సోయా నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోయా మొక్క
సోయా పువ్వు
సొయా దోరకాయలు
సోయాగింజలలోని రకాలు

సోయా చిక్కుడు మొక్క అపరాలకు చెందిన మొక్క. వృక్షకుటుంబం ఫాబేసి, ప్రజాతి గ్లైసీన్. మొక్క వృక్షశాస్త్రనామము: గ్లైసీన్ మాక్స్ భారతదేశములో సోయా చిక్కుడు పంట సాగు 1977 నుండి మొదలైనది. ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో ప్రయోగాత్మంగా సాగుచేసి, దిగుబడులు ఆశాజనకంగామ, ప్రోత్యాహకరంగా వుండటంతో ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో కూడా సాగు మొదలైనది.

ఇతరభాషలలో సోయా చిక్కుడు పేరు[మార్చు]

భారతదేశంలో ఈపంట సాగుచేయుచున్న రాష్ట్రాలు[మార్చు]

సొయా గింజలనుండి నూనెను సంగ్రహించు విధానము[మార్చు]

1910 కుముందు ప్రపంచంలోని వివిధ దేశాలలో సీయాగింజలనుండి నూనెను ఉత్పత్తి చెయ్యడం చాలామందకోడిగా జరిగేది.1910 తరువాత యురప్‌, జపాను దేశాలలో సాయానూనెను ఉత్పత్తిచెయ్యడం గణనీయంగా పెరిగింది.క్రీ.శ.1000నుండి1907 మధ్యకాలంలో తూర్పు ఆసియాదేశాలు ముఖ్యంగా మంచూరియామరియు చైనాలలో రాతి తిరుగళ్ళు (stone mills) తీసెడివారు.ఇలా తీసిన నూనెను ఎక్కువ శాతాన్ని వంటనూనెగా వాడేవారు.పిండిని పొలములలో ఎరువుగా ఉపయోగించెవారు. 1895 నుండి సాయా పిండిని జపానుకు ఎగుమతి చెయ్యడం మొదలైనది.సోయాగింజనుండి నూనెను తీయ్యడం, పశ్చిమదేశాలలో, ముఖ్యంగా ఇంగ్లాండులో 1907లో మొదలైనది[1]

సొయాబీన్సులో నూనె 18-24% వరకు వుండును.సోయా విత్తనాలలో మాంసకృత్తులు/ప్రోటిన్లు ఎక్కువశాతంలో ఉండును.పూర్తిగా నూనె తొలగించిన సోయా విత్తన పిండిలో 45% వరకు ఉందును.విత్తనాలలో 35-40% వరకు ప్రొటిన్లు ఉన్నాయి.మొక్కల ఉత్పత్తులలో ఎక్కువ ప్రోటిను ఉన్నది సోయాలో మాత్రమే[2] సాధారణంగా ఇతర నూనెగింజల నుండి (35-55%వరకు నూనెవున్న) నూనె తీయుటకు 'ఎక్స్‌పెల్లరులు'అనే యంత్రాలను వుపయోగిస్తారు. ఎక్ల్స్‌పెల్లరుల నుండి వచ్చు ఆయిల్‌కేకులో ఇంకనూ 6-10% వరలు ఆయిల్‌ వుండిపోవును. అందుచే సొయానుండి నూనెను ఎక్స్‌పెల్లరుల ద్వారా తీయుటకు ప్రయత్నించిన 10.0% వరకు నూనె పిండి (cake) లో వుండిపోవటం వలన కేవలం 9-10% వరకు మాత్రమే నూనెను ఉత్పత్తిగా పొందగలము. పిండిలో మిగిలివున్న నూనెకై పిండిని మరల సాల్వెంట్ ప్లాంటులో ఆడించ వలెను. అలా కాకుండగా 'సాల్వెంట్ ఎక్సుట్రాక్షను విధానంలో విత్తనంలోని మొత్తం నూనెను ఒకేసారి పొందవచ్చును. అందుచే సాల్వెంట్ ఎక్సుట్రాక్షను పద్ధతిలో సోయావిత్తనాల నుండి నూనె తీయుదురు[3]. సాల్వెంట్ ఎక్క్స్‌ట్రాక్షను పద్ధతిలో హెక్సెను అను హైడ్రొకార్బను సాల్వెంటుగా వాడెదరు. సాల్వెంట్ (ద్రావణి) అనగా ఎదైన ఘనలేదా ద్రవ పదార్థాన్ని తనలో కరగించుకొను స్వభావం ఉంది.హెక్సెనులో అన్ని శాకనూనెలు (vegetable oils) చాలా త్వరితంగా కరుగును. హెక్సెను తక్కువ బాయిలింగ్‌ పాయింట్‌కల్గి, నూనెలను బాగా కరగించుకొను లక్షణాలుండుటచే, హెక్సెనును సాల్వెంట్‌ ప్లాంట్లో నూనెను తీయు సాల్వెంట్‌గా వాడెదరు. సొయా నుండి ఎక్స్‌పెల్లరుల్ల ద్వారా నూనెనును తీసినచో 6-10% వరకు అయిల్‌, కేకులో వుండిపోవును. ఆందుచే సోయానుండి ఆయిల్‌ను సాల్వెంట్‌ప్లాంటు ద్వారా నూనెను తీయుదురు. సాల్వెంట్ ఎక్సుట్రాక్షను వలన సీడ్‌లోని నూనెను 98-98.5% వరకు పొందవచ్చును. సొయాసీడ్స్‌ని మొదట జల్లెడలో జల్లించి వాటిలోని మట్టి, పుల్లలు, చిన్నరాళ్లవంటి వాటిని తొలగించెదరు.

