Jump to content

విరుదునగర్ జిల్లా

వికీపీడియా నుండి
Virudhunagar district
விருதுநகர் மாவட்டம்
District
Srivilliputtur Andal Temple Tower
Srivilliputtur Andal Temple Tower
Location in Tamil Nadu, India
Location in Tamil Nadu, India
Country India
రాష్ట్రంతమిళనాడు
Taluks8
Panchayat Unions (Blocks)11
Municipalities7
ప్రధాన కార్యాలయంVirudhunagar
BoroughsAruppukkottai, Kariapatti, Rajapalayam, Sattur, Sivakasi, Srivilliputhur, Tiruchuli, Virudhunagar.
Government
 • CollectorT. N. Hariharan, IAS
భాషలు
 • అధికారTamil
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
626xxx
టెలిఫోన్ కోడ్04562
ISO 3166 code[[ISO 3166-2:IN|]]
Vehicle registrationTN-67,TN-84[1]
Central location:9°35′N 77°57′E / 9.583°N 77.950°E / 9.583; 77.950

విరుదునగర్ జిల్లా, దక్షిణ భారతదేశం, తమిళనాడు రాష్ట్రం లోని జిల్లాలలో విరుదునగర్ జిల్లా ఒకటి. ఈ జిల్లాకు విరుదునగర్ ప్రధాననగరంగా ఉంది. 1947లో రామనాథపురం జిల్లాలోని కొంత భూభాగం విభజించుట ద్వారా విరుదునగర్ జిల్లా రూపొందించబడింది. విరుదునగర్ జిల్లాను సాధారణంగా " కర్మవీరర్ కామరాజర్ జిల్లా "గా పిలువబడుతుంది.2011 నాటికి, విరుదునగర్ జిల్లాలో 19,42,288 జనాభా ఉంది, ప్రతి 1,000 మంది పురుషులకు 1,007 మంది స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. జిల్లాలో శివకాశి అత్యధిక జనాభాతో ఉన్న అతిపెద్ద నగరం.

భౌగోళికం

[మార్చు]

విరుదునగర్ జిల్లా ఉత్తర సరిహద్దులో శివగంగ జిల్లా, మదురై జిల్లా, దక్షిణం సరిహద్దులో తిరునెల్వేలి జిల్లా, టుటికార్న్ జిల్లా, దక్షిణా సరిహద్దులో రామనాథపురం జిల్లా, పడమర సరిహద్దులో కేరళ రాష్ట్రం, వాయవ్య సరిహద్దులో థేని జిల్లాలు ఉన్నాయి.

జనాభా గణాంకాలు

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19015,84,278—    
19116,54,862+1.15%
19216,91,149+0.54%
19317,39,064+0.67%
19417,68,137+0.39%
19518,59,840+1.13%
19619,72,288+1.24%
197111,51,449+1.71%
198113,40,907+1.53%
199115,65,037+1.56%
200117,51,301+1.13%
201119,42,288+1.04%
ఆధారం:[2]
మతాలు ప్రకారం విరుదునగర్ జిల్లా జనాభా
మతం శాతం (%)
హిందూ
  
