, పారిశ్రామిక విప్లవం అనంతరం పరిశ్రమలు విస్తరించడం వలనా అనేక గ్రామాలు పట్టణాలుగానూ, నగరాలుగానూ వృద్ధి చెందాయి.
ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది గ్రామాలు ఉన్నందున వీటిలో ఎంతో వైవిధ్యం ఉంది. కనుక గ్రామం అంటే ఇలా ఉంటుంది అని చెప్పడం కష్టం. సుమారుగా 10 నుండి 1000 వరకు కుటుంబాలు ఉండే గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం 6,38,365 గ్రామాలు (నిర్జన గ్రామాలతో కలిపి) ఉన్నాయి[3]. అధికంగా గ్రామాలలో నివాసాలు అక్కడి అవసరాలను బట్టి ఉంటాయి.
- రక్షణ అవుసరమైన చోట (దొంగల భయం వంటివి ఉన్నట్లయితే) నివాసాలు దగ్గర దగ్గరగా ఉంటాయి.
- అక్కడి వాతావరణాన్ని బట్టి, అక్కడ దొరికే వస్తువులను బట్టి నివాసాల నిర్మాణం జరుగుతుంది. ఉదాహరణకు కేరళలో వర్షాలను తట్టుకొనే ఇళ్ళు, హిమాచల్ ప్రదేశ్‌లో హిమపాతాన్ని తట్టుకొనేవిధంగా నిర్మించిన ఇళ్ళు కొండలపై దూరదూరంగా ఉంటాయి. రాజస్థాన్ ఎడారిలో ఇళ్ళలో కలప కంటే మట్టి వినియోగం ఎక్కువ.
- అక్కడి వృత్తులు కూడా ఇళ్ళ నిర్మాణాన్ని, ప్రజల జీవనాన్ని బాగా ప్రభావితం చేస్తాయి.
- దగ్గరలో ఉండే నగరాల వనరులు, అవసరాలు, వాణిజ్య సంబంధాలు గ్రామ జీవనంపై గణనీయమైన ప్రభావం కలిగి ఉంటాయి. ఉదాహరణకు నగరం దగ్గరలో ఉన్న గ్రామాలలో పాల ఉత్పత్తికి, కూరగాయల పెంపకానికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో గ్రామపాలన పూర్వం కరణం మునసబు పటేల్ పట్వారీలు వారి సొంత గ్రామాల్లోనే ఉండి పాలన నడిపేవారు.1985 లో వీరిని తీసేసి గ్రామపాలనాధికారుల్ని (వి.ఏ.వో ) ప్రవేశపెట్టారు.పంచాయతీల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో 2007 ఫిబ్రవరి నుంచి వీఆర్వోల విధానం అమలులోకి వచ్చింది. జనాభా ప్రాతిపదికన వారిని నియమించారు. 5000 జనాభా ఉంటే ఒకరు, 5 వేల నుంచి 10,000 మంది వరకు ఉంటే ఇద్దరు, పది వేల నుంచి పదిహేను వేల మంది ఉంటే ముగ్గురు చొప్పున గ్రామ రెవిన్యూ అధికారి వీ.ఆర్.వోలు ఉండడానికి అనుమతి ఇచ్చారు. కానీ పంచాయతీ కార్యదర్శులను వీఆర్వోలుగా తీసుకున్న సమయంలో 'ఎక్కడి వారు అక్కడే' అన్న పద్ధతిలో వారిని ఉంచేశారు. ఫలితంగా కొన్ని చోట్ల ఉండవలిసిన వారికంటే ఎక్కువ మంది ఉంటే.. ఇంకొన్ని చోట్ల అసలే లేకుండాపోయారు. ఈ అసమానత కారణంగా ప్రజలకేగాక పాలనపరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఎవరినీ సొంత గ్రామానికి బదిలీ చేసేది లేదు.ఆయా జిల్లాల్లో ఖాళీగా ఉన్న వీఆర్వో ఉద్యోగాల భర్తీ సంబంధిత జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) చేస్తుంది.. కొన్ని గ్రామాలను కలిపి ఒక సమూహం (క్లస్టర్)గా ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో 12,397 క్లస్టర్లు ఉండగా 17,008 వీఆర్వోలు అవసరం. ప్రస్తుతం సుమారు 14,800 మంది వీఆర్వోలే ఉన్నారురాష్ట్రంలోని 21,943 గ్రామ పంచాయతీలను పరిపాలనా సౌలభ్యం కోసం 12,397 క్లస్టర్లుగా ఏర్పాటు చేసింది. 