సీడు క్రాకరు(seed cracker)[మార్చు]

జల్లించిన సోయాసీడ్‌ను సీడ్‌క్రెకింగ్/బ్రేకింగ్ మిషిన్కు పంపెదరు. సీడ్‌క్రెకింగ్ మెషిన్లో వరుసకు రెండు చొప్పున రెండు వరుసలలో 4 రోలరులుండును. ఆ రోలరులు కాస్ట్ఐరనుతో చెయ్యబడి వుండును. రోలరులను తయారి సమయంలోనే వాటి ఉపరతలాన్ని కేస్‌ చిల్లింగ్ ద్వారా గట్టి (hard) చెయుదురు. ఒక వరుసలోని రోలరులను దగ్గరిగా బిగించి వుండును. ఈ రోలరుల మధ్యగా సోయాసీడ్స్ వెళ్లునప్పుడు రెండు బద్దలుగా, ముక్కలుగా చెయ్యబడును. క్రాకింగ్ చేసిన సోయా విత్తనాన్ని సీడుకుక్కరుకు పంపెదరు[4].

సీడ్‌ కుక్కరు (seed cooker)[మార్చు]

సీడ్‌కుక్కరు (విత్తనాలను ఉడికించి పాత్ర) రెండురకములుగా వుండును.

క్షితిజ సమాంతర గొట్టాలరకము: ఈరకంలో గొట్టంవంటి (tube like) నిర్మాణాలు ఒకదానిమీద మరొకటి క్షితిజసమాంతరంగా (horizontal) బిగించబడివుండును. ఒకగొట్టం/స్తూపాకారంనుంది మరో స్తూపాకారానికి విత్తనం వెళ్లూటకు ప్రతి స్తూపాకారపుగొట్టలో ఒక స్క్రూకన్వెయరు వుండి, అదితిరుగుతు ఒకగొట్టం లోని విత్తనసముదాయాన్ని మరోగొట్టం/స్తూపాకారంలో పడునట్లు చెయ్యూను. ఈ విధంగా అన్నిటికన్న పైనున్న గొట్టంలో ప్రవేశపెట్టబడిన విత్తనాలు క్రమముగా దిగువనవున్న గొట్టం చివరచేరును. ప్రతి స్తూపాకారభాగానికి వెలుపల మరో స్తూపాకారగొట్టం అతుకబడివుండును. దీనిని స్టీం జాకెట్ (steam jaket) అంటారు. వెలుపలి, లోపలి స్తూపాకార గొట్టంలమధ్య కొంతఖాళి వుండునట్లు ఈ జాకెటును అతికెదరు. ఈ జాకెట్‌ ఖాళిద్వారా స్టీం (steam=నీటి ఆవిరి) ని పంపి, గొట్టంలో ప్రయానించు విత్తానాలను 80-850C ఉష్ణోగ్రతవరకు వేడిచేయుదురు. కొంతమేర నేరుగా నీటిఆవిరిని విత్తనంలో కలిపి విత్తనం తేమశాతాన్ని 14-16% వరకు పెంచెదరు. అటుతరువాత ఈ విధంగా వేడిచెయ్యబడి (ఉడికించబడి), తేమశాతం పెంచబడిన విత్తనాలను ఫ్లెకరు యంత్రంనకు పంపెదరు.

