Jump to content

వెర్రిపుచ్చగింజల నూనె

వికీపీడియా నుండి
A Citrullus colocynthis male flower.
Iranian Citrullus colocynthis.
Ripe fruit of Citrullus colocynthis.

వెర్రి పుచ్చ లేదా ఏటిపుచ్చ అనేడి ఈ ఏగప్రాకెడిమొక్క (creeper) కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన మొక్క.వృక్షశాస్త్రనామము: సిట్రల్లస్ కొలోసిథిస్ (citrullus colosynthis).[1] వెర్రిపుచ్చగింజలనుండి తీయునూనె శాకనూనె అయ్యినప్పటికి ఆహరయోగ్యంకాదు. ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో వాడెదరు.

ఇతరభాషలలో పిలుచు పేరు[2]

[మార్చు]

మొక్క-వ్యాప్తి--పెరుగుదల

[మార్చు]

ఇది ఒక ఎడరి మొక్క.ఈ మొక్క మూలపుట్టుకస్థానం ఉత్తర ఆఫ్రికా ఖండం మొరొక్కొలోని సహరా, ఈజిప్టు, సుడాన్.అక్కడునుండి ఇరాన్, ఇండియాలకు వ్యాపించినది[3] ఇసుక నేలలో బాగా పెరుగుతుంది.భారతదేశంలో వాయవ్య, మధ్య, దక్షిణ భారతంలోని, పశ్చిమతీర ప్రాంతాలలో ముఖ్యంగా రాజస్తాన్, గుజరాత్ తీరప్రాంతాలలో వ్యాప్తి ఉంది.అలాగేబెంగాల్, బీహరు రాష్ట్రలలో కూడా.హర్యానా, గుజరాత్, రాజస్తాన్ లలోని పొడినేలల్లో (నీరునిలుపుకొనే గుణంతక్కువగా వున్న) (Arid, సెమి అరిడ్ (semi-arid) నేలలు కూడా ఈ మొక్క పంటకు అనుకూలమైనవే.వర్షపాతం 150-330 మి.మీ.అవసరం.

ఎక్కువ దిగుబడి ఇచ్చురకాలు :GP-148, GP-161, GP-142, GP-285, GP-172

పొడవైన పళ్ళనిచ్చురకాలు :GP-84, GP-172, GP-285,, GP-119

పెద్ద కాయలిచ్చునవి :GP-177, GP-181

ఈ పంటను పండిస్తున్న ఇరతదేశాలు :ఆఫ్ఘానీస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, అరబ్, ఉత్తర ఆఫ్రికా, స్పైన్ (spain, పొర్చుగల్, జపాన్ దేశాలు.

భారతదేశంలో అనుకూలమైన రాష్టాలు :హర్యానా, రాజస్తాన్.

మొక్క- పూలు-కాయలు-గింజలు

[మార్చు]

ఏకవార్షికంగ లేదా బహువార్షికంగాపెంచబడు ప్రాకెడుమొక్క. గుంపుగా పొదవలె నలువైపులవ్యాపిస్తుంది. ఆకులు 5-10 సెం, మీ.పొడవుండి,3-7 సెం.మీ, పరిమాణమున్న ఆకుతమ్మెలను (lobes) కలిగివుండును. ప్రతిమొక్క 15-30 గుండ్రటి కాయును.కాయ వ్యాసం (అడ్డుకొలత)7-10సెం.మీ. వుండును. కాయమీద పసుపు చారలుండును.[4] పూలు :పూలు పసుపుగా లేదా తెల్లగా వుంటాయి.5 పుష్పదళాలను (petals) కలిగి వుండును. కాయ/పండు :అగస్టు-సెప్టెంబరులో కాపుకొస్తాయి. గోళాకారంగా (గుండ్రంగా) పసుపురంగులో 3-4" పరిమాణంలో వుండును. కాయలోపల స్పాంజి పల్పు వుండును. లోపల తెలుపు/బ్రౌనిస్ రంగులో దగ్గరగా నొక్కబడిన విత్తనాలు అధిక సంఖ్యలోనుండును. ఎండిన కాయ 100 గ్రాం.లు తూగును.అందులో 15 గ్రాములగుజ్జుకండ (pulp),62 గ్రాముల గింజలు,, 23 గ్రాముల మందపాటితొక్క (skin) వుండును.గింజలు చాలా తేలికగా వుండును 100 గింజలబరువు 2.7గ్రాములుండును.గింజలనూనెశాతం 20-21% వరకుండును.ప్రస్తుతం 100టన్నుల గింజలను సేకరించు వీలున్నది. ఈగింజలనుండి 18-19వేల టన్నుల నూనెనుతీయవచ్చును. గింజలో మాంసకృత్తులశాతం 25-27% వరకుండును[2].