93.84%
క్రైస్తవులు
  
3.47%
ముస్లిం
  
2.46%
ఇతరులు
  
0.23%

2011 జనాభా లెక్కల ప్రకారం, విరుదునగర్ జిల్లా జనాభా 19,42,288,[3] upభారత జనాభా లెక్కలు 2001 లెక్కలు ప్రకారం 17,51,301 జనాభా ఉన్న నగరం 2011 నాటికి దాదాపు 11% పెరుగుదలతో 19,42,288 మంది జనాభాకు పెరిగింది,[4] or లింగ-నిష్పత్తి ప్రతి 1,000 మంది పురుషులకు 1,007 మంది స్త్రీలు ఉన్నారు, జాతీయ సగటు 929 కంటే చాలా ఇది చాలా ఎక్కువ ఉంది,[3] కానీ 2001 లింగ నిష్పత్తి 1,012తో పోల్చగా తగ్గింది.[4] మొత్తం జనాభాలో 197,134 మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు, 10,0,827 మంది పురుషులు ఉండగా, 96,307 మంది స్త్రీలు ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు వారు 20.59% మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలు జనాభా 0.12% మంది ఉన్నారు. జిల్లా సగటు అక్షరాస్యత 72.02%, ఇది దాదాపు జాతీయ సగటు 72.99% తో సమంగా ఉంది.[3]జిల్లాలో మొత్తం 537,748 గృహాలు ఉన్నాయి. మొత్తం జనాభాలో 9,50,158 మంది కార్మికులు ఉన్నారు, వీరిలో 52,361 మంది సాగుదారులు, 1,68,174 మంది ప్రధాన వ్యవసాయ కార్మికులు, 30,292 మంది గృహ పరిశ్రమలపై ఆధారపడినవారు, 6,03,239 ఇతర కార్మికులు, 96,092 ఉపాంత కార్మికులు, 4,792 ఉపాంత కార్మికులు ఉన్నారు.[5]

నిర్వహణ

[మార్చు]

విరుదునగర్ జిల్లా రెండు రెవెన్యూ విభాగాలుగా విభజించబడింది. విరుదునగర్ జిల్లాలో 8 తాలూకాలు ఉన్నాయి. అవి వరుసగా: అరుప్పుకోట్టై, కరియపట్టి, రాజపాళయం, సాత్తూరు, శివకాశి, శ్రీవిల్లిపుత్తూరు, తిరుచ్చి, విరుదునగర్. జిల్లాలో మొత్తం 600 గ్రామాలు ఉన్నాయి. అలాగే 9 పట్టణ పంచాయితీలు ఉన్నాయి. అవి వరుసగా సైదూరు, వతిరైరుప్పు, చెట్టియార్పట్టి, కరియపట్టి, మంసపురం, సుందరపాండియం, మల్లాంకిణరు, ఎస్.కొడికుళం, వి.పుదుపట్టి. విరుదునగర్ జిల్లాలో ఒక పార్లమెంటు నియోజకవర్గం ఉంది.

ఆర్ధికం

[మార్చు]

భారతదేశం మొత్తంలో విరుదునగర్ జిల్లా అగ్గిపెట్టల, టపాసులతయారీకి, ప్రింటింగ్ పరిశ్రమలకు ప్రసిద్ధిచెందింది. ఈ పరిశ్రమలు శివకాశి లోపల, సమీప పరిసరాలలో కేంద్రీకృతమై ఉన్నాయి. నువ్వుల నూనె, చికరీ, కాఫీ గింజలు, ఎండుమిరప, పప్పుధాన్యాల వ్యాపారానికి విరుదునగర్ జిల్లా ప్రధానకేంద్రంగా ఉంది. జిల్లాలో వ్యాపారాణుగుణంగా విరుదునగర్‌లో ఒక సరుకుల గిడ్డంగి, రాజపాళయంలో ఒక సరుకుల గిడ్డంగులు ఉన్నాయి. విరుదునగర్ జిల్లలో జిన్నింగ్, ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లులు, పవర్‌లూములు, చేనేత పరిశ్రమలు ఉన్నాయి. వస్త్రపరిశ్రమకు కోయంబత్తూరు తరువాత స్థానంలో జిల్సా లోని రాజపాళయం ఉంది. మద్రాసు సిమెంటు ఒక శాఖ జిల్లా లోని ఆర్.ఆర్ నగరులో ఉండగా, రెండవది శివకాశి తాలూకా లోని ఆలంకుళంలో ఉంది.

మూలాలు

[మార్చు]
  1. www.tn.gov.in
  2. Decadal Variation In Population Since 1901
  3. 3.0 3.1 3.2 "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  4. 4.0 4.1 "Census of India 2001: Basic Data Sheet: District Virudhunagar" (PDF). Registrar General & Census Commissioner, India. Archived (PDF) from the original on 25 September 2012.
  5. "Census Info 2011 Final population totals - Virudhunagar district". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.

వెలుపలి లింకులు

[మార్చు]