నిలువు వుండె కుక్కరు : ఈ రకం సీడ్‌ కుక్కరు నిలువుగా, స్తుపాకారంగా వుండి, ఒకదాపై మరొకటి చొప్పున 4-6 కంపార్టుమెంటులుండి మైల్డ్ల్ స్టీల్‌తో చెయ్యబడివుండును. కంపార్టుమెంట్లలోని విత్తనాలను కలియతిప్పుటకై నిలువుగా, మధ్యలో ఆజిటెటరు వుండి, దానికి ప్రతి కంపార్టుమెంటులో రెండు స్వీపింగ్ ఆర్మ్స్ వుండును. ప్రతి కంపార్టుమెంటు నుండి మరో కంపార్టుమెంటుకు విత్తనాలు వెళ్లు విధంగా డొరు, ఫ్లొట్ లుండును. సొయాసీడ్స్ను వేడిచెయ్యుటకై కాంపార్టుమెంట్ల అడుగున హీటింగ్‌ జాకెట్లుండును. హీటరు జాకెట్కు స్టీమునిచ్చి కంపార్టుమెంటులలోని విత్తనాలను వేడి చెయ్యుదురు. విత్తనం లోనిని తేమను పెంచుటకై ఒపను స్టీము యిస్తారు. కుక్కరులో సోయావిత్తనాలను 85-900C వరకు వేడిచెయ్యుదురు. కుక్కరులో కుక్కింగ్ అయిన విత్తనాలను తరువాత ఫ్లెకింగ్‌మెషిన్‌కు పంపించెదరు.

సొయా సీడ్స్ ఫ్లెకరు (Flaker)[5][మార్చు]

ఫ్లెకరులో కుడా రెండు రోలరులుండును. వీటి ఉపరతలం నునుపుగా వుండును. పొడవు 1.0-1.5 మీ. వుండి, వ్యాసం 300-500 మి.మీ.వుండును. రోలరుల ఉపరితలమును కాస్ట్ హర్డనింగ్‌ చెయుదురు. రోలరుల మధ్య ఖాలీ 0.3-.035 మి.మీ. వుండెలా రోలరులను బిగించెదరు. రోలరులు మోటరు ద్వారా తిరుగుతున్నప్పుడు రోలరుల మధ్య నుండి వెళ్లు కుక్కింగ్ అయిన సీడ్స్ పలుచటి ఫ్లెక్స్ (అటుకులలా) ఏర్పడును. ఫ్లెకరు నుండి వచ్చు సొయాఫ్లెక్స్ లో 13-14% తేమవుండి, 75-800C ఉష్ణోగ్రతలో వుండును. ఫ్లెక్సులో తేమ ఎక్కువగా వున్నచో అయిల్ ఎక్సుట్రాక్షను సరిగా జరగదు. అలాగే ఎక్కువ ఉష్ణోగ్రత వలన సాల్వెంట్‌ ప్లాంట్లో హెక్సెను వేపరులు అధికంగా ఏర్పడును. అందుచే సొయా ఫ్లెక్స్‌ను చల్లార్చి, తేమను కొంతవరకు తగ్గించి, తరువాత సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షను ప్లాంట్‌నకు పంపెదరు. సొయాఫ్లెక్స్‌ను 'ఫ్లెకరు కూలరు'లో చల్లార్చెదరు.