5 వేల జనాభా ఉన్న ఒకటి లేదా రెండు మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టరుగా గుర్తించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక కార్యదర్శి ఉండాలి. ప్రతి పంచాయతీ క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి.ఒక కార్యదర్శికి ఒక పెద్ద పంచాయతీ లేదా ఏడు చిన్నపంచాయతీల బాధ్యతలను అప్పగించారు. ఏజెన్సీ ప్రాంతంలో గ్రామ కార్యదర్శిని కలవాలంటే 40-50 కిలోమీటర్లు ప్రజలు పయనించాలి. అడవుల మధ్యలో ఉన్న చిన్నపంచాయతీలకు వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యంలేదు. కనీసం గ్రామానికి ఒకరుండాలంటే పూర్వంలాగానే పంచాయతీ రెవిన్యూశాఖలను ఏకంచెయ్యాలి.మన రాష్ట్రంలో 1127 రెవిన్యూ మండలాలు,1094 మండలపరిషత్తులు,21943 గ్రామపంచాయితీలు,28124 రెవిన్యూ గ్రామాలు,26614 నివాసితగ్రామాలు,1510 నివాసులులేనిగ్రామాలు ఉన్నాయి.రక్షణ అవుసరమైన చోట (దొంగల భయం వంటివి ఉన్నట్లయితే) నివాసాలు దగ్గర దగ్గరగా ఉంటాయి.
విషయ సూచిక
భారత దేశంలో గ్రామాలు[మార్చు]
"భారత దేశం ఆత్మ పల్లెలలో ఉంది" అని మహాత్మా గాంధీ అన్నాడు[4]. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 74% గ్రామీణ జనాభా.దేశంలో మొత్తం 6,38,596 గ్రామాలున్నాయి.593,731 గ్రామాలలో ప్రజలు నివసిస్తున్నారు[5]. వీటిలో 2,36,004 గ్రామాలలో జనాభా 500 లోపే ఉంది. 3,976 గ్రామాల జనాభా 10,000 పైబడి ఉంది.
రాష్ట్రం / కేంద్ర పాలిత ప్రాంతం | 1991లో గ్రామాలు | 2001లో గ్రామాలు |
---|---|---|
మొత్తం దేశం | 634,321 | 638,596 |
ఆంధ్రప్రదేశ్ | 28124 | |
తెలంగాణ | ||
జమ్ము, కాశ్మీరు | 6,705 | 6,652 |
హిమాచల్ ప్రదేశ్ | 19,388 | 19,831 |
పంజాబ్ | 12,795 | 12,729 |
చండీగఢ్ | 25 | 24 |
ఉత్తరాంచల్ | 16,623 | 16,805 |
హర్యానా | 6,988 | 6,955 |
ఢిల్లీ | 209 | 165 |
రాజస్థాన్ | 39,810 | 41,353 |
ఉత్తర ప్రదేశ్ | 107,327 | 107,440 |
బీహార్ | 45,077 | 45,113 |
సిక్కిం | 453 | 452 |
అరుణాచల్ ప్రదేశ్ | 3,649 | 4,065 |
నాగాలాండ్ | 1,225 | 1,315 |
మణిపూర్ | 2,212 | 2,391 |
మిజోరామ్ | 785 | 817 |
త్రిపుర | 856 | 870 |
మేఘాలయ | 5,629 | 6,023 |
అసోం | 25,590 | 26,247 |
పశ్చిమ బెంగాల్ | 40,889 | 40,783 |
ఝార్ఖండ్ | 32,620 | 32,615 |
ఒడిషా | 51,057 | 51,352 |
ఛత్తీస్‌గఢ్ | 20,378 | 20,308 |
మధ్యప్రదేశ్ | 55,842 | 55,392 |
గుజరాత్ | 18,509 | 18,544 |
డామన్ డయ్యూ | 23 | 26 |
దాద్రా నగర్‌హవేలీ | 71 | 70 |
మహారాష్ట్ర | 43,025 | 43,722 |
మధ్య ప్రదేశ్ | 28,000 | 28,123 |
కర్ణాటక | 29,193 | 29,483 |
గోవా | 369 | 359 |
లక్షద్వీప్ | 23 | 24 |
కేరళ | 1,384 | 1,364 |
తమిళనాడు | 16,780 | 16,317 |
పుదుచ్చేరి | 264 | 92 |
అండమాన్ నికోబార్ దీవులు | 547 | 547 |
భారత దేశ గ్రామ రకాలు[మార్చు]
రెవిన్యూ గ్రామం[మార్చు]
భారతదేశంలో భూమి సర్వే జరిగినపుడు, కొన్ని సర్వే ప్రాంతాలను అక్కడ వున్న జనావాసంపేరుతో రెవిన్యూ గ్రామంగా నిర్ణయించారు. అంటే ప్రభుత్వం ఆదాయం లెక్కకు నిర్దేశించినదన్నమాట.
