నువ్వుల నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొక్క
పువ్వు
కాయలు
తెల్ల నువ్వులు

నువ్వుల నూనె (Sesame oil or gingelly oil or til oil) నూనె గింజలైన నువ్వుల నుండి తయారవుతుంది. నువ్వుల శాస్త్రీయ నామం : సెసమమ్ ఇండికం (sesamum indicum. L) ఇది పెడాలియేసి[1] (Pedaliacae) కుటుంబంలో సెసమమ్ (Sesamum) ప్రజాతికి చెందినది. నువ్వులను సంస్కృతంలో 'తిల ' (Til) అంటారు. తిలనుండి వచ్చినది కావడంవలన 'తైలం' అయినది. నూనె అనేపేరు మూలద్రావిడంలోని 'ఎన్న', 'ఎన్నై' నుండి తెలుగులో నూనెగా మారింది. కన్నడలో నూనెను 'ఎణ్ణె' అంటారు.

చరిత్ర[మార్చు]

నువ్వుల పంటను వ్యవసాయపంటగా 5వేల సంవత్సరాలక్రితమే పండించినట్లు తెలుస్తున్నది.3600 క్రితమే మందుల (medicine) తయారిలో ఈజిప్టువాడినట్లు తెయుచున్నది.పురాతన బాబిలోన్ మహిళలు నువ్వులనూనెను, తేనెతోకలిపి సౌందర్యలేపనాలు చేసెవారు[2].దీని పుట్టుక మూలాలు వెస్ట్ ఇండిస్ .క్రీ.పూ.3000 సంవత్సరాలనాడే దీనిని వాడిన దాఖాలాలు ఉన్నాయి.5 వేల సంవత్సరాలక్రితం నువ్వులనూనెతో కాగడాలను వెలిగించుటకు ఉపయోగించడమే కాకుండగా దాని మసితో సిరాను తయారు చేసెవారు[3] సింధు లోయ నాగరికత (sindhu valley civilization) కాలంనాటికి అప్పటి ప్రజలు నువ్వుల నూనెను వాడేవారు. మానవుడు మొదటగా నువ్వులనుండె నూనెను తీసివాడటం ప్రారంభించినట్లు తెలుస్తున్నది. వేదాలలోకూడ నువ్వుల ప్రస్తావన ఉంది. నువ్వులనుండి గానుగ ద్వారా నూనెను తీయువారు తిలకల వాళ్లుగా పిలవబడి కాలక్రమేన తెలికల వాళ్ళుగా మారారు. తెలికల కులానికి చెందినవారు గానుగలద్వారా నూనెనుతీయటం తమ వృత్తిగా అక్కడక్కడ గ్రామాలలో ఉన్నారు. క్రీ. పూ.600 నాటికి సింథులోయ నుండి మెసొపొటేమియాకు వ్యాప్తి చెందినది. సింథులోయ ప్రాంతం నుండే నువ్వులు మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందినవి.

మొక్క[మార్చు]

నువ్వు మొక్క ఉష్ణమండలప్రాంతంలో బాగా పెరిగే మొక్క.ఏకవార్షికం.పంటకాలం 90-120 రోజులు.పంటకాపుకొచ్చుసమయంలో మంచు ఉండరాదు.100Cఉష్ణోగ్రతలో కూడా తత్తుకొని పెరుగ గల్లినప్పటికి 25-270C మధ్య వాతావరణ ఉష్ణోగ్రతవుండటం మంచిదిగుబడికి అవసరం.చెట్టు 2000 మి.మీ ఎత్తువరకు పెరుగుతుంది.ఒకచెట్టునుండి 50 నుంచి100 గింజల దిగుబడి వస్తుంది[4]. నువ్వులలో మూడు రకాలున్నాయి, అవి నల్లని, తెల్లని, మరియు కపిలవర్ణం (ఎరుపు) నువ్వులు.మొక్కరకాన్ని బట్టి పూలరంగులో వ్యత్యాసం వుండును.నువ్వులమొక్కపొదవలె గుబురుగా నిటరుగా పెరుగుతుంది.పూలు పింకు లేదా తెల్లగా వుంటాయి.కాయలు కుళ్ళాయి/గొట్టం ఆకారంలో వుండి, లోపలవిత్తనాలు వరుసగా పేర్చబడివుండును.

