పామిటిక్ ఆమ్లం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పామిటిక్ ఆమ్లం[1]
పేర్లు
IUPAC నామము
hexadecanoic acid
ఇతర పేర్లు
C16:0 (Lipid numbers), palmic acid
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [57-10-3]
పబ్ కెమ్ 985
SMILES CCCCCCCCCCCCCCCC(=O)O
ధర్మములు
C16H32O2
మోలార్ ద్రవ్యరాశి 256.42 g/mol
స్వరూపం White crystals
సాంద్రత 0.853 g/cm3 at 62 °C
ద్రవీభవన స్థానం 62.9 °C[2]
బాష్పీభవన స్థానం 351-352 °C[3]
215 °C at 15 mmHg
Insoluble
ప్రమాదాలు
జ్వలన స్థానం {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

పామిటిక్ ఆమ్లం (Palmitic acid, or hexadecanoic acid in IUPAC nomenclature) కొన్ని జంతువులలోను, మొక్కలలోను లభించే ఒకరకమైన సంతృప్త కొవ్వు ఆమ్లం.[2] దీని రసాయన ఫార్ములా : CH3 (CH2) 14CO2H. ఇది పామ్ కుటుంబంలోని మొక్కలనుండి లభించే పామాయిల్, పామ్ కెర్నెల్ నూనె, కొబ్బరి నూనెలలో అధికంగా ఉంటుంది. పామిటేట్ అనేది పామిటిక్ ఆమ్లం యొక్క ఎస్టర్లు.

పామాయిల్‌ 18 కార్బనులను కలిగివుండి, ద్విబంధాలు లేని, ఎటువంటి శాఖలు లేని, సరళ హైడ్రొకార్బను శృంఖలం కలిగివున్న మోనో కార్బలిక్ కొవ్వుఆమ్లం. అనీమొక్కల నూనెలు, జంతుకొవ్వు లలో తప్పనిసరిగా 3-50% వుండే సంతృప్త కొవ్వుఆమ్లం. ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త ఎడ్మండ్‌ ఫ్రెమ్ 1840లో మొదటిసారిగా ఈఆమ్లాన్ని పామ్‌ఫ్రూట్‌ నూనెలో గుర్తింఛాడు. ఫ్రెంచిలో 'పామిటిక్యూ' అనగా పామ్‌చెట్టు యొక్క స్రవం అని ఆర్థం.ఆవిదంగా ఈకొవ్వు ఆమ్లానికి పామిటిక్‌ ఆమ్లమనే పేరు సార్థకమైనది. పామిటిక్‌ ఆమ్లం స్పటిక, ఘనరూపంలో తెల్లగా లేదా పాలిపోయిన పసుపురంగులో వుండును.

పామిటిక్ ఆమ్లంయొక్క గుణాలు-ధర్మాలు[మార్చు]

అణుఫార్ములా: CH3 (CH2) 14COOH

పామిటిక్‌ఆమ్లం యొక్క కొన్ని లక్షణాలు

స్వభావం విలువ మితి
ఎంపిరికల్‌ ఫార్ములా CnH2nO2
ఆణుఫార్ములా C16H32O2 (ఎంఫిరికల్)
సపోనిఫికెసన్‌ విలువ 205-2210C
బాష్ప పీడనం 10.0mm/Hg @2100C
ఫ్లాష్ ఉష్ణోగ్రత 114.40C
అణుభారం 258.27

లిపొజెనెసిస్ చర్యలో ఎసెటైల్ కొ-ఎంజైమ్‌ A (acetyl CoA) వలన ఏర్పడు మొదటికొవ్వు ఆమ్లం పామిటిక్ ఆమ్లం. ఆతరువాత అసెటైల్ కో-ఎంజైమ్‌A రెండుకార్బను సమూహలను (carbon groups) లను చేర్చుతూ పోవడంవలన మిగతా కొవ్వుఆమ్లాలు ఏర్పడును. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తన పరిశోధన నివేదికలో పామిటిక్‌ ఆమ్లంవున్న నూనెలను అధికంగా తీసుకోవడంవలన హృదయ సంబంధిత (cardiovascular) వ్యాదులకు త్వరగాగురై ఆవకాశమున్నదని చెప్పింది. కాని మరికొందరుచేసిన పరిశోధన సమాచారం ప్రకారం లినొలిక్ ఆమ్లంతో పాటు (పామిటిక్ ఆమ్లం% కన్న లినొలిక్‌ ఆమ్లం 4.5% ఎక్కువగా వుండాలి) తీసుకున్న ప్రమాదం అంతగాలేదని తెల్చాయి.

పామిటిక్‌ ఆమ్లాన్ని కలిగివున్న కొన్నినూనెలు/కొవ్వులు

నూనె శాతం నూనె శాతం
పామాయిల్ 45-50 కొకో బట్టరు 25-27
పత్తిగింజల నూనె 23-26 ఇప్పనూనె 24-25
తవుడు నూనె 15-20 నువ్వుల నూనె 10-12
వేప నూనె 16-30 వేరుశనగ నూనె 10-12
పామ్‌కెర్నల్‌ నూనె 8-10 Linseed నూనె 6-8
కుసుమ నూనె 2-10 పొద్దుతిరుగుడు నూనె 3.0-10.0
ఆవాల నూనె 3.0-3.5 ఆముదం 1.0-2.0
మామిడిపిక్కనూనె 5-6 Lard, tallow 25-40
కొబ్బరి నూనె 6-7 మొక్కజొన్ననూనె 10-15

వినియోగము[మార్చు]

  • సబ్బుల తయారిలో, ముఖ్యంగా బేబి ఆయిల్స్, బాత్‌ ఆయిల్స్, హైర్‌ కండిసనర్స్, మాయిచ్చరైజరుల తయారిలో వినియోగిస్తారు.
  • కొవ్వొతుల తయారిలో, ఆయింట్‌మెంట్స్ లో వినియోగిస్తారు.
  • పామిటిక్‌ ఆమ్లమును యాంటి సైకొటిక్‌ మందుల ఉత్పత్తులలో (స్కిజోప్రెనియ నివారణ) వాడెదరు.
  • ఐసోప్రొపైల్‌ పామియెట్ (ప్రొపైల్‌ ఆల్కహల్మల్,, పామిటిక్‍ ఆమ్లం సమ్మేళనం) ను చర్మ సంరక్షణ ఉత్పత్తులలో వాడెదరు.
  • రెట్‍నైల్‌ పామిటేట్ (Retnyl pamitate) ను యాంటిఆక్సిడెంట్‌ (anti oxidant) గా వినియోగిస్తారు.

మూలాలు[మార్చు]

  1. Merck Index, 12th Edition, 7128.
  2. 2.0 2.1 Beare-Rogers, J.; Dieffenbacher, A.; Holm, J.V. (2001). "Lexicon of lipid nutrition (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 73 (4): 685–744. doi:10.1351/pac200173040685.
  3. Palmitic acid at Inchem.org