గ్రామపంచాయితీ[మార్చు]
పంచాయితీరాజ్ స్వపరిపాలన వ్యవస్థలో అట్టడుగు స్థాయి విభాగం గ్రామ పంచాయితీ, రెవిన్యూ గ్రామం పూర్తిగా గాని లేక కొంతవరకు మిగతా రెవిన్యూ గ్రామాల భాగాలతో కలసి గాని, మండలంలో కొన్ని జనావాసాలను గ్రామపంచాయితీగా గుర్తిస్తారు.
శివారు గ్రామాలు[మార్చు]
రెవిన్యూ గ్రామానికి గాని గ్రామపంచాయితీకి గాని సమీపంలో నిర్దిష్టంగా జనావాసం వుంటే దానిని శివారు గ్రామమంటారు. వీటిలో జనసంఖ్య, ఇళ్లు తక్కువగా వుంటాయి.neyamndanguta
నిర్జన గ్రామం[మార్చు]
కొన్ని రెవిన్యూ గ్రామాలుగాని గ్రామ పంచాయితీలు గాని, విపత్కర పరిస్థితులలో లేక కొన్ని ప్రజోపయోగ ప్రాజెక్టుల( ఉదా:జలాశయం నిర్మించినపుడు ముంపుకు గురయ్యే గ్రామాలు) కొరకు ఖాళీ చేయబడతాయి. వాటిని నిర్జన గ్రామాలంటారు.
ఇతర దేశాలలో గ్రామాలు[మార్చు]
- ఫిలిప్పీన్స్
ఫిలిప్పీన్స్ నగర ప్రాంతాలలో "village" అన్న పదాన్ని ప్రైవేటుగా నిర్మించిన గృహ సముదాయానికి అధికంగా వాడుతారు (గేటెడ్ కమ్యూనిటీలు). ఒకప్పుడు బాగా స్థితిమంతులైన వారి గృహాల సముదాయాలుగా ఆవిర్భవించిన ఈ జీవన విధానం ఇప్పుడు మనీలా వంటి నగరాలలో సర్వ సాధారణమైంది.
- తైవాన్
తైవాన్‌లో నగరాలలో ఉపభాగాలను గ్రామాలు లేదా tsuen (村) అని వ్యవహరిస్తారు (ఇవి గ్రామీణ ప్రాంతాలలో ఉంటే). అదే గ్రామాలు నగరాలలో ఉంటే వాటిని (鄉) li (里 లేదా 鎮) అని అంటారు..
- వియత్నాం
లాంగ్ ("làng")̲ అనబడే వియత్నాం గ్రామం వారి సమాజంలో మౌలికమైన యూనిట్. ఆసియాలోని పలు గ్రామాలవలె వియత్నాం గ్రామాలు అధికంగా వ్యవసాయాధారితమైనవి. సాధారణంగా ప్రతి వియత్నాం గ్రామానికి ఒక మెయిన్ గేటు (వెదురు గడలతో చేసినది -"lũy tre"), ఒక కమ్యూనిటీ హాలు ("đình làng" ఇక్కడ ఆ వూరి దేవత "thành hoàng" పూజింపబడుతాడు) ఉంటాయి. వూరి వరి పొలం ("đồng lúa"), గుడి ("chùa") కూడా సాధారణం. దాదాపుగా ఒక వూరిలో వారందరూ రక్త సంబంధీకులై ఉండే అవకాశం ఉంది. గ్రామాల సంప్రదాయాలు వియత్నాం సమాజంలో (ప్రభుత్వ చట్టాలకంటే కూడా) బలమైనవి. "రాజుగారి శాసనం పల్లె పద్ధతులకు లొంగి ఉంటుంది" ("Phép vua thua lệ làng") అనేది వారి నానుడి. గ్రామంలో ప్రతి వ్యక్తీ తన మరణానంతరం ఆ గ్రామంలోనే ఖననం చేయబడాలని కోరుకుంటాడు.
- ఐరోపాలో
స్లావిక్ దేశాలు బోస్నియా-హెర్జ్‌గొవీనియా, బల్గేరియామ క్రొవేటియా, మేసిడోనియా, రష్యా, సెర్బియా, ఉక్రెయిన్ వంటి "స్లావిక్" దేశాలలో సెలో (Selo) అనే స్లావిక్ భాషాపదాన్ని గ్రామానికి వాడుతారు.