నూనెలోని సమ్మేళనాలు[మార్చు]

నువ్వుల నూనె లోని కొవ్వుఆమ్లాలు[5]

కొవ్వు ఆమ్లం కార్బనులసంఖ్య కనిష్ఠం గరిష్ఠం
పామిటిక్ ఆమ్లం C16:0 7.0 % 12.0 %
పామిటొలిక్ ఆమ్లం C16:1 trace 0.5 %
స్టియరిక్ ఆమ్లం C18:0 3.5 % 6.0 %
ఒలిక్ ఆమ్లం C18:1 35.0 % 50.0 %
లినొలిక్ ఆమ్లం C18:2 35.0 % 50.0 %
Linolenic C18:3 trace 1.0 %
Eicosenoic C20:1 trace 1.0 %

నువ్వుల నూనె భౌతిక ధర్మాలు[మార్చు]

నూవులనూనె[6] యొక్క భౌతిక ధర్మాల విలువలు స్థిరంగా వుండవు.మొక్కరకం, నేలస్వాభావం, వాడిన ఎరువులరకం, మొతాదును బట్తి భౌతికగుణలలో తేడా వుండును.నూనెయొక్క సాంద్రత 250Cవద్ద 0.916 నుండిం.921, సపోనిఫికెసను సంఖ్య 188-1993 వరకు, వక్రీభవనగుణకం1.4763 (250Cవద్ద) వుండును.నూనెద్రవీభవన ఉష్ణోగ్రత 21నుండి31.50C, మరి రిచర్డ్ మెస్సెల్ విలువ 1.2 వుండును[7]

భౌతిక ధర్మాల పట్టిక (సరాసరి విలువలు)

లక్షణము విలువల మితి
సాంద్రత 0.915-0.919
వక్రీభవన సూచిక (400C) వద్ద 1.4645-1.4665
సపొనిఫెకెసన్ విలువ 188-193
ఐయోడిన్ విలువ 103-120
అన్‌సపొనిఫియబుల్‌ పదార్థం 1.5-2.0%
బెల్లియరు టర్బిడిటి (గరిష్ఠం) 220C

పోషక విలువలు[మార్చు]

Oil, sesame, salad or cooking
పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి 880 kcal   3700 kJ
పిండిపదార్థాలు     0.00 g
కొవ్వు పదార్థాలు100.00 g
- సంతృప్త  14.200 g
- ఏకసంతృప్త  39.700 g  
- బహుసంతృప్త  41.700 g  
మాంసకృత్తులు 0.00 g
విటమిన్ సి  0.0 mg0%
విటమిన్ ఇ  1.40 mg9%
విటమిన్ కె  13.6 μg13%
కాల్షియమ్  0 mg0%
ఇనుము  0.00 mg0%
మెగ్నీషియమ్  0 mg0% 
భాస్వరం  0 mg0%
పొటాషియం  0 mg  0%
సోడియం  0 mg0%
శాతములు, అమెరికా వయోజనులకు
సూచించబడిన వాటికి సాపేక్షంగా
Source: USDA పోషక విలువల డేటాబేసు

ఉత్పత్తి[మార్చు]