నూనె

[మార్చు]

గింజలలో నూనె 20-21% (పొట్టు తీసిన పప్పులో 53.0%) వరకుండును.[5] ఎక్సుపెల్లరులు అనబడే నూనెతీయు యంత్రాలద్వారా నూనె తీసిన 12-13% వరకు నూనెవచ్చి, మిగిలినది గింజలచెక్క/పిండి (oil cake) లో వుండిపోవును. కేకులో వుండిపోయిన నూనెను సాల్వెంట్ ప్లాంట్‍లలో ఆడించి 6-7% నూనెను పొందవచ్చును. పాలిపోయిన గోధుమ రంగుతో కూడిన పసుపురంగులో ముడినూనె (crude oil) వుండును. ముడినూనె ఒకరకమైన ప్రత్యేక వాసన వుండి, చేదుగా వుండును.నూనెయొక్క భౌతిక ధర్మాలు, లక్షణాలు అన్ని నూనెలకు ఒకేరకంగా స్థిరంగా వుండవు, మొక్కవంగడాన్నిబట్టి, ఉష్ణోగ్రతను బట్టి పట్టికలోఇచ్చిన సగటు విలువలకు అటు-ఇటూగా వుండును.

వెర్రిపుచ్చ నూనె భౌతికలక్షణాల పట్టిక[6]

భౌతిక లక్షణాలు మితి
వక్రీభవన సూచిక 280Cవద్ద 1.4725
అయోడిన్ విలువ 117-122
సపనిఫికెసను విలువ 173
అసఫొనిపియబుల్ పదార్థం 2.4%
ఆమ్ల విలువ 3.97%
విశిష్ట గురుత్వం 280Cవద్ద 0.9257
F.F.A 1.4%
R.M.Value 0.351
Hehner value 91.64
రంగు pale brownish yellow
రుచి చేదు (Bitter)

సాధారణంగా మొక్కల గింజల నుండి తీసిన నూనెలలోని కొవ్వుఆమ్లాల శాతం స్థిరంగా వుండదు. మొక్క రకాన్నిబట్టి, పెరిగిన భూమిస్వాభావాన్నిబట్టి, మరి ఇతర కారణాలఛే నూనె, నూనెలోని కొవ్వుఆమ్లాలశాతంలో వ్యత్యాసం వుంటుంది. పెర్రిపుచ్చ నూనెలో సంతృప్తకొవ్వుఆమ్లాలైన పామిటిక్, స్టియరిక్ కొవ్వుఆమ్లాలు 20-25%వరకు, అసంతృప్త కొవ్వుఆమ్లాలైన ఒలిక్, లినొలిక్ ఆమ్లాలు75-80% వరకున్నాయి.[7]

వెర్రిపుచ్చ నూనెలోని కొవ్వు ఆమ్లాల శాతం (సగటు విలువ)

కొవ్వు ఆమ్లాలు శాతం
పామిటిక్ ఆమ్లం (C16:0) 11-14.2
స్టియరిక్ ఆమ్లం (C18:0) 9.3
ఒలిక్ ఆమ్లం (C18:1) 26.3-37
లినొలిక్ ఆమ్లం ( (C18:2) 50-52

నూనె ఉపయోగాలు

[మార్చు]
  • సబ్బుల పరిశ్రమలలో సబ్బులు చేయుటకు.
  • తలనొప్పికి మర్ధనతైలం (Massage oil) గా బాగా పనిచేయును.
  • వెంట్రులను నల్లబరచు మందులలో వాడెదరు.
  • పుచ్చగింజలనూనెకు దగ్గరి లక్షణాలున్నప్పటి ఈ నూనెను ప్రస్తుతం వంటనూనెగా వాడుటలేదు.
  • దీపపునూనెగా (Illumination of Lamps).
  • జీవ ఇంధనంగా వాడుటకు అనుకూలమైనదని పరిశోధనలలో నిర్ధారించడమైనది[8]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. "Apple (Bitter)". botanical.com. Retrieved 2015-03-09.
  2. 2.0 2.1 SEAHandBook,By The solvent Extractors'AssociationofIndia
  3. "Citrullus colocynthis (L.) Schrad". hort.purdue.edu. 2015-03-09.
  4. "Citrullus Colocynthis". jatrophaworld.org. Retrieved 2015-03-09.
  5. "Characteristics and composition of melon seed oil". joas.agrif.bg.ac.rs. Retrieved 2015-03-09.
  6. "Physico-chemical Composition and lipid classes of Aegle marmelos (Bael) and Citrullus colocynthis (Tumba) Seed Oils" (PDF). jocpr.com. Retrieved 2015-03-09.
  7. "EXTRACTION AND CHARACTERISATION OF CITRULLUS COLOCYNTHIS SEED OIL". ajol.info. Retrieved 2015-03-09.
  8. "Investigating "Egusi" ( Citrullus Colocynthis L.) Seed Oil as Potential Biodiesel Feedstock". econpapers.repec.org. Retrieved 2015-03-09.