ఇప్పనూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇప్పచెట్టు
ఇప్ప కాయ
ఎండిన ఇప్ప పూలు

ఇప్పచెట్టు సపోటేసి కుటుంబానికి చెందినచెట్టు. వృక్షశాస్త్రనామం మధుక లాంగిపొలియా,, మ.ఇండిక [1]. ఇది ఎక్కువగా ఉష్ణమండల అడవులు, బయలు, మైదాన భాగల్లో పెరుగును. భారతదేశంలో జార్ఖండ్, బీహరు, ఉత్తర ప్రదేశ్ , మధ్యప్రదేశ్‌, కేరళ, గుజరాత్‌, ఒడిస్సా అడవులలో విస్తారంగా ఉన్నాయి. ఎడాదికి ఒకచెట్టు నుండి 60-80 కే.జి.ల విత్తనాలు దిగుబడి వచ్చును. పూలయినచో 100-150 కే.జి.లు లభించును. పూలనుండి ఇప్పసారా తయారు చేయుదురు. గింజలనుండి ఇప్పనూనె (Mahua oil) తీయుదురు. గింజలలో పిక్కలు 70% వుండును. గింజ నుండి అయినచో 50%, పిక్కల నుండి ఆయినచో 45-50% వరకు నూనె వుండును. ఒక గింజలో రెండుపిక్కలు వుండును. ఇప్పగింజ 3-4 సెం.మీ. పరిమాణంలో వుండును. గింజ అండాకారం గావుండి ఒక వైపు చదునుగా వుండి, రెండోవైపు ఉబ్బెత్తుగా వుండును. పిక్కసైజు 25X17.5 మి.మీ.వుండును. గింజనుండి నూనెను రోటరిమిల్‌, ఆయిల్‌ మిల్ (ఎక్సుపెల్లరు), సాల్వెంట్‌ ప్లాంట్‌ ద్వారా సంగ్ర హించెదరు. సాధారణంగా గింజల ద్వారా రోటరిమిల్‌ ఎక్సుపెల్లరుల ద్వారా నూనెను తీసిన తరువాత ఇప్పకేకు నుండి సాల్వెంట్‌ ప్లాంట్‌ద్వారా నూనెను తీయుదురు. ఇప్పనూనెను వంటనూనెగా వాడటం అరుదు. గిరిజనులు కొద్దిమొత్తంలో ఇప్పనూనెను తీసి వాడుకుంటారు [2] . తాజా గింజల నుండి తీసిన నూనెలో ఫ్రీఫ్యాటిఆమ్లాల శాతం 1.0-2.0% వరకు వుండి పసుపు రంగులో వుండును. కాని ఎక్కువగా కాలం నిల్వవుంచిన, ఫంగసు సోకిన, పాడైపోయిన విత్తనాల నుండి తీసిన నూనెలో ఫ్రీఫ్యాటి ఆమ్లాల శాతం 20-35% వరకు వుండి ఆకుపచ్చలేదా నీలపు ఛాయవున్న పసుపు రంగులో వుండును. ఇప్పనూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు 50% మించి వున్నందున సాధారణ, వాతావరణ ఉష్ణోగ్రతలో కూడా ఘనీభవించును.

నూనె లక్షణాలు[మార్చు]

ఇప్పనూనెలోని కొవ్వు ఆమ్లాలు, వాటి నిష్పత్తి శాతం,, భౌతిక లక్షణాల పట్టికలు [3]

కొవ్వు ఆమ్లంపేరు కార్బనులసంఖ్య, బంధాలు శాతం
పామిటిక్‌ ఆమ్లం C16:0 16-28.2
స్టియరిక్ ఆమ్లం C18:0 20-22.5
అరచిడిక్ ఆమ్లం C20:0 0-3.3
ఒలిక్ ఆమ్లం C18:1 41.0-51.0
లినొలిక్ ఆమ్లం C18:2 8.9-1.7

ఇప్పనూనె భౌతికగుణాల పట్టిక[3]

నూనె భౌతిక లక్షణాలు మితి
వక్రీభవనసూచిక 1.452-1.462
సాంద్రత 0.856-0.870
ఐయోడిను విలువ 58-70
సపోనిఫికెసను నంబరు 187-196
అన్‌ సపోనిఫీయబుల్‌ పదార్దము 1.0-3.0%
ఫ్లాష్‌ పాయింట్ 2380C
 • ఐయోడిన్‌విలువ:ప్రయోగశాలలో 100 గ్రాముల నూనెచే గ్రహింపబడు ఐయొడిన్‌ గ్రాముల సంఖ్య.ప్రయోగ సమయంలో కొవ్వు ఆమ్లాల ద్విబంధమున్న కార్బనులతో ఐయోడిను సంయోగంచెంది, ద్విబంధాలను తొలగించును.ఐయోడిన్‍ విలువ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఏమేరకు నూనెలోవున్నది తెలుపును.
 • సపొనిఫికెసను విలువ:ఒక గ్రాము నూనెలోని ఫ్యాటిఆసిడులను సబ్బుగా (saponification) మార్చుటకు కావలసిన పోటాషియంహైడ్రాక్సైడ్, మి.గ్రాంలలో.
 • అన్‌సపొనిఫియబుల్‌మేటరు:పోటాషియం హైడ్రాక్సైడుతో సపొనిఫికెసను చెందని నూనెలోవుండు పదార్ధాలు.ఇవి అలిపాటిక్‌ఆల్కహల్‌లు, స్టెరొలులు, హైడ్రొకార్బనులు, రంగునిచ్చుపదార్థాలు (pigments), రెసినులు.