ప్రపంచంలో 65 దేశాలు నువ్వులను పండిస్తున్నాయి. సంవత్సరముకు 30-40 లక్షలటన్నుల నువ్వులు ఉత్పత్తి కాగా, అందులో భారతదేశం వాటా 6-8 లక్షల టన్నులు (20%). ప్రపంచం మొత్తం మీద 75 లక్షల హెక్టేరులలో నువ్వుల పంట సాగు అవుతున్నది. భారతదేశంలో 17 లక్షల హెక్టేరులలో సాగు అగుచున్నది. ప్రపంచంలో నువ్వులను అధికంగాపండించు యితర దేశాలు, చైనా (20%), మయన్మారు (17%), సూడాన్ (5.5%), ఉగాండా (5.0%), నిగెరియ, పాకిస్తాన్, బంగ్లాదేశ్. భారతదేశం నుండి సంవత్సరానికి 2.5-3.0 లక్షల టన్నుల నువ్వులు ఎగుమతి అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1.6 లక్షల హెక్టేరులలో నువ్వులపంట సాగులో ఉంది.

ఉపయోగాలు[మార్చు]

నువ్వులనూనెను కేవలం వంటనూనెగానే కాకుండ, దేహమర్దన తైలంగా, ఆయుర్వేదమందులలో, కాస్మాటిక్స్‌ తయారీలో వాడెదరు. పసిబిడ్డకు (నెలల పిల్లలు) మొదట నువ్వుల నూనెతో మర్దన చేసి, ఆ తరువాత స్నానం చేయించడం ఇప్పటికీ గ్రామాలలో చూడవచ్చును. ఆంతేకాదు, ప్రసవానంతరం,15-20 రోజులవరకు బాలింతరాలికి నువ్వులనూనె, నువ్వులతో చేసిన పదార్థాలు ఆహారంగా యిస్తారు. పుష్కర సమయంలో, కర్మక్రియలలో, గ్రహదోష నివారణపూజలు చేసినప్పుడు బ్రాహ్మణులకు నువ్వులను దానంగా యిస్తారు. దేవాలయాలలో, ముఖ్యంగా శనేశ్వర ఆలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యడం ఆచారం.

  • నువ్వులనూనె దేహచర్మానికి మెరుపునిచ్చును, కాన్సరు నిరోధకతత్వమున్నది.కీళ్ళనుప్పులకు మర్ధనతైలంగా పనికివచ్చును. నువ్వులనూనెలో సెసమొల్ (sesamol), మరియు సెసమిన్ (sesamin) ఉన్నాయి. సెసమిల్ "రక్త వత్తిడి" (Blood pressure) ని తగ్గించును[8] . వనస్పతి (డాల్డా) లో తప్పని సరిగా 10% వరకు నువ్వులనూనెను ఉపయోగించాలని ప్రభుత్వ నూనెల-వనస్పతి శాఖ-కల్తీ నిరోధకవిభాగం నిబంధన ఉంది. నువ్వులనూనెను ఏదైననూనెలో కల్తిచేసిన బౌవడిన్ టెస్ట్‌ (Baudouin test) ద్వారా గుర్తించవచ్చును. వనస్పతిని నెయ్యిలో కల్తిచేసిన, ఈ బౌవడిన్ టెస్ట్‌వలన గుర్తించవచ్చును.
  • నువ్వుల నూనె శక్తివంతమైన అంటీఅక్సిడెంట్ (అక్సికరణ నిరోధక తత్వం) గుణంకలిగువున్నదని పరిశోధనలో గుర్తించబడింది.[9].నువ్వులణునె దేహకణగోడలనుండి త్వరితంగా చొచ్చుకుపోయి రక్తప్రవాహంలో కలిసే తత్వం వుంది, రక్తంలో అధిక సాంద్రత కొలెస్టరును/లిపిడ్ (HDL) పెంచి, తక్కువ సాంద్రతవున్న కొలెస్టరును (LDL) తగ్గించును.
  • నువ్వుల నూనె ఒక సహజ సూర్యరశ్మిరక్షణిగాగా పనిచేస్తుంది.చుండ్రును తగ్గిస్తుంది.తలవెంట్రుకలకు మెరుపునిస్తుంది.[10]

మూలాలు[మార్చు]