1926-1989 మధ్యకాలంలో రష్యాలో గ్రామీణ జనాభా 76 మిలియన్ల నుండి 39 మిలియన్లకు తగ్గింది. ప్రజలు నగర ప్రాంతాలకు తరలి పోవడం ఇందుకు ముఖ్య కారణం. 1930-37 మధ్య కాలంలో కరువు కారణంగా 14 మిలియన్ పేద గ్రామీణులు మరణించారని అంచనా[6].
చాలా మటుకు రష్యాలోని గ్రామాలు 200 లేదా అంతకంటే తక్కువ జనాభాను కలిగి ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న గ్రామాల్లోని ప్రజలే వలస వెళ్తుంటారు. ఉదాహరణకు 1959లో దాదాపు 50% గ్రామీణ జనాభా రష్యాలో 500 కంటే తక్కువ జనాభా కలిగిన గ్రామాల్లో నివాసం ఉండేది, ఇప్పుడు ఆ సంఖ్య 1/3 వంతు కంటే తక్కువగా ఉంటుంది. 1960లు మరియు 70లలో అధికారులు వ్యవసాయదారులను అతిచిన్న గ్రామాల నుండి కొంచెం పెద్ద గ్రామాలకు తీసుకునివెళ్ళి ఉపాధి కల్పించేవారు[7].
ఇతర దేశాలో లాగానే రష్యా గ్రామాలలో నివాసం ఉండేవారు అధికంగా వ్యవసాయం మీద ఆధారపడుతారు. ఎక్కువ మంది తమ ఆహారాన్ని తామే ఉత్పత్తి చేసుకొంటారు. ధనికులైన పట్టణ వాసుల రెండవ విశ్రాంతి గృహాలు ఎక్కువగా ఉన్న కొన్ని గ్రామాలు డచా సెటిల్‌మెంటులుగా ఆవిర్భవిస్తుంటాయి.
దక్షిణ రష్యాలోను, ఉక్రెయిన్‌లోను అధికంగా ఉన్న కొస్సాక్ జనుల జీవనం అక్కడి సారవంతమైన నేల వలన మిగిలిన ప్రాంతాల జీవనం కంటే భిన్నంగా ఉండేది. మిగిలిన ప్రాంతాలలో బలంగా ఉన్న భూస్వామి అధిపత్యం ఇక్కడ ఉండేది కాదు. కనుక వీరు సెర్ఫ్ విధానానికి లోబడేవారు కాదు. చిన్న చిన్నరైతులు తమ స్వంత పొలం 'ఖుతూర్'లో నివాసం ఉండేవారు. కాకస్ పర్వత శ్రేణుల ప్రాంతాలలోని అధికంగా ముస్లిమ్ జనాభా ఆవాసాలను ఆల్ లేదా ఇదెల్ ఉరల్ అంటారు.
యునైటెడ్ కింగ్‌డమ్
ఇంగ్లాండ్‌లో ఎక్కువగా పల్లపు మైదాన ప్రాంతాలలో గ్రామాలు ఉన్నాయి. సాధారణంగా'గూడెం' (hamlet)లో చర్చి ఉండదు. గ్రామం (village)లో చర్చి ఉంటుంది. గ్రామం అని (పట్టణఁ కాదని) చెప్పడానికి ముఖ్యమైన లక్షణాలు - (1) వ్యవసాయ మార్కెట్ ఉండదు (2) టౌన్ హాల్, మేయర్ వంటి వ్యవస్థలు ఉండవు (3) హద్దులలో పచ్చని ప్రాంతాలు (పొలాల వంటివి) ఉంఠాయి (4) దగ్గరలోని పట్టణం లేదా నగరానికి ఈ గ్రామంపై ఏ విధమైన అధికారిక అజమాయిషీ ఉండదు. - అయితే ఈ లక్షణాలు చాలావరకు ఈ మధ్యకాలంలో మారుతున్నాయి.
ఫ్రాన్స్
ఫ్రాన్స్‌లోని గ్రామాలు కూడా పైన చెప్పిన ఇంగ్లాండ్ గ్రామాల లక్షణాలు కలిగి ఉంటాయి.