ఇప్పగింజల కేకు[మార్చు]

ఇప్పగింజల నుండి రోటరి లేదా ఎక్సుపెల్లరుల ద్వారా నూనె తీసినచో అయిల్‌ కేకు (mahua cake) లో 10-13% వరకు నూనె వుండిపోవును. ఆయిల్‌ కేకులో వుండిపోయిన నూనెను సాల్వెంట్‌ప్లాంట్‌లో ప్రాసెస్‌ చేసి నూనెను తీయుదురు. సాల్వెంట్‌ ప్లాంట్‌లో కేకులోని మొత్తం నూనెను పొంద వచ్చును. సాల్వెంట్‌ ప్లాంట్‌లో నూనెతీసిన తరువాత వచ్చు కేకును డిఆయిల్డ్‌ కూకు/మీల్‌ అంటారు. 0.5-1.0% నూనె మాత్రమే డిఆయిల్డ్‌ కేకులోవుండును. ఇప్పకేకులో నత్రజని 3.5% వరకు ఉంది. కేకులో సపొనిన్ వున్న కారణంగా ఇప్పచెక్కను దాణాగా పనికిరాదు. ఇప్పచెక్కను ఎరువుగా సేంద్రియ ఎరువుతో కలిపి వుపయోగించవచ్చును. ఇప్పకేకులో క్రిమి, కీటకవాశక,, పీడల నివారణ లక్షణగుణాలు పుష్కలంగా ఉన్నాయి. అమ్మోనియం సల్పెట్‌తో కలిపి ఎరువుగా వాడవచ్చును. గోల్ప్‌, గ్రాస్‌ టెన్నిస్‌లాన్‌లోని పచ్చికలోని క్రిమి, కీటక నివారణకు వుపయోగిస్తారు. చేపల చెరువులలో చేపలను పెంచుటకు ముందు, చేరువులో ఇప్ప డిఆయిల్డ్‌ కేకును కలిపిన నీటిని నింపి, రెండుమూడు రోజులుంఛి, ఆతరువాత నీరును తోడి ఖాళి చేయుదురు. ఇందువలన చెరువు అడుగున, గట్లలోవుండే అంతకు ముందు పెంపకానికి చెందిన చేపలున్ననశించును.

ఇప్పకేకులోని పదార్థముల నిష్పత్తి పట్టిక

పదార్థం ఎక్సుపెల్లరుకేకు% సాల్వెంట్‌ప్లాంట్‌కేకు%
తేమ 7.0-11.0 8.0-10.0
నూనె 8.0-13 0.5-1.5
పీచు (fiber) 5.0-6.0 8.0-10.0
సపొనిన్ 4.6 6.0-8.0

ఉపయోగాలు[మార్చు]

 • 1. ఇప్పనూనెను వనస్పతి లో, సబ్బు[4] ల తయారిలో, కొవ్వుత్తుల తయారిలోవుపయోగిస్తారు.
 • 2. ఇంధనంగా వాడెదరు (దీపారాధనకు,, ఫర్నెస్ ఆయిల్) మారుమూల ప్రాంతాలలోని గ్రామీణ ప్రాంతాలలో దీపాలు వెలిగించటానికి, బయోడిజెల్‌ తయారిలో వాడెదరు.
 • 3. నూనెను చర్మరక్షణనూనెగా, కీళ్లనొప్పులకు మర్ధనతైలంగా, కేశసంరక్షణనూనెలలో వుపయాగిస్తారు.
 • 4. ఇప్పపూలనుండి ఆల్కహాల్‌ తయారుచెయుదురు[5] .

ఉత్పత్తి వివరాలు[మార్చు]

1999నుండి2009 వరకుజరిగిన ఇప్పనూనె, ఇప్పకేకు వివరాలు [6]

 • నూనెతీయుటకు వాడిన ఇప్పగింజలు :1, 36, 935 టన్నులు.
 • ఊత్పత్తి ఆయిననూనె

A. ఏడిబుల్ :15, 132 టన్నులు

B. నాన్‌ఎడిబుల్ :14, 114 టన్నులు

 • ఉత్పత్తిఅయిన ఇప్పకేకు :1, 06, 584 టన్నులు
 • ఎగుమతులు

A. ఆయిల్ కేకు :549 టన్నులు

B. ఇప్పనూనె :82 టన్నులు

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "ABOUT THE PLANT". jatrophabiodiesel.org. Retrieved 2015-03-06.
 2. "Alternative edible oil from mahua seeds". hindu.com. Archived from the original on 2007-10-01. Retrieved 2015-03-06.
 3. 3.0 3.1 "Mahua (Madhuca Indica)". svlele.com. Retrieved 2015-03-06.
 4. "Mahua Oil". herbalmandi.in. Retrieved 2015-03-06.
 5. "INTRODUCTION". jatrophabiodiesel.org. Retrieved 2015-03-06.
 6. Annual report,SEA,2008-09ఆధారంగా
"https://te.wikipedia.org/w/index.php?title=ఇప్పనూనె&oldid=3383971" నుండి వెలికితీశారు