ఫ్లెకరు కూలరు (Flaker cooler)[మార్చు]

ఇవికూడా రెండు రకాలు. ఒకటి నిలువగా వుండేరకము. మరోకటి క్షితిజసమాంతరంగా వున్న రకము. నిలువురకము (Vertical model) : ఈ రకం నిలువు వర్తులాకారంగా వుందును. మధ్యలో రంధాలున్న పలకవుండి నిలువు వర్తులాకార గది రెండు భాగాలుగా విభజితమై వుండును. .ఫ్లెకరు నుంచి వచ్చిన సోయాఫ్లెక్సు రోటరివాల్వు ద్వారా వచ్చి పైగదిలో పడి, పధ్యలో బిగించిమ పలకమునకువున్న రంధ్రముల ద్వారా గది దిగువభాగంనకు పడును. ఆదే సమయంలో గది అడుగుభాగం నుండి చల్లని గాలిని బ్లోవర్సు ద్వారా లోపలికి ప్రచేశపెట్టబడును. ఈ చల్లని గాలివలన వేడిగావున్న సోయాఫ్లెక్సు చల్లార్చబడును. క్షితిజసమాంతర ఫ్లెకరు కూలరు ': ఈ రకం ఫ్లెకరుకూలరు పొడవుగా దీర్ఘచతురస్త్రంగా వుండును. లోపల కంటిన్యుయస్ గా తిరుగు మెష్‌వున్న కన్వెయరు వుండును. కన్వెయరు మెష్‌ మీద ఫ్లెక్స్ ఒకచివరనుండి, రెండోచివరకు వెళ్ళునప్పుడు చల్లటిగాలిని ఎయిర్‌బ్లోవరుల ద్వారా ప్రసరింపచేసి ఫ్లెక్సును గదిఉషోగ్రతవద్దకు (దాదాపుగా) చల్లార్చెదరు.కూలింగ్‌తో పాటు తేమకూడ 10-11%కు తగ్గింపబడుతుంది. కూలింగ్ అయిన సొయా ఫ్లెక్స్‌ను కన్వెయరు ద్వారా సాలెంట్‌ ప్లాంటునకు పంపెదరు.

సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షను ప్లాంట్[6][మార్చు]

సాల్వెంట్‌ ప్లాంట్లో ఫ్లెక్సు నుండి నూనెను 'ఎక్స్‌ట్రాక్టరు' అనే దానిలో వేరుచెయ్యుదురు. ఎక్స్‌ట్రాక్టరు కూడా దీర్ఘచదరంగా వుండి, లోపల S.S.మెష్ (mesh) వున్న బ్యాండ్‌ కన్వెయరు వుండి, దానికి దిగువన హపరులు వుండును. ఎక్స్‌ట్రాక్టరులో సొయా ఫ్లెక్స్ ఫీడ్ పాయింట్నుండి డిచార్జి పాయింట్కు నెమ్మదిగా బ్యాండ్‌ కన్వెయరు మీద కదులుతూ ముందుకు వెళ్ళుచుండగా, ఫ్లెక్స్ పైన హెక్సెనును స్ప్రీ చెయ్యుదురు. ఫ్లెక్స్ మీద స్ప్రే చెసిన సాల్వెంట్‌ నెమ్మదిగా మెటిరియల్గుండ క్రిందవున్న హపరుకు వెళ్ళు సమయంలో ఫ్లేక్స్‌లోని అయిల్ను పూర్తిగా తనలో కరగించుకును. ఎక్స్్ట్రాక్టరు పైభాగంలో 7-10 స్ప్రేలుండి వరుస క్రమంలో స్ప్రే అగును. మెటెరియల్ ఎక్క్స్‌ట్రాక్టరు చివరకు వచ్చెటప్పటికి, సొయాఫ్లెక్స్నుండి అయిల్ పూర్తిగా గ్రహింపబడును. నూనెతీసిన సొయాఫ్లేక్స్ను డిఆయిల్డ్‌సొయా మీల్ అంటారు. ఎక్స్‌ట్రాక్టరునుండి డిచార్జి అగు సొయామీల్లో 30-35% వరకు సాల్వెంటు వుండును. ఈ మీల్ను డిసాల్వెంటింగ్‌ టోస్టరుకు పంపి మీల్ ను 100-1050C వరకు వేడి చేసి, సాల్వెంటును వేపరుగా సోయా మీల్‌ నుండి వేరు చెయ్యుదురు. సాల్వెంటు వేపరులను కండెన్సరులో చల్లార్చి, తిరిగి ద్రవ హెక్సెనుగా మార్చెదరు. ఎక్స్‌ట్రాక్టరులో స్ప్రే చెయబడి, అయిల్ను గ్రహించి హపరులలో కలెక్ట్అయిన హెక్సెను, నూనె మిశ్రమం మిసెల్లా టాంకుకు వెళ్ళును. హెక్సెను, నూనె మిశ్రమాన్ని మిసెల్లా అంటారు. ఈ మిసెల్లాను సాల్వెంటు ప్లాంట్‌లోని డిస్టిలెసను విభాగంలో, వ్యాక్యుంలో 80-1000C వరకు స్టీముద్వారా రెండు, మూడు దశలలో వేడిచేసి, హెక్సెనును వేపరుగా చేసి, నూనెనుండి తొలగించెదరు. హెక్సెను వేపరులను కండెన్సరులో చల్లార్చి, ద్రవహెక్సెనుగా చేసి, తిరిగి ప్రాసెసింగ్ లో వుపయోగిస్తారు. సొయా ఆయిల్ను 600C కు చల్లార్చి స్టోరెజి టాంకులకు పంపెదరు. సాల్వెంట్‌ ప్లాంట్ ద్వారా తీసిన సోయానూనె నేరుగా వంటనూనెగా వాడుటకు పనికిరాదు. దీనిని క్రూడాయిల్ ఆందురు, క్రూడాయిల్లో గమ్స్, ఫ్రీఫ్యాటి ఆమ్లాలు, మాయిచ్చరు, మలినాలు వుంటాయి. రిపైనరిలో సోయా క్రూడాయిల నుండి, గమ్స్, ఫ్రీఫ్యాటి ఆమ్లాలను తొలగించి, బ్లిచింగ్, డిఒడరైజసన్ చేసి రిపైండ్ ఆయిల్ గా చెసెదరు.

సొయానూనె[మార్చు]

సోయానూనెలో వుండు కొవ్వు ఆమ్లాల పట్టిక [7]

కొవ్వు ఆమ్లం కార్బనుసంఖ్య:బంధాల సంఖ్య శాతం
పామిటిక్‌ ఆమ్లం C 16:0 7-12
స్టియరిక్ ఆమ్లం C18:0 2-6
ఒలిక్ ఆమ్లం C18:1 19-30
లినొలిక్ ఆమ్లం C18:2 50-59
లినొలెనిక్‌ ఆమ్లం C18:3 5-10

సొయా నూనె భౌతిక ధర్మాలు[మార్చు]

పదార్థము విలువలమితి
సాంద్రత 0.912-.0915
ఐయోడిన్ విలువ 120-141
సఫొఫికెసన్ నంబరు 189-195
అన్‌సపొనియబుల్ 1.0%
గమ్స్ 3.0%

సొయా నూనె ఉపయోగాలు[మార్చు]

1. దీనిని వంటనూనెగా వుపయోగిస్తారు.

2. బయో డిజెల్ తయారిలో వాడెదరు[8].

3. సొయానూనెలో 5-10% వరకు అల్పా-లినొలెనిక్ ఫ్యాటి ఆమ్లం ఉంది. అల్పా-లినొలెనిక్‌ ఆసిడ్ ను ఒమెగా-3 ఫ్యాటి ఆమ్లం అంటారు. ఒమెగా-3 ఫ్యాటిఆమ్లం ఎంతో అవసరమైన అత్యవశ్యకమైన ఫ్యాటి ఆమ్లం.

క్రూడ్ సొయా నూనెలో 2.5-3.0% వరకు గమ్స్ ఉన్నాయి. ఈ గమ్స్్‌లో 50% వరకు లెసిథిను ఉంది.అయిల్ను రిపైండ్‌ చేసినప్పుడు తొలగింపబడిన గమ్స్్‌ నుండి లెసిథిన్ను సంగ్రహించెదరు.

మూలాలు[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సోయా_నూనె&oldid=2890764" నుండి వెలికితీశారు