నెదర్లాండ్స్
ఆహార పదార్ధాల ఉత్పత్తి అధికంగా ఉన్న జిల్లాలలోని గ్రామాలు అధికంగా కృత్రిమమైన గుట్టలు (terps) పైని నిర్మించబడ్డాయి. (దేశంలో ఇవి పల్లపు ప్రాంతాలు గనుక). తరువాత "డైక్" నిర్మాణాలు వచ్చినాక ఈ విధానం మారింది..
లెబనాన్
ఎక్కువ గ్రామాలు పర్వతమయ ప్రాంతాలలో ఉన్నాయి. ఎక్కువ గ్రామాల పేర్లుఅరామిక్ భాష ఆధారంగా ఏర్పడినాయి. 18వ శతాబ్దం వరకు ఈ భాష లెబనాన్ పర్వత ప్రాంతంలో వాడబడేది[8]. ఎక్కువ గ్రామాలు " కదా (kadaa)" అనబడే జిల్లాలలోని ఉప విభాగాలు.
పసిఫిక్ దీవులు
పసిఫిక్ దీవులలోని చిన్న చిన్న జనావాసాలను (బయటి నుండి వచ్చిన) ఇంగ్లీషువారు గ్రామం అనేవారు. కొన్ని గ్రామాలు చాలా పెద్దవైనా పేరు మాత్రం అలాగే ఉంది. ఉదాహరణకు గ్వామ్ గ్రామం జనాభా 40,000 పైబడి ఉంది.
న్యూజిలాండ్
సంప్రదాయిక మావొరీ గ్రామం ఉదాహరణ పా. కొండపైన రక్షితమైన గ్రామం. నిర్మాణానికి అధికంగా దూలాళు వాడుతారు.
ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలో విలేజెస్ అనబడే చిన్న చిన్న జనావాసాలు అధికంగా ప్లాన్ చేయబడినవి. ఇవి పదవీ విరమణ చేసిన వారికి, వ్యాపారానికి, యాత్రికులకు - ఇలా ప్రత్యేక అవసరాలకు నిర్మించబడ్డాయి.
అర్జెంటీనా
ఎక్కువ గ్రామాలు పర్వతాలలో ఉన్నాయి. కొన్ని గ్రామాలు పర్యాటకులను ఆకర్షించడానికి అధికంగా ప్రసిద్ధం. ఉదాహరణ: లా కుంబ్రసిటా, విల్లా ట్రఫుల్, లా కుంబ్రె
యునైటెడ్ స్టేట్స్
అమెరికా లోని 20 రాష్ట్రాలలో [9] విలేజ్ (village) అనే పదాన్ని ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిన ఇన్‌కార్పొరేటెడ్ మునిసిపల్ గవర్నమెంట్ పాలనా వ్యవస్థ కలిగిన జనావాసాలను సూచించడానికి వాడుతారు. వివిధ రాష్ట్రాలలో 'గ్రామం' అన్న పదం జనసంఖ్య కంటే అక్కడి పాలనా వ్యవస్థను బట్టి వర్తించబడుతుంది. న్యూయార్క్ వంటి నగరాలలో ఒక గ్రామాంలోని ప్రజలు గ్రామానికి, నగరానికి కూడా చెందుతారు. అక్కడ నివసించేవారు గ్రామానికీ, నగరానికీ కూడా పన్నులు చెల్లిస్తారు. రెండింటి ఎన్నికలలోనూ వోటు వేస్తారు.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ http://www.answers.com/village&r=67
- ↑ http://www.google.co.uk/search?hl=en&safe=off&q=%22transient+villages%22&btnG=Search&meta=
- ↑ భారతీయ జన గణన వారి సమాచారం
- ↑ http://www.pibbng.kar.nic.in/feature1.pdf
- ↑ http://www.censusindia.net/results/2001census_data_index.html
- ↑ Robert Conquest (1986) The Harvest of Sorrow: Soviet Collectivization and the Terror-Famine. Oxford University Press. ISBN 0-19-505180-7.
- ↑ "Российское село в демографическом измерении" (Rural Russia measured demographically) (Russian లో). ఈ క్రింది పట్టిక రష్యా జనాభా లెక్కలను సూచిస్తుంది:
Census year 1959 1970 1979 1989 2002 Total number of rural localities in Russia 294,059 216,845 177,047 152,922 155,289 Of them, with population 1 to 10 persons 41,493 25,895 23,855 30,170 47,089 Of them, with population 11 to 200 persons 186,437 132,515 105,112 80,663 68,807 - ↑ http://almashriq.hiof.no/lebanon/400/410/412/elies_project/glimse_of_yesterday.html
- ↑ http://www.websters-online-dictionary.org/definition/english/vi/village.